
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. మహేష్ 25 సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా తరువాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు మహేష్. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా రొమాంటిక్ డ్రామా అన్న ప్రచారం జరుగుతోంది. అయితే సుకుమార్ సినిమా తరువాత అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటించేందుకు మహేష్ ఓకె చెప్పినట్టుగా టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం అర్జున్ రెడ్డి సినిమాను బాలీవుడ్‌లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేస్తున్న సందీప్ రెడ్డి వంగా.. మహేష్ కోసం డిఫరెంట్ స్టోరీని సిద్ధం చేశాడట. మహేష్ ఇంతవరకు చేయని క్రైమ్ డ్రామా తరహా కథను సూపర్ స్టార్ కోసం రెడీ చేశాడట. ఇప్పటికే కథ విన్న మహేష్ ఓకె చేశాడన్న ప్రచారం జరుగుతోంది. అన్ని అనుకున్నట్టుగా జరిగితే సుకుమార్ సినిమా తరువాత సందీప్ సినిమానే పట్టాలెక్కే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment