
సినిమా: అర్జున్‌రెడ్డి ఈ పేరు తెలుగు సినీరంగంలో సంచలనం సృష్టించింది. ఇప్పుడు తమిళంలోకి రానుంది. విజయ్‌దేవరకొండ నటించిన తెలుగు చిత్రం అర్జున్‌రెడ్డి. ఈ చిత్రం తెలుగులోనే కాకుండా తమిళనాట విడుదలై వసూళ్ల వర్షం కురిపించింది. కాగా అదే విజయ్‌దేవరకొండ నేరుగా తమిళంలో నటించిన నోటా చిత్రం మంచి పేరు తెచ్చుకుంది. ఆయన హీరోగా నటించిన మరో తెలుగు చిత్రం ద్వారక. ఈ చిత్రానిప్పుడు అర్జున్‌రెడ్డి పేరుతో తమిళంలోకి శ్రీ లక్ష్మీజ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఏఎన్.బాలా అనువదిస్తున్నారు.
ఈ చిత్రం గురించి ఆయన తెలుపుతూ ఇందులో విజయ్‌దేవరకొండకు జంటగా పూజాజవేరి నటించగా, ఇతరు ముఖ్య పాత్రల్లో ప్రకాశ్‌రాజ్, బాహుబలి ప్రభాకర్, మురళీశర్మ, సురేశ్‌వాణి పృథ్వీరాజ్ నటించారన్నారు. అర్జున్‌రెడ్డి పూర్తి వినోదభరితంగా సాగే కథా చిత్రంగా ఉంటుందన్నారు. చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. అర్జున్‌రెడ్డి కుటుంబ సమేతంగా చూసి ఆనందించే చిత్రంగా ఉంటుందని నిర్మాత తెలిపారు. దీనికి శ్యామ్ కే.నాయుడు ఛాయాగ్రహణం, సాయి కార్తీక్ సంగీతాన్ని అందించారు.
Comments
Please login to add a commentAdd a comment