కోలీవుడ్ స్టార్ హీరో విశాల్‌కు హైదరాబాద్ అమ్మాయి అనీషాకు ఈ ఏడాది మార్చిలో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వీరిద్దరు బ్రేకప్ చెప్పేసుకున్నట్టుగా కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. కొంతకాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలో వీరు పెళ్లి క్యాన్సిల్ చేయాలనుకుంటున్నట్టుగా తమిళ సినీ వర్గాలు చర్చించుకుంటున్నారు. దీనికి తోడు అనీషా.. తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి విశాల్‌తో కలిసి దిగిన ఫోటోలను తొలగించటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్టైంది. విశాల్ ట్విటర్‌లో మాత్రం అనీషాతో కలిసి దిగిన ఫోటోలు ఇప్పటికీ అలాగే ఉండటంతో ఈ వార్తలు నిజమా.? కాదా..? అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ఈ వార్తలపై ఇరు వర్గాలనుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.
విశాల్ పెళ్లి ఆగిపోయిందా?
Published Thu, Aug 22 2019 12:56 PM | Last Updated on Thu, Aug 22 2019 1:01 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment