
ఒక్క సినిమాతోనే క్రేజీ డైరెక్టర్‌గా మారిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. తొలి సినిమా అర్జున్ రెడ్డితోనే సందీప్ అందరి దృష్టిని ఆకర్షించాడు. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన అర్జున్ రెడ్డి సంచలన విజయం సాదించటంతో పాటు సినీ ప్రముఖులు స్టార్ హీరోల ప్రశంసలు సాధించింది. దీంతో సందీప్‌తో సినిమాలు చేసేందుకు హీరోలు దర్శకులు క్యూ కట్టారు. ప్రస్తుతం అర్జున్ రెడ్డి సినిమాను కబీర్ ఖాన్ పేరుతో బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్న సందీప్, ఇంత వరకు తెలుగు సినిమాను ప్రకటించలేదు.
కొద్ది రోజులుగా మహేష్ బాబు హీరోగా సందీప్ సినిమా ఉంటుదన్న టాక్ గట్టిగా వినిపించింది. అయితే తాజా సమాచారం ప్రకారం సందీప్.. ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే ఎన్టీఆర్‌కు కథ కూడా వినిపించాడన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌తో కలిసి ఆర్‌ఆర్‌ఆర్ (వర్కింగ్ టైటిల్)లో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత సందీప్ సినిమా ఉండే చాన్స్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment