ఘనంగా హీరో విశాల్‌ నిశ్చితార్థం! | Vishal And Girlfriend Anisha Alla Engagement | Sakshi
Sakshi News home page

ఘనంగా హీరో విశాల్‌ నిశ్చితార్థం!

Published Sat, Mar 16 2019 3:42 PM | Last Updated on Sat, Mar 16 2019 8:29 PM

Vishal And Girlfriend Anisha Alla Engagement - Sakshi

కోలీవుడ్ హీరో విశాల్‌ త్వరలో పెళ్లి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవల తను చేసుకోబోయే అమ్మాయిని అభిమానులకు పరిచయం చేశాడు విశాల్‌. హైదరాబాద్‌కు చెందిన అనీషాను విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ రోజు హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు  మాత్రమే హాజరయ్యారు.

ఎలాంటి ప్రకటన లేకుండా ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌లా నిశ్చితార్థాన్ని ముగించారు. త్వరలోనే వివాహతేది పై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. నడిగర్‌ సంఘం భవనం నిర్మాణం అయిన తరువాత ఆ భవనంలోనే పెళ్లి చేసుకుంటానని విశాల్‌ చాలా సార్లు ప్రకటించాడు. త్వరలో భవనం నిర్మాణం కూడా పూర్తికానుందని తెలుస్తోంది. విశాల్‌ ప్రస్తుతం టెంపర్‌ రీమేక్‌గా తెరకెక్కుతున్న అయోగ్య సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement