
టాలీవుడ్లో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమా బాలీవుడ్‌లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ వర్షన్‌ను డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. కబీర్ సింగ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షాహిద్ కపూర్, కియారా అద్వానీలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.
ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ ఇటీవల టీజర్‌ను రిలీజ్ చేశారు. అర్జున్ రెడ్డి స్టైల్‌లోనే కట్ చేసిన టీజర్‌కు బాలీవుడ్‌లో సూపర్బ్ రెస్సాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ఈ నెల 13న కబీర్ సింగ్ ట్రైలర్ రిలీజ్ కానుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూన్ 21న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Trailer out on 13th May! #KabirSingh@Advani_Kiara @imvangasandeep @itsBhushanKumar @MuradKhetani #KrishanKumar @ashwinvarde @TSeries @Cine1Studios @KabirSinghMovie pic.twitter.com/RnrRsAtibv
— Shahid Kapoor (@shahidkapoor) 8 May 2019