విజయ్‌ ‘రౌడీ క్లబ్‌’లో చేరతారా? | Vijay Devarakonda Inviting Fans To Filmfare Awards | Sakshi
Sakshi News home page

Published Mon, Jun 11 2018 2:33 PM | Last Updated on Sun, Jul 14 2019 1:14 PM

Vijay Devarakonda Inviting Fans To Filmfare Awards - Sakshi

పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, అర్జున్‌రెడ్డి సినిమాతో ఓవర్‌నైట్‌ స్టార్‌గా ఎదిగారు విజయ్‌ దేవరకొండ. ఫుల్‌ బిజీగా ఉన్న ఈ యూత్‌ స్టార్‌ ప్రస్తుతం ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుకు నామినేట్‌ అయ్యారు. గతేడాది విడుదలై సంచలనం సృష్టించిన అర్జున్‌ రెడ్డి సినిమాలో నటనకుగాను ఉత్తమ నటుడిగా నామినేట్‌ అయ్యారు. ఈ సందర్భంగా అవార్డు వేడుకలకు తనతో పాటుగా తన అభిమానుల్లో ఒకరిని తనవెంట తీసుకువెళ్లనున్నట్లు విజయ్ తెలిపారు. 

ప్రస్తుతం నోటా మూవీ షూటింగ్‌ కోసం చెన్నైలో ఉన్న విజయ్‌ గత రాత్రి సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. సోషల్‌ మీడియాలో ఓ వీడియోను పోస్ట్‌ చేస్తూ... చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, ప్రభాస్‌, ఎన్టీఆర్‌ లాంటి వాళ్లతో పాటు నేను బెస్ట్‌ యాక్టర్‌గా ఎంపికయ్యాను. ఇదే నాకు అవార్డు గెలిచినట్లు అంటూ చెపుతూ.. తనతో పాటు ఈ వేడుకలకు ఒకర్ని తన వెంట తీసుకెళ్తానని, అందుకుగానూ www.rowdyclub.in లో మీ వివరాలను నమోదు చేసుకోవాలని, అందులోంచి ఒకర్ని వేడుకలకు తనవెంట తీసుకెళ్తానని తెలియజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement