హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త కూతురు అనీషాతో హీరో విశాల్ వివాహం చేయబోతున్నామని ఇటీవల ఆయన తండ్రి, నిర్మాత జీకే రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి విశాల్ పెళ్లి చేసుకోబోయే అనీషా ఎలా ఉంటుందోనని తెలుసుకోవడానికి అభిమానులు, సినీ ప్రేక్షకులు తెగ ఆసక్తి కనబరిచారు. అయితే వారందరి కోసం సంక్రాంతి పండగ రోజున తమ వివాహ బంధానికి సంబంధించిన ప్రకటన చేశారు అనీషా. విశాల్‌తో కలిసి దిగిన ఓ ఫొటోను ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అనీషా విషయానికి వస్తే.. హైదరాబాద్ బిజినెస్‌మేన్ విజయ్ రెడ్డి, పద్మజల కుమార్తె అయిన ఆమె.. అర్జున్ రెడ్డి, పెళ్లి చూపులు వంటి చిత్రాల్లో నటించారు. అర్జున్ రెడ్డి సినిమాలో ఆమె కీర్తి పాత్రని పోషించారు. ఇకపై ఆమె సినిమాల్లో కొనసాగే అవకాశం లేనట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా విశాల్‌పై తనకున్న ఇష్టాన్ని, నమ్మకాన్ని కూడా ఆమె వెల్లడించారు.
గతంలో తన పెళ్లి గురించి వచ్చిన వార్తలపై విశాల్ స్పందిస్తూ.. ‘నా పెళ్లి గురించి ఇలాంటి వార్తలు ఎలా సృష్టిస్తారో అర్థం కావడం లేదు. ఇది మంచిది కాదు. ఇది నా వ్యక్తిగత జీవితం. నా పెళ్లి గురించి అధికారికంగా ప్రకటించడం కంటే సంతోషం ఎముంటుంది.. త్వరలోనే ఆ వివరాలు ఆనందంగా ప్రకటిస్తాన’ని ట్విటర్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment