Kalki Heroine Deepika Padukone Childhood Pic Goes Viral on Social Media - Sakshi
Sakshi News home page

Guess The Actress: ఈమె స్టార్ హీరోయిన్.. ఆ హీరోని పెళ్లాడింది!

Published Fri, Jul 21 2023 9:23 PM | Last Updated on Fri, Jul 21 2023 9:27 PM

Kalki Heroine Deepika Padukone Childhood Pic - Sakshi

దక్షిణాది భామల‍్ని బాలీవుడ్ పెద్దగా పట్టించుకోదు. ఒకవేళ ఇక్కడి నుంచి వెళ్లి సినిమాలు చేసినా మహా అయితే ఒకటో రెండో అంతే. కానీ పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి మాత్రం.. ఇక్కడ నుంచి వెళ్లి హిందీలో పాగా వేసింది. ఇప్పుడు స్టార్ హీరోయిన్ హిందీ చిత్రసీమని ఏలుతోంది. ప్రస‍్తుతం పాన్ ఇండియా మూవీస్ అంటే డైరెక్టర్స్ ఈమె వైపే చూస్తున్నారు. 

(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' గ్లింప్స్‌లో కమల్‌హాసన్.. ఎక్కడో గుర్తుపట్టారా?)

పైన ఫొటోలో కనిపిస్తున్న పాప పేరు దీపికా పదుకొణె. ప్రభాస్ ప్రాజెక్ట్ K అలియాస్ 'కల్కి 2898 AD'లో ఈమెనే హీరోయిన్. కాకపోతే వ్యక్తిగత కారణాల వల్ల శాన్ డియాగోలో జరిగిన కామికాన్ ఈవెంట్‌కి వెళ్లలేకపోయింది. సరే దీపికా వ్యక్తిగత విషయానికొస్తే.. బెంగళూరుకు చెందిన స్టార్ షట్లర్ ప్రకాశ్ పదుకొణె కూతురు ఈమె. తండ్రిలా స్పోర్ట్స్ ప్లేయర్ కాకుండా నటిగా మారింది. ఫస్ట్ మూవీ కన్నడలోనే చేసింది. కొన్నాళ్లకు బాలీవుడ్ కు షిప్ట్ అయిపోయింది.

యాక్టర్ గా నిరూపించుకున్న ఈ బ్యూటీ.. స్టార్ హీరోల తనకోసం ఎదురుచూసే రేంజుకి వెళ్లిపోయింది. హిందీతో పాటు ఇంగ్లీష్ సినిమాల్లో నటించి, గ్లోబల్ వైడ్ గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే పద్మావత్, రామ్ లీలా సినిమాల్లో తనతో కలిసి నటించిన రణ్‌వీర్ సింగ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం కెరీర్ పరంగా ఇద్దరూ బిజీ బిజీ. దీపికా చేస్తున్న వాటిలో ప్రభాస్ 'కల్కి', మన దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తీస్తున్న మూవీ కావడం విశేషం. గ్లింప్స్‌లో దీపిక అలా కాసేపు కనిపించి సందడి చేసింది.

(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'.. ఆ సీక్రెట్ బయటపెట్టిన కమల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement