Anisha
-
Anisha Dixit: సీరియస్ కంటెంట్‌ని.. కామెడీ ట్రాక్‌లో నడిపించడమే ఆమె స్పెషాలిటీ!
యాక్ట్రెస్, మోడల్, కమెడియన్, యూట్యూబర్. ‘రిక్షావాలీ’గా పాపులర్. అదే ఆమె యూట్యూబ్ చానెల్. గర్ల్ సెంట్రిక్ కామెడీకి ఫేమస్. జర్మనీలో పుట్టిపెరిగింది. భారతీయ మహిళల దినచర్య, వాళ్ల ఇబ్బందులు, సమస్యల మీద వీడియోలు చేస్తుంది. సీరియస్ కంటెంట్‌ని కామెడీ ట్రాక్‌లో నడిపించడమే ఆమె స్పెషాలిటీ. ఒక్కమాటలో చెప్పాలంటే ‘రిక్షావాలీ’ అమ్మాయిలను సాధికారత దిశగా ఇన్స్పైర్ చేసే చానెల్! లక్ష్యల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. అనీశా టెడ్ఎక్స్ స్పీకర్ కూడా! -
అనిషా పదుకోన్: మహిళల మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు..
పట్టణాలలో, నగరాలలో మానసిక సమస్యలకు వైద్యం అందుబాటులో ఉంటుంది. పల్లెల్లో ఎలా? ముఖ్యంగా మహిళలకు మానసిక సమస్యలు వస్తే? డిప్రెషన్‌తో బాధ పడ్డ నటి దీపికా పదుకోన్ గ్రామీణ మహిళల మానసిక ఆరోగ్యం కోసం ‘లివ్ లవ్ లాఫ్’ అనే సంస్థను స్థాపించింది. దాని బాధ్యతను చెల్లెలు అనిషా పదుకోన్‌కు అప్పజెప్పింది. అనిషా నిర్వహణలో ఆ సంస్థ ఆరు రాష్ట్రాలలో గ్రామీణ మహిళలకు ఆరోగ్య సేవలు అందిస్తోంది. చెన్నైకి గంటన్నర ప్రయాణ దూరంలో ఉండే తిరువళ్లూరులో శశికళ అనే మహిళకు మతి చలించింది. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఆమెను తీసుకొచ్చి చెన్నైలో చూపిస్తే మందులు వాడాలన్నారు. చెకప్‌ల కోసం, మందుల కోసం నెలకోసారి చెన్నై రావాలంటే డబ్బులు ఖర్చవుతాయి. ఆమె అంత డబ్బు ఖర్చు పెట్టలేని పేద మహిళ. మందులు మానేసింది. మానసిక స్థితి ఇంకా దెబ్బ తిని ఊళ్లో దిమ్మరిగా తిరగడం మొదలెట్టింది. గ్రామీణ స్త్రీల మానసిక ఆరోగ్యం కోసం పని చేస్తున్న ‘లివ్ లవ్ లాఫ్’ సంస్థ ప్రతినిధులకు ఈ సంగతి తెలిసింది. తమతో కలిసి పని చేస్తున్న చెన్నైకి చెందిన వసంతం ఫౌండేషన్‌కు ఈ సంగతి తెలియపరిచారు. ఆ ఫౌండేషన్ వారు ఆమెను తరచు వైద్యుల దగ్గరకు తీసుకెళ్లారు. కావలసిన మందులు కొనిచ్చారు. కేర్‌గివర్‌గా పని చేస్తున్న తల్లికి దారి ఖర్చులు సమకూర్చారు. శశికళకు పూర్తిగా నయమైంది. ఆ తర్వాత ఆమె చిన్న చిల్లరకొట్టు నడుపుకోవడానికి 5000 రూపాయల సహాయం అందించారు. శశికళ ఇప్పుడు తన పిల్లలను చూసుకుంటూ జీవిస్తోంది. ‘ఇలా సహాయం అందాల్సిన వారు మన దేశంలో చాలామంది ఉన్నారు’ అంటుంది అనిషా పదుకోన్. ఆమె ‘లివ్ లవ్ లాఫ్’ సంస్థకు సి.ఇ.ఓ. దీపిక స్థాపించిన సంస్థ తాను డిప్రెషన్‌తో బాధ పడుతున్నట్టు దీపికా పదుకోన్ 2015లో లోకానికి వెల్లడి చేసింది. స్త్రీల మానసిక ఆరోగ్యం గురించి అందరూ ఆలోచించాలని పిలుపునిచ్చింది. అంతే కాదు తన బాధ్యతగా 2016లో బెంగళూరు కేంద్రంగా స్త్రీల మానసిక ఆరోగ్యం కోసం ‘లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్’ను స్థాపించింది. దానికి తన చెల్లెలు అనిషా పదుకోన్‌ను సి.ఇ.ఓగా నియమించింది. అనిషా ఈ సంస్థ కోసం చురుగ్గా పని చేస్తోంది. ఇప్పటికి ఈ ఫౌండేషన్ సేవలను ఆరు రాష్ట్రాలకు విస్తరించింది. ఆ ఆరు రాష్ట్రాలలోని 13 జిల్లాల్లో ఈ సంస్థ వాలంటీర్లు పని చేస్తున్నారు. వీరివల్ల 15,000 మంది గ్రామీణ మహిళలు ఇప్పటి వరకూ మానసిక చికిత్స పొందారు. అంతే కాదు 26,000 మంది సంరక్షకులు, అంగన్వాడి కార్యకర్తలు మానసిక చికిత్సలో ప్రాథమిక అవగాహనకై ట్రయినింగ్ కూడా ఈ సంస్థ వల్ల పొందారు. గోల్ఫ్ ప్లేయర్ అనిషా పదుకోన్ తండ్రి ప్రకాష్ పదుకోన్ ప్రఖ్యాత బాడ్మింటన్ ప్లేయర్ కావడం వల్ల అనిషా స్పోర్ట్స్ పట్ల ఆసక్తి కనపరిచింది. ఆమె గోల్ఫ్ క్రీడను ప్రొఫెషనల్ స్థాయిలో నేర్చుకుని మన దేశం తరఫున అమెచ్యుర్ లెవల్లో ప్రాతినిధ్యం వహించింది. అయితే ఆ ఆటను కొనసాగించే సమయంలోనే దీపికా పడుకోన్ సూచన మేరకు ఫౌండేషన్ బాధ్యతలు తీసుకుంది. ‘ఇక్కడ పని చేయడం మొదలెట్టాక మానసిక సమస్యల తీవ్రత అర్థమైంది. మన దేశంలో 20 కోట్ల మంది మానసిక సమస్యలతో బాధ పడుతున్నారు. వీరిలో గ్రామీణ స్త్రీలు ఎక్కువ శాతం ఉన్నారు. వీరి కోసం మందులు, వైద్యం, పెన్షన్, సంరక్షకుల ఏర్పాటు, ఉపాధి... ఇవన్నీ సాధ్యం కావాలంటే పెద్ద ఎత్తున సాయం కూడా అందాలి. వాలంటీర్లు ముందుకు రావాలి. కలిసి పని చేయాలి’ అంటుంది అనిషా. స్త్రీలు వ్యాయామం చేయడంతో పాటు పోషకాహారం తీసుకుంటూ తగినంత నిద్ర పోవడం అవసరం అంటుందామె. మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు అని పిలుపునిస్తోంది. ఇవి చదవండి: చదువు శక్తినిస్తుంది -
Anisha Dixit: ఎంబీయే అని చెప్పి సీక్రెట్‌గా యాక్టింగ్.. అనుమానం రాకుండా
ఏదైనా కావాలంటే అది ఇచ్చేవరకు మారాం చేస్తూనే ఉంటారు చిన్నారులు. కొందరు మాత్రం... తల్లిదండ్రుల కోపానికి భయపడి, కోరికను మనసులోనే దాచుకుని తమలో తామే బాధపడుతుంటారు. అనిశా దీక్షిత్ది ఇటువంటి మనస్తత్వమే. ఆమెకు సినిమాల్లో నటించడం అంటే ఇష్టం. కానీ తన తండ్రి ‘‘నటనా గిటనా ఏం వద్దు’’ అని గట్టిగా చెప్పడంతో భయపడి మరోసారి నటన ఊసెత్తలేదు. కానీ అనిశాతోపాటు పెరిగి పెద్దదైన నటనాసక్తి.. డిగ్రీ చదువుతున్నానని చెప్పి యాక్టింగ్ కోర్సు చేసేలా చేసింది. తొలిప్రయత్నంలోనే సినిమా అవకాశం వచ్చినప్పటికీ, ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అయినా నిరుత్సాహ పడకుండా యూ ట్యూబ్ వీడియోల ద్వారా ఆకట్టుకుంటూ.. సోషల్ మీడియా స్టార్‌గా ఎదిగింది. జీవితంలో ఎదురయ్యే అనేక ఆటుపోట్లను సానుకూల దృక్పథంతో తీసుకుంటూ ముందుకు సాగితే లక్ష్యాన్ని చేరుకోవచ్చనడానికి అనిశా దీక్షిత్ ఉదాహరణగా నిలుస్తోంది. భారత సంతతికి చెందిన అనిశ్, దివ్యాదీక్షిత్ దంపతులకు జర్మనీలో పుట్టింది అనిశా దీక్షిత్. విదేశంలో ఉన్నప్పటికీ నిరుపేద కుటుంబం కావడంతో అనిశా అనేక రకాల ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ పెరిగింది. తొమ్మిదేళ్లు ఉన్నప్పుడు ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం మొత్తం వీధిన పడినంత పని అయ్యింది. దీంతో బంధువుల ఇంటిలో తల దాచుకున్నారు. కుటుంబ అవసరాల నిమిత్తం, వీధుల్లో చిన్నపాటి వస్తువులను విక్రయించి పొట్ట పోసుకునేవారు. ఇంతటి పేదరికంలోనూ అనిశా మంచి నటిగా ఎదగాలనుకునేది. తన ఆసక్తిని గమనించిన ఆమె తండ్రి ‘‘నువ్వు నటివి కావాల్సిన అవసరం లేదు’’ అంటూ యాక్టింగ్ కోర్సు చేస్తానంటే అస్సలు ఒప్పుకునేవారు కాదు. ఎంబీఏ అనిచెప్పి.. డిగ్రీ పూర్తయిన తరువాత స్విట్జర్లాండ్‌లో ఎమ్బీఏ చేస్తానని ఇంట్లో చెప్పి.. అక్కడ ఎంబీఏలో చేరకుండా సీక్రెట్‌గా యాక్టింగ్, మోడలింగ్ కోర్సు చేసింది. వీకెండ్స్‌లో ఇంటికి వచ్చిన ప్రతిసారి అనిశా తండ్రి బిజినెస్‌కు సంబంధించిన విషయాలను అడుగుతుండేవారు. ఆ ప్రశ్నలకు తన స్నేహితురాలితో మాట్లాడి సరైన సమాధానాలు చెబుతూ తండ్రికి అనుమానం రాకుండా చూసుకునేది. స్విట్జర్లాండ్‌లో కోర్సు పూర్తయ్యాక, వెంటనే ఇండియా వచ్చిన అనిశా ముంబైలోని యాక్టింగ్ స్కూల్లో చేరింది. ఈ స్కూలు ద్వారానే 2013లో బాలీవుడ్ సినిమా ‘పంజాబ్ బోల్దా’లో నటించే అవకాశాన్ని చేజిక్కించుకుంది. అయితే ఆ సినిమా విడుదల అవకముందే తన తండ్రి మరణించారు. ఈ సినిమాను ప్రేక్షకులను ఆదరించకపోవడంతో అనిశా సినిమా కెరియర్ ఆదిలోనే ముగిసింది. ఫేస్బుక్ వ్లాగింగ్.. సినిమా అవకాశాలు రాకపోయినా అనిశా ఏమాత్రం నిరుత్సాహపడలేదు. స్విట్జర్లాండ్‌లో ఉన్నప్పటి నుంచే ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో చిన్నచిన్న వ్లాగ్ వీడియోలను పోస్ట్ చేస్తుండేది. ఇండియా వచ్చిన తరువాత తన రోజూవారి పనులను వీడియోలు తీసి ఎడిట్ చేసి అప్లోడ్ చేసేది. ఇలా క్రమంగా వీడియోలను అప్లోడ్ చేస్తూ మంచి ప్రొఫెషనల్ వీడియో ఎడిటర్‌గా ఎదిగింది. సినిమా అవకాశాలు రాక ఖాళీగా ఉన్న సమయంలో..ఈ అనుభవాన్ని ఉపయోగించుకుని యూ ట్యూబ్ చానల్‌ను ప్రారంభించింది. రిక్షావాలా... ఇండియాలో రవాణాకు వాడే ఆటో రిక్షా(ఆటో)ను తన వీడియోలలో ప్రధాన థీమ్‌గా తీసుకుంది. యూట్యూబ్ చానల్‌కు ‘రిక్షావాలా’ అని పేరు పెట్టుకుంది. ఆటోలో కూర్చోని.. ప్రారంభం లో సినిమా రివ్యూల వీడియోలను పోస్ట్ చేసేది. ‘రామ్‌లీలా’ సినిమా తొలి రివ్యూ వీడియో చేసింది. క్రమంగా లింగ ఆధారిత (జండర్ బేస్డ్) కామెడీ వీడియోలను అప్లోడ్ చేసేది. ఈ వీడియోలు బాగా వైరల్ అయ్యేవి. భారత మహిళలు ఎదుర్కొంటున్న అనేక అభద్రతతో కూడిన అంశాలపై వీడియోలు చేయడంతో అనిశా బాగా పాపులర్ అయ్యింది. ఆ వీడియోల వల్ల సమాజంలో మార్పులు చోటు చేసుకోవడంతో అనిశా సెలబ్రిటిగా మారడమేగాక, సోషల్ మీడియా స్టార్‌గా మారింది. రిక్షావాలి డాట్ కమ్ వెబ్సైట్ ప్రారంభించి, దీనిలో ఇండియా గురించిన ఆర్టికల్స్‌ను కూడా రాసేది. ప్రస్తుతం తన చానల్లో వివిధ కోణాల్లో వీడియోలు అప్లోడ్ చేస్తుంది. వీటిలో స్టోరీటైమ్స్, వ్లాగ్స్ నుంచి లఘు చిత్రాల రివ్యూలు చేస్తోంది. సెలబ్రెటీ గుర్తింపు వచ్చాక తన యూట్యూబ్ చానల్ రిక్షావాలా పేరుని మార్చి తన పేరునే చానల్ పేరుగా మార్చింది. ప్రముఖులతో వీడియోలు అప్లోడ్ చేయడంతో ప్రస్తుతం అనిశా చానల్‌కు ముఫ్పై లక్షల మంది సబ్స్క్రెబర్స్, ఇన్‌స్టాలో ఐదులక్షలమందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. -
విశాల్, అనీశారెడ్డిల పెళ్లి జరుగుతుంది
చెన్నై ,పెరంబూరు: నిర్ణయించిన విధంగా నటుడు విశాల్, అనీశారెడ్డిల వివాహం జరుగుతుందని, విశాల్ తండ్రి, సినీ నిర్మాత జీకే.రెడ్డి స్పష్టం చేశారు. విశాల్, అనీశారెడ్డి పెళ్లి గురించి ఇటీవల రకరకాల వదంతులు ప్రచారం అయిన విషయం తెలిసిందే. నటుడు విశాల్, హైదరాబాద్‌కు చెందిన నటి అనీశారెడ్డిల పెళ్లి నిశ్చితార్థం గత మార్చి 18న కుటుంబసభ్యులు, ముఖ్యమైన బంధుమిత్రుల సమక్షంలో జరిగిన విషయం తెలిసిందే. అదే విధంగా విశాల్ తన వివాహం నడిగర్ సంఘం నూతన భవనంలో జరుగుతుందని ప్రకటించారు. అదేవిధంగా అక్టోబరు 9న వీరి వివాహం జరగనుందనే ప్రచారం జరిగింది. అయితే అందుకు సంబంధించిన వార్తలు రాకపోవడంతో పాటు, విశాల్, అనీశారెడ్డిల పెళ్లి రద్దయ్యిందనే ప్రచారం ఇటీవల సామాజికమాధ్యమాల్లో వైరల్ అయ్యింది. విశాల్,అనీశారెడ్డిల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో విశాల్ ఫొటోలను తన ఇన్‌స్ట్రాగామ్ నుంచి అనీశారెడ్డి తొలగించినట్లు వదంతులు దొర్లాలి. అయితే ఈ విషయం గురించి విశాల్ గానీ, అనీశారెడ్డి గానీ ఇప్పుటి వరకూ స్పందించలేదు. అలాంటిది గురువారం చెన్నైలో జరిగిన దమయంతి చిత్ర మీడియా సమావేశంలో పాల్గొన్న విశాల్ తండ్రి జీకే.రెడ్డిని ఈ విషయం గురించి ప్రశ్నించగా, ఆయన విశాల్, అనీశారెడ్డిల వివాహం నిర్ణయించిన ప్రకారం జరుగుతుందని స్పష్టం చేశారు. అయితే వివాహ తేదీని ఇంకా నిర్ణయించలేదని అన్నారు. నడిగర్ సంఘం నూతన భవనంలో తన పెళ్లి జరగనున్నట్లు విశాల్ ప్రకటించారని, అయితే ఇటీవల జరిగిన నడిగర్‌సంఘం ఎన్నికల ఓట్ల లెక్కింపును కోర్టు నిలిపివేసిందని, ఆ ఫలితాలు వెల్లడయితే విశాల్ జట్టు గెలవడం ఖాయం అని పేర్కొన్నారు. ఆ తరువాత నడిగర్ సంఘం భవన నిర్మాణాన్ని విశాల్ పూర్తి చేస్తారని, తను ప్రకటించిన విధంగా ఆదే నూతన భవనంలో పెళ్లి జరుగుతుందని అన్నారు. అదే విధంగా నటుడు శరత్‌కుమార్, రాధిక శరత్‌కుమార్ తన చిత్రాల్లో నటించారని, వారు, నటి వరలక్ష్మీ తమ కుటుంబసభ్యులేనని పేర్కొన్నారు. వారితో తమకు ఎంలాంటి శత్రుత్వం లేదని జీకే.రెడ్డి ఈ సందర్భంగా అన్నారు. -
విశాల్ పెళ్లి ఆగిపోయిందా?
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్‌కు హైదరాబాద్ అమ్మాయి అనీషాకు ఈ ఏడాది మార్చిలో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వీరిద్దరు బ్రేకప్ చెప్పేసుకున్నట్టుగా కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. కొంతకాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో వీరు పెళ్లి క్యాన్సిల్ చేయాలనుకుంటున్నట్టుగా తమిళ సినీ వర్గాలు చర్చించుకుంటున్నారు. దీనికి తోడు అనీషా.. తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి విశాల్‌తో కలిసి దిగిన ఫోటోలను తొలగించటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్టైంది. విశాల్ ట్విటర్లో మాత్రం అనీషాతో కలిసి దిగిన ఫోటోలు ఇప్పటికీ అలాగే ఉండటంతో ఈ వార్తలు నిజమా.? కాదా..? అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ఈ వార్తలపై ఇరు వర్గాలనుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. -
ముహూర్తం కుదిరింది
విశాల్, తన ప్రేయసి అనీషా ఒక్కటయ్యే తేదీ ఖరారయింది. అక్టోబర్‌లో వీరు పెళ్లిపీటలు ఎక్కనున్నారు. విశాల్, ‘పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి’ చిత్రాల ఫేమ్ అనీశా ప్రేమించుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ జంట నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అక్టోబర్ 9న పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాయి ఇరు కుటుంబాలు. తమిళ నడిగర్ సంఘం (నటీనటుల సంఘం) బిల్డింగ్ పనులు పూర్తయిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని విశాల్ ఆ మధ్య ప్రకటించారు. మరో నాలుగైదు నెలల్లో బిల్డింగ్ పనులు కూడా పూర్తవుతాయని తెలిసింది. -
హాలిడే టైమ్
ప్రొఫెషనల్ లైఫ్‌లో గాయపడ్డానన్న బాధ కొంచెం కూడా లేదు విశాల్‌కు. ఎందుకంటే పర్సనల్ లైఫ్‌ను బాగా ఆస్వాదిస్తున్నారు. సుందర్. సి దర్శకత్వంలో విశాల్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం టర్కీ షెడ్యూల్లో విశాల్ గాయపడ్డారు. దీంతో షూటింగ్‌కు చిన్న బ్రేక్ ఇచ్చారు. ఈ బ్రేక్‌లో విశాల్‌కి బోర్ కొట్టకుండా ఆయన కాబోయే భార్య అనీషా టర్కీలో వాలిపోయారు. ఇద్దరూ హాలిడే టైమ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఫొటోలను షేర్ చేశారు. విశాల్, అనీషాల నిశ్చితార్థం మార్చిలో జరిగింది. ఈ ఏడాది ఆగస్టులో వీరి వివాహం జరగుబోతోందట. -
ఘనంగా విశాల్ నిశ్చితార్థం
-
ఘనంగా హీరో విశాల్ నిశ్చితార్థం!
కోలీవుడ్ హీరో విశాల్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవల తను చేసుకోబోయే అమ్మాయిని అభిమానులకు పరిచయం చేశాడు విశాల్. హైదరాబాద్‌కు చెందిన అనీషాను విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ రోజు హైదరాబాద్‌లోని ఓ హోటల్లో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఎలాంటి ప్రకటన లేకుండా ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌లా నిశ్చితార్థాన్ని ముగించారు. త్వరలోనే వివాహతేది పై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. నడిగర్ సంఘం భవనం నిర్మాణం అయిన తరువాత ఆ భవనంలోనే పెళ్లి చేసుకుంటానని విశాల్ చాలా సార్లు ప్రకటించాడు. త్వరలో భవనం నిర్మాణం కూడా పూర్తికానుందని తెలుస్తోంది. విశాల్ ప్రస్తుతం టెంపర్ రీమేక్‌గా తెరకెక్కుతున్న అయోగ్య సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘అర్జున్ రెడ్డి’ నటితో విశాల్ పెళ్లి!
హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త కూతురు అనీషాతో హీరో విశాల్ వివాహం చేయబోతున్నామని ఇటీవల ఆయన తండ్రి, నిర్మాత జీకే రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి విశాల్ పెళ్లి చేసుకోబోయే అనీషా ఎలా ఉంటుందోనని తెలుసుకోవడానికి అభిమానులు, సినీ ప్రేక్షకులు తెగ ఆసక్తి కనబరిచారు. అయితే వారందరి కోసం సంక్రాంతి పండగ రోజున తమ వివాహ బంధానికి సంబంధించిన ప్రకటన చేశారు అనీషా. విశాల్‌తో కలిసి దిగిన ఓ ఫొటోను ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనీషా విషయానికి వస్తే.. హైదరాబాద్ బిజినెస్‌మేన్ విజయ్ రెడ్డి, పద్మజల కుమార్తె అయిన ఆమె.. అర్జున్ రెడ్డి, పెళ్లి చూపులు వంటి చిత్రాల్లో నటించారు. అర్జున్ రెడ్డి సినిమాలో ఆమె కీర్తి పాత్రని పోషించారు. ఇకపై ఆమె సినిమాల్లో కొనసాగే అవకాశం లేనట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా విశాల్‌పై తనకున్న ఇష్టాన్ని, నమ్మకాన్ని కూడా ఆమె వెల్లడించారు. గతంలో తన పెళ్లి గురించి వచ్చిన వార్తలపై విశాల్ స్పందిస్తూ.. ‘నా పెళ్లి గురించి ఇలాంటి వార్తలు ఎలా సృష్టిస్తారో అర్థం కావడం లేదు. ఇది మంచిది కాదు. ఇది నా వ్యక్తిగత జీవితం. నా పెళ్లి గురించి అధికారికంగా ప్రకటించడం కంటే సంతోషం ఎముంటుంది.. త్వరలోనే ఆ వివరాలు ఆనందంగా ప్రకటిస్తాన’ని ట్విటర్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. View this post on Instagram Happy Sankranti! To the start of something new. Thank you all for everything you've done; Been a part of my growth, my learning, my observations, my inspiration, my truth, my hurt, my strength, my reason or all that has brought me to where I am today, who I am today. Soon enough, I will be on a new journey and I yearn to live up to all of my dreams and goals and the challenges I have put up for myself. I finally found somebody to go down the path of life with, loving him and life with true passion. I look up to this man for all that he stands for and for all of his heart. I vow to give back to him, the families and the people around with this step forward. I vow to be the best that I can be, intention towards collective learning, love and moral value. #LoveAlways A post shared by Anisha Alla (@bluewatermelon17) on Jan 15, 2019 at 4:13am PST -
విశాల్ లవ్ మ్యారేజ్
‘ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు’ అంటుంటారు. కానీ విశాల్ విషయంలో ఇది రివర్స్. ‘బిల్డింగ్ కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’ అనాలి. తమిళ నటీనటుల సంఘానికి సొంత భవనం నిర్మించాకే పెళ్లి అని గతంలో విశాల్ పలు సందర్భాల్లో చెప్పారు. అది నిర్మాణంలో ఉంది. దాంతో పాటు నిర్మాతల సంఘం అధ్యక్షుడిగా నిర్మాతల మండలి కోసం ఓ భవంతి కట్టిస్తున్నారు విశాల్. ఇక పెళ్లి చేసుకోవడమే ఆలస్యం. పెళ్లి కూడా ఖరారైంది. ప్రస్తుతం విశాల్ పెళ్లి గురించే కోలీవుడ్‌లో చర్చ. (విశాల్ పెళ్లి.. వరలక్ష్మి ఘాటు రిప్లై) ‘త్వరలోనే హైదరాబాద్‌కు చెందిన బిజినెస్‌మేన్ కూతురు అనీషాతో విశాల్ వివాహం చేయబోతున్నాం’ అని విశాల్ తండ్రి, నిర్మాత జీకే రెడ్డి ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాంతో అది పెద్దలు కుదిర్చిన వివాహం అనుకున్నారంతా. కానీ ప్రేమ వివాహమే అని విశాల్ కన్ఫర్మ్ చేశారు. హైదరాబాద్ బిజినెస్‌మేన్ విజయ్ రెడ్డి, పద్మజ కుమార్తె అనీషను విశాల్ పెళ్లాడనున్నారు. ‘‘మాది లవ్ మ్యారేజ్. వచ్చే వారంలో మా రెండు కుటుంబాలు కలుసుకొని ఎంగేజ్మెంట్ డేట్‌ని ఫిక్స్ చేస్తారు. నిర్మాతల సంఘం నూతన భవన నిర్మాణం పూర్తయ్యాక, అందులోనే పెళ్లి చేసుకుంటాను’’ అని విశాల్ పేర్కొన్నారు. -
మంత్రి అమర్నాథ్రెడ్డికి షాక్
సాక్షి, తిరుపతి: పుంగనూరు టీడీపీ అభ్యర్థిగా అనీషారెడ్డిని ప్రకటించడం జిల్లా మంత్రి అమర్నాథ్రెడ్డికి మింగుడుపడటం లేదని తెలిసింది. ఈమె అభ్యర్థిత్వాన్ని అమర్నాథ్రెడ్డి వ్యతిరేకిస్తున్నట్లు భోగట్టా. ఈమె ఎంపిక విషయంలో సీఎం నుంచి తనకు ఎటువంటి సమాచారం లేకపోవడంపై మంత్రి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పుంగనూరు అసెంబ్లీ స్థానం టీడీపీ అధినేతకు మొదటి నుంచీ పెద్ద సవాలు. ఇక్కడ పాగా వేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడి ఎమ్మెల్యే..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఢీకొనే అభ్యర్థి ఎంపికపై మల్లగుల్లాలు పడ్డారు. జిల్లా నాయకులతో పలుమార్లు సమావేశమై చర్చించారు. ఈ అసెంబ్లీ స్థానంలో విజయం సాధించడం అసాధ్యమని, తెలిసి చేతులు కాల్చుకోవడం ఎందుకని పలువురు టీడీపీ నేతలు పోటీకి విముఖత వ్యక్తం చేశారు. మంత్రి అమర్నాథ్రెడ్డి ఈ సారి పుంగనూరు నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగినా... పోటీ చేయడానికి ఇష్టపడలేదని సమాచారం. ఈ పరిస్థితుల్లో తనే ఎవరో ఒకరిని తెరపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా పలువురితో చర్చలు జరిపారు. ఈ చర్చలు కొలిక్కి వచ్చే సమయంలో సీఎం చంద్రబాబు అనీషారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. దీంతో అమర్నాథ్రెడ్డి షాక్ అయ్యారు. అమర్‌కి ఇష్టం లేదు.. అయినా ఇస్తున్నా పుంగనూరు అభ్యర్థిగా పోటీ చేయాలని టీడీపీ నేత శ్రీనాథ్‌రెడ్డి సతీమణి, మంత్రి అమర్నాథ్రెడ్డి మరదలు అనీషారెడ్డి 2004 నుంచి ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు 2004లో వెంకటరమణరాజును అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరి టికెట్ ఆశించినా ప్రయోజనం లేకుండా పోయింది. మళ్లీ టీడీపీలోకి వచ్చి 2014లోనూ పుంగనూరు టికెట్ కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేశారు. రెండు పర్యాయాలు టీడీపీ నుంచి తిరస్కారం ఎదురైంది. టికెట్ రాకపోవడానికి బంధువులతో పాటు అమర్నాథ్రెడ్డి కూడా కారణమనే ప్రచారం జరిగింది. క్వారీ వ్యాపారంలో వచ్చిన విభేదాల కారణంగా అమర్నాథ్రెడ్డి నుంచి అనీషారెడ్డి విడిపోయినట్లు తెలిసింది. అప్పటి నుంచి రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగినట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో అమర్నాథ్రెడ్డి తనకు నమ్మకంగా ఉన్న వారిని పుంగనూరు అభ్యర్థిగా ఎంపిక చేయాలని భావించారు. ఈ విషయమై చంద్రబాబు పలుమార్లు ప్రస్తావించినా మంత్రి వాయిదా వేస్తూ వచ్చినట్లు తెలిసింది. అదే సమయంలో అనీషారెడ్డి పేరు ప్రస్తావనకు వస్తే అమర్నాథ్రెడ్డి వ్యతిరేకించినట్లు సమాచారం. చివరకు మంత్రికి సమాచారం లేకుండా చంద్రబాబు అనీషారెడ్డిని టీడీపీ ఇన్చార్జ్గా ప్రకటిం చారు. ‘అమర్నాథ్రెడ్డి వ్యతిరేకించినా... నీకే పుంగనూరు బాధ్యతలు అప్పగిస్తున్నా’ అని సీఎం స్వయంగా చెప్పినట్లు ఆమె వర్గీయులంటున్నారు. సీఎం ప్రకటనతో రెండు కుటుంబాల మధ్య మరింత అంతరం పెరిగింది. -
ఈ బుజ్జీ హీరోయిన్ ఎవరో తెలుసో!
చిన్నప్పటి ఫొటోలు ఎవరికైనా మధురానుభూతులను పంచుతాయి. ఆ ఫొటోలను చూస్తే ఒక్కసారిగా బాల్యం గుర్తుకొస్తుంది. అదేవిధంగా ఓ ప్రముఖ నటికి బాల్యం గుర్తొచ్చినట్టు ఉంది. అందుకే తన చిన్ననాటి బాల్యపు ఫొటోను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇంతకూ ఆ నటి ఎవరంటే.. ఇటీవలే హాలీవుడ్లో అడుగుపెట్టి.. కెరీర్లో ఓ వెలుగువెలుతున్న దీపికా పదుకొణే. చిన్నప్పుడు సోదరి అనీషాతో కలిసి దిగిన ఫొటోను దీపిక అభిమానులతో పంచుకొంది. ముద్దులొలికేలా ముద్దుముద్దుగా నవ్వుతూ ఉన్న ఈ బుజ్జాయిల ఫొటో ప్రస్తుతం ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. గత ఏడాది బాలీవుడ్లో 'బాజీరావు మస్తానీ', హాలీవుడ్లో 'ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్కేగ్' సినిమాలదో దీపిక అలరించిన సంగతి తెలిసిందే. ❤ A post shared by Deepika Padukone (@deepikapadukone) on Apr 5, 2017 at 11:43pm PDT -
'రన్' సినిమా ఆడియో విడుదల
-
ఎమ్జీఆర్ వారసుడొస్తున్నాడు!
దివంగత నటదిగ్గజం ఎమ్జీఆర్ వారసుడు సినీరంగ ప్రవేశం చేస్తున్నారు. ఆయన మనవడు రామచంద్రన్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం కబాలి తోట్టమ్. నవ నటుడు విక్కీ మరో కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో అనీషా నాయకిగా పరిచయం అవుతున్నారు. గోలీసోడా చిత్ర విలన్ మధు కీలక పాత్రను పోషిస్తున్న ఈ చిత్రంలో కే.రాజన్, రోబోశంకర్, ఢిల్లీ ఆర్.మురుగానందన్, దాస్పాండియన్, సుమలత, రాధ, అరుణ్‌పాండియన్, తంజై తమిళ్ పిత్తన్ ముఖ్యపాత్రల్లో నటించనున్నారు. తిరుచెందూర్ అరుళ్మిగు సుబ్రమణిసామి పిక్చర్స్, డాన్స్ లింగా మీడియా టీకే.రాజేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం కబాలి తోట్టమ్. నవ దర్శకుడు టీఆర్.భాస్కర్ కథ, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు సోమవారం ఉదయం స్థానిక వడపళనిలోగల ఆర్కేవీ స్టూడియోలో జరిగాయి. చిత్రం గురించి దర్శకుడు వివరిస్తూ దుర్మార్గాన్ని ఎదిరించడానికి ఒకడు వస్తాడు అన్నదే చిత్ర ఒన్లైన్ స్టోరీ అని పేర్కొన్నారు. ఇది చెన్నైలో జరిగిన యదార్థ సంఘటనకు కమర్షియల్ అంశాలు జోడించి తెరకెక్కిస్తున్న చిత్రం అని చెప్పారు. చిత్రాన్ని చెన్నైలోనే చిత్రీకరించనున్నట్లు వెల్లడించారు. దీనికి యూకే.మురళి సంగీతాన్ని అందిస్తున్నారని తెలిపారు. ఈ చిత్ర పూజా కార్యక్రమానికి దర్శకులు పేరరసు, సముద్రకని, కార్తీక్‌సుబ్బరాజ్, నటుడు సౌందరరాజ్, చిత్రాలక్ష్మణన్ హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. -
తనీష్, అనీషా జంటగా ప్రేమకథా చిత్రం
తనీష్, అనీషా జంటగా ఓ ప్రేమకథా చిత్రం రూపొందుతోంది. పంచగిరి క్రియేషన్స్ పతాకంపై కుమార్ బ్రదర్స్ సమర్పణలో శ్రీనివాస్ ఏలిజాల,డి.సురేష్ నిర్మించనున్న ఈ చిత్రానికి భాస్కర్ దర్శకుడు. ఈ నెల 30న తిరుపతిలో రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన శ్రీనివాప్ ఏలిజాల చిత్ర విశేషాలను తెలియజేశారు.ఇటీవల పాటల రికార్డింగ్ ను ప్రారంభించామని, తనీష్ కు ఇదొక వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం అవుతుందన్నారు. క్యూట్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో కుటుంబ ప్రేక్షకులను అలరించే అంశాలను కూడా ఉన్నాయన్నారు. నేటి తరం ప్రతినిధిగా తనీష్ కనిపిస్తాడని, మలేషియాలో చిత్రీకరించబోయే పాటలు చిత్రానికి ప్రధాన ఆకర్షణ ఉంటాయన్నారు. సుమన్ శెట్టి, దండపాణి, సీత తదితరులు ముఖ్యపాత్రల్లో నటించనున్న ఈ చిత్రానికి సంగీతం:సాదక్ హాసన్.