Bigg Boss Fame Punarnavi Bhupalam "Cycle" Movie Release Date Announced - Sakshi
Sakshi News home page

కామెడీ+లవ్‌ స్టోరీ: పునర్నవి 'సైకిల్‌'

Published Tue, Jan 12 2021 5:48 PM | Last Updated on Tue, Jan 12 2021 7:19 PM

Punarnavi Bhupalam Cycle Movie Releasing On January 15 - Sakshi

పున‌ర్ణ‌వి భూపాలం, మ‌హ‌త్ రాఘ‌వేంద్ర శ్వేతావ‌ర్మ‌, సూర్య లీడ్‌రోల్స్‌లో ఆట్ల అర్జున్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం 'సైకిల్'. గ్రే మీడియా బ్యాన‌ర్ పై, ఓవ‌ర‌సీస్ నెట్‌వ‌ర్క్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ విజ‌యా ఫిలింస్‌, ఓంశ్రీ మ‌ణికంఠా ఫిలింస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం. సంక్రాంతి బరిలో పోటీకి దిగుతున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జనవరి 15న రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు అర్జున్‌రెడ్డి మాట్టాడుతూ... "భారతీయ సినిమాలో ఇంకా చెప్ప‌టానికేం లేవు అన్నట్లుగా బోలెడన్ని క‌థ‌ల‌తో సినిమాలొచ్చాయి."

"ఐనా కొత్త క‌థ‌లు రాస్తున్నాం కొత్త సినిమాలు తీస్తున్నాం. ఆ ప్ర‌య‌త్నంలోనే పుట్టిన్ప‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఇంజ‌న్‌కాని, ఇంధ‌నం కానీ లేకుండా న‌డుస్తూ, మ‌న‌తో క‌లిసి ప్ర‌యాణిస్తున్న సైకిల్ పేరుని మా సినిమాకి టైటిల్‌గా పెట్టుకుని ఫ‌స్ట్ సీన్‌లోనే దానికి సంబంధించిన ఇంట్ర‌స్టింగ్ లింక్‌తో క్లీన్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ తీశాము. ఈ చిత్రంలో హీరో, హీరోయిన్స్‌తో పాటు సుద‌ర్శ‌న్‌, అనితా చౌద‌రి, క్యారెక్ట‌ర్స్ మ్యాజిక్ చేస్తాయి. వీళ్ల‌తోపాటు, సూర్య‌, మ‌ధుమ‌ణి న‌వీన్‌నేని, ఆర్ఎక్స్ ‌100 ల‌క్ష్మ‌ణ్‌, అన్న‌పూర్ణ‌మ్మ జోగీబ్ర‌ద‌ర్స్ కూడా చాలా ఎంట‌ర్‌టైన్ చేస్తారు. కామెడీ జోన‌ర్ సినిమాకి బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీ మ్యాజిక్ యాడ్ ఐతే, ఎంత కొత్త‌గా వుంటుందో, మా చిత్రంతో చూస్తారు" అ‌ని తెలిపారు. (చదవండి: స్వర్గంలో అడుగుపెట్టి 15 ఏళ్లు: రామ్‌)

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు చేరువగా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో 90  స్క్రీన్లలో విడుదల చేస్తోంది చిత్రయూనిట్‌. త్వ‌ర‌లో టీజ‌ర్‌తోపాటు, ఆడియో రిలీజ్ చేసుకుని ధియేట‌ర్స్‌లోకి రాబోతున్న ఈ సినిమాకు నిర్మాత‌లు, పి.రాంప్ర‌సాద్‌, డి.న‌వీన్‌రెడ్డి, స‌హ‌నిర్మాతఃవి.బాలాజీరాజు, కెమెరాఃసిద్ధంమ‌నోహ‌ర్‌, సంగీతంః జి.ఎం.స‌తీష్‌, ఎడిటింగ్ః గ‌డుతూరిస‌త్య‌, ఆర్ట్ః రామ్‌కుమార్‌, పిఆర్వో శ్రీ, ప‌బ్లిసిటీ డిజైన‌ర్ ఓంకార్ క‌డియం. (చదవండి: ఈ హ్యాపీనెస్ ఏమిటి? ఎట్లా ఇట్లా అయితే?: కత్తి మహేష్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement