చిన్నప్పటి ఫొటోలు ఎవరికైనా మధురానుభూతులను పంచుతాయి. ఆ ఫొటోలను చూస్తే ఒక్కసారిగా బాల్యం గుర్తుకొస్తుంది. అదేవిధంగా ఓ ప్రముఖ నటికి బాల్యం గుర్తొచ్చినట్టు ఉంది. అందుకే తన చిన్ననాటి బాల్యపు ఫొటోను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇంతకూ ఆ నటి ఎవరంటే.. ఇటీవలే హాలీవుడ్లో అడుగుపెట్టి.. కెరీర్లో ఓ వెలుగువెలుతున్న దీపికా పదుకొణే.
చిన్నప్పుడు సోదరి అనీషాతో కలిసి దిగిన ఫొటోను దీపిక అభిమానులతో పంచుకొంది. ముద్దులొలికేలా ముద్దుముద్దుగా నవ్వుతూ ఉన్న ఈ బుజ్జాయిల ఫొటో ప్రస్తుతం ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. గత ఏడాది బాలీవుడ్లో 'బాజీరావు మస్తానీ', హాలీవుడ్లో 'ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్కేగ్' సినిమాలదో దీపిక అలరించిన సంగతి తెలిసిందే.
ఈ బుజ్జీ హీరోయిన్ ఎవరో తెలుసో!
Published Thu, Apr 6 2017 6:21 PM | Last Updated on Tue, Sep 5 2017 8:07 AM
Advertisement