Pooja javeri
-
అర్జున్‌రెడ్డి విడుదలకు సిద్ధం
సినిమా: అర్జున్‌రెడ్డి ఈ పేరు తెలుగు సినీరంగంలో సంచలనం సృష్టించింది. ఇప్పుడు తమిళంలోకి రానుంది. విజయ్‌దేవరకొండ నటించిన తెలుగు చిత్రం అర్జున్‌రెడ్డి. ఈ చిత్రం తెలుగులోనే కాకుండా తమిళనాట విడుదలై వసూళ్ల వర్షం కురిపించింది. కాగా అదే విజయ్‌దేవరకొండ నేరుగా తమిళంలో నటించిన నోటా చిత్రం మంచి పేరు తెచ్చుకుంది. ఆయన హీరోగా నటించిన మరో తెలుగు చిత్రం ద్వారక. ఈ చిత్రానిప్పుడు అర్జున్‌రెడ్డి పేరుతో తమిళంలోకి శ్రీ లక్ష్మీజ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఏఎన్.బాలా అనువదిస్తున్నారు. ఈ చిత్రం గురించి ఆయన తెలుపుతూ ఇందులో విజయ్‌దేవరకొండకు జంటగా పూజాజవేరి నటించగా, ఇతరు ముఖ్య పాత్రల్లో ప్రకాశ్‌రాజ్, బాహుబలి ప్రభాకర్, మురళీశర్మ, సురేశ్‌వాణి పృథ్వీరాజ్ నటించారన్నారు. అర్జున్‌రెడ్డి పూర్తి వినోదభరితంగా సాగే కథా చిత్రంగా ఉంటుందన్నారు. చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. అర్జున్‌రెడ్డి కుటుంబ సమేతంగా చూసి ఆనందించే చిత్రంగా ఉంటుందని నిర్మాత తెలిపారు. దీనికి శ్యామ్ కే.నాయుడు ఛాయాగ్రహణం, సాయి కార్తీక్ సంగీతాన్ని అందించారు. -
మహిళల గురించి చెప్పే సినిమా
‘మైనే ప్యార్ కియా’ (‘ప్రేమ పావురాలు’) ఫేమ్ భాగ్యశ్రీ, ‘రోజా’ ఫేమ్ మధుబాల, ‘పెళ్లి సందడి’ ఫేమ్ దీప్తీ భట్నాగర్, ‘జయం’ ఫేమ్ సదా, సుమన్ రంగనాథ్, హరితేజ, పూజా ఝవేరి, హర్షవర్ధన్ రాణే ప్రధాన పాత్రల్లో తెరకెక్కనున్న చిత్రం ‘కిట్టిపార్టీ’. ఈ సినిమాతో సుందర్ పవన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆచార్య క్రియేషన్స్, బ్లూ సర్కిల్ కార్పొరేషన్ పతాకాలపై భోగేంద్ర గుప్తా నిర్మిస్తున్న ఈ సినిమా లోగోని హైదరాబాద్‌లో విడుదల చేశారు. సుందర్ పవన్ మాట్లాడుతూ– ‘‘ఇదొక ఫీమేల్ బడ్డీ డ్రామా. అలాగని మహిళలకు సంబంధించిన సినిమా కాదు. కానీ, సినిమాలో మహిళలే ఎక్కువసేపు కనిపిస్తారు. నాకు తెలిసిన కొన్ని నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో కథ రాసుకున్నా. స్ట్రయిట్ తెలుగు సినిమా ఇది. ఏ సినిమాకూ రీమేక్ కాదు. ఆరుగురు మహిళల చుట్టూ కథ తిరుగుతుంది. భోగేంద్ర గుప్తా లేకపోతే ఈ సినిమా సాధ్యమయ్యేది కాదు. అతిత్వరలో చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు. ‘‘సినిమాలో నటించడానికి అంగీకరించిన నటీనటులకు థ్యాంక్స్’’ అన్నారు భోగేంద్ర గుప్తా. ‘‘జీవితంలో ఒక్క మహిళను హ్యాండిల్ చేయడమే పురుషులకు కష్టమైన పని. మా దర్శకుడు సెట్లో మా ఏడుగురు మహిళలను హ్యాండిల్ చేయాలి’’ అన్నారు భాగ్యశ్రీ (నవ్వుతూ). ‘‘హీరోపై మాత్రమే ఎక్కువ ఫోకస్ చేసే ఇండస్ట్రీలో.. హీరో లేని ఒక సినిమాకు నేను సంతకం చేశా. ఈ చాన్స్ ఇచ్చినందుకు పవన్, గుప్తాగారికి థ్యాంక్స్’’ అన్నారు మధుబాల. ‘‘మహిళల గురించి చెప్పే చిత్రమిది’’ అన్నారు సదా. ‘‘20 ఏళ్ల తర్వాత హైదరాబాద్ రావడం హ్యాపీగా ఉంది. ‘పెళ్లి సందడి’ సినిమా చేసిన రోజులు ఇంకా గుర్తున్నాయి’’ అన్నారు దీప్తీ భట్నాగర్. సుమన్ రంగనాథ్, హరితేజ, పూజా ఝవేరి పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సిద్దార్థ సదాశివుని, కెమెరా: సాయిశ్రీరామ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎస్. రమణారెడ్డి, సహ నిర్మాత: శివ తుర్లపాటి. -
ఫీమేల్ బడ్డీ డ్రామా ‘కిట్టి పార్టీ’
ఆచార్య క్రియేషన్స్, బ్లూ సర్కిల్ కార్పొరేషన్ పతాకాలపై భోగేంద్ర గుప్తా నిర్మిస్తున్న సినిమా ‘కిట్టి పార్టీ’. సుందర్ పవన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో ‘మైనే ప్యార్ కియా’ (తెలుగులో ‘ప్రేమ పావురాలు’) ఫేమ్ భాగ్య శ్రీ, ‘రోజా’ ఫేమ్ మధుబాల, ‘పెళ్లి సందడి’ ఫేమ్ దీప్తీ భట్నాగర్, సదా, సుమన్ రంగనాథ్, హరితేజ, హర్షవర్ధన్ రాణే, పూజా జవేరిలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా లోగో విడుదల చేశారు. అనంతరం దర్శకుడు సుందర్ పవన్ మాట్లాడుతూ ‘ఇదొక ఫీమేల్ బడ్డీ డ్రామా. అలాగని, ఆడవాళ్ళకు సంబంధించిన సినిమా అని చెప్పను. కానీ, సినిమాలో ఆడవాళ్ళు మాత్రమే ఎక్కువసేపు కనిపిస్తారు. నాకు తెలిసిన కొన్ని నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో కథ రాసుకున్నా. స్ట్రయిట్ తెలుగు సినిమా ఇది. ఏ పరభాషా సినిమాకూ రీమేక్ కాదు. వేరే సినిమా స్ఫూర్తితో తీయడం లేదు. ముఖ్యంగా ఆరుగురు మహిళలు చుట్టూ కథ తిరుగుతుంది. భాగ్య శ్రీ, దీప్తీ భట్నాగర్, సుమన్ రంగనాథ్, మధుబాల, సదా, హరితేజ, పూజా జవేరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలో మరిన్ని సినిమా వివరాలు వెల్లడిస్తాం’ అన్నారు. భాగ్య శ్రీ మాట్లాడుతూ ‘జీవితంలో ఒక్క మహిళను హ్యాండిల్ చేయడమే పురుషులకు కష్టమైన పని! నవ్వుతూ... మా దర్శకుడు సెట్లో మా ఏడుగురు మహిళలను హ్యాండిల్ చేయాలి. ఎలా చేస్తాడో! మహిళల దృక్కోణం నుంచి ఆలోచించి ఈ కథ రాసిన దర్శకుడు పవన్‌ని అభినందిస్తున్నా. మహిళల మనస్తత్వాలను అర్థం చేసుకున్నటువంటి దర్శకుడితో పని చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమా హాలీవుడ్లో వచ్చిన ‘డెస్పరేట్ హౌస్‌వైఫ్స్’, ‘సెక్స్ అండ్ ది సిటీ’ సినిమాల తరహాలో ఉంటుంది. ప్రేక్షకులకు తమ జీవితాల్లో ప్రతిరోజూ తారసపడే మహిళల్లో ఎవరో ఒకరు మా పాత్రల్లో ఏదో పాత్రలో కనిపిస్తారు.’ అన్నారు. మధుబాల మాట్లాడుతూ ‘హీరోపై మాత్రమే ఎక్కువ ఫోకస్ చేసే ఇండస్ట్రీలో... హీరో ఎవరూ లేని ఒక సినిమాకు నేను సంతకం చేశా. ఇంటర్వ్యూలలో మెరిల్ స్ట్రీప్ వంటి హాలీవుడ్ తారలు మెయిన్ లీడ్స్‌గా సినిమాలు చేస్తున్నారని చెబుతుంటాం. మేముందుకు అటువంటి సినిమాలు, అటువంటి అద్భుతమైన పాత్రల్లో నటించలేం? ఇప్పుడు చేస్తున్నాం. ఇందులో నేనొక మెయిన్ లీడ్‌గా, పూజా జవేరికి తల్లిగా నటిస్తున్నా. నా చిన్ననాటి స్నేహితురాళ్ళు సుమన్, భాగ్య శ్రీతో నటిస్తుండటం సంతోషంగా ఉంది’ అన్నారు. దీప్తీ భట్నాగర్ మాట్లాడుతూ ‘హైదరాబాద్ రావడం, అదీ 20 ఏళ్ళ తర్వాత రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సిటీ నా ఫస్ట్ లవ్. నాకింకా ‘పెళ్లి సందడి’ సినిమా షూటింగ్ చేసిన రోజులు గుర్తున్నాయి. ఈ సినిమా ఎప్పటికీ నా మనసులో ఉంటుంది. చాలా విరామం తర్వాత మళ్ళీ తెలుగు సినిమాలో నటిండచం సంతోషంగా ఉంది’ అన్నారు. సుమన్ రంగనాథ్ మాట్లాడుతూ ‘నేను తెలుగులో రెండు మూడు సినిమాలు చేశాను. మళ్ళీ తెలుగులో సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ సినిమాలో కథే హీరో’ అన్నారు. హరితేజ మాట్లాడుతూ ‘నిజంగానే పార్టీలా ఉంటుందీ సినిమా. చక్కగా, హాయిగా మూడు గంటలు ఎంజాయ్ చేసే సినిమా అవుతుంది. ప్రేక్షకులు అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. ఒక అమ్మాయి జీవితంలో పార్టీలు, సరదాలు, ఫన్ ఒక స్టేజ్ తర్వాత అయిపోయాక... బాధ్యతలు పెరిగాక... వాటి నుంచి మళ్ళీ ఒక టీనేజ్‌లోకి వచ్చే స్టోరీ ఎంత గమ్మత్తుగా ఉంటుందో? అక్కడ స్నేహితులు ఎలా ఉంటారో? అనే విషయాలు సినిమాలో చూడొచ్చు. నేను చెప్పింది సినిమాలో ఇసుక రవ్వంతే. ఇంకా చాలా ఉంది’’ అన్నారు. -
‘ప్రతీ మగాడు ప్లేబాయే’
అందాల రాక్షసి సినిమాతో వెండితెరకు పరిచయం అయిన నవీన్ చంద్ర తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నా తరువాత ఆ స్థాయిలో అలరించలేకపోయాడు. ఇటీవల సపోర్టింగ్ రోల్స్‌లోనూ కనిపిస్తున్న నవీన్, సోలో హీరోగా నటించిన తాజా చిత్రం హీరో హీరోయిన్. ఈ సినిమాలో నవీన్ చంద్ర సినిమాలను పైరసీ చేసి అమ్మే వ్యక్తిగా కనిపిస్తున్నాడు. అలాంటి క్రిమినల్ ఓ సినీ నిర్మాత కూతురితో ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అన్నదే కథ. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్ టీజర్‌ను రిలీజ్ చేశారు. గాయత్రి సురేష్, పూజ జవేరీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈసినిమాలో అభిమన్యు సింగ్, కబీర్ దుహన్ సింగ్ ప్రతినాయకులుగా కనిపించనున్నారు. స్వాతి పిక్చర్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనూప్ రుబెన్స్ సంగీతమందిస్తుండగా జీఎస్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరపుకుంటున్న ఈ సినిమా మార్చిలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. -
సమ్మర్లో సస్పెన్స్
సత్యదేవ్, పూజా ఝవేరీ, రోషిణి ప్రకాష్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘47 డేస్’. ‘ద మిస్టరీ అన్ఫోల్డ్స్’ అనేది ఉపశీర్షిక. ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో దబ్బార శశిభూషణ్ నాయుడు, రఘు కుంచె, శ్రీధర్ మక్కువ, విజయ్ శంకర్ డొంకాడ నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ఇటీవల వస్తోన్న థ్రిల్లర్ సినిమాలు మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. అందుకే.. మా మూవీ అవుట్‌పుట్ తెలిసిన ‘త్రిశూల్ సినిమాస్’ మంచి ధరకు ఓవర్సీస్ రైట్స్ దక్కించుకుంది. రఘు కుంచె సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణ. ప్రేమికులరోజు సందర్భంగా దర్శకుడు పూరి జగన్నాథ్ చేతుల మీదుగా రిలీజ్ చేసిన ‘క్యా కరూన్’ పాటకు మంచి స్పందన వచ్చింది. త్వరలో ట్రైలర్, వేసవిలో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. రవివర్మ, హరితేజ, ఇర్ఫాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ముక్తార్ ఖాన్, సత్యప్రకాష్, కిరీటి, అశోక్ కుమార్ తదితరులు నటించిన ఈ సినిమాకి కెమెరా: జీకె, సహనిర్మాత: అనిల్ కుమార్ సోహాని. -
47 రోజుల్లో ఏం జరిగింది?
47 డేస్‌లో ఏం జరిగింది? ఇద్దరి మధ్య ప్రేమా? మర్డర్ మిస్టరీనా? తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే అంటున్నారు దర్శకులు ప్రదీప్ మద్దాలి. ‘జ్యోతిలక్ష్మీ’, ‘ఘూజీ’ వంటి చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్ హీరోగా నూతన దర్శకుడు ప్రదీప్ మద్దాలి రూపొందిస్తున్న చిత్రం ‘47 డేస్’. ‘ది మిస్టరీ అన్ఫోల్డ్స్’ అనేది ఉపశీర్షిక. పూజా ఝవేరి కథానాయిక. దబ్బార శశిభూషణ్ నాయుడు, రఘు కుంచె, శ్రీధర్మక్కువ, విజయ్ శంకర్ డొంకాడ నిర్మిస్తున్నారు. ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘మోషన్ పోస్టర్ ఇంట్రెస్టింగ్గా ఉందని అందరూ మెచ్చుకుంటున్నారు. మంచి రెస్పాన్స్ వస్తోంది. స్క్రీన్‌ప్లే ఆడియన్స్‌కు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘‘హీరోగా సత్యదేవ్‌కు ఈ సినిమా మంచి బ్రేక్ అవుతుంది. త్వరలోనే ట్రైలర్‌ను రిలీజ్ చేస్తాం’’ అన్నారు నిర్మాతలు. రోషిణి, రవివర్మ, హరితేజ, ఇర్ఫాన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి రఘుకుంచె స్వరకర్త. -
ఓ దొంగ ప్రేమ!
కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాలను ప్రేక్షకులకు అందించే కొన్ని సంస్థల్లో సూపర్‌గుడ్ ఫిలింస్ ఒకటి. తాజాగా ఈ సంస్థ నిర్మించిన చిత్రం ‘ద్వారక’. ‘పెళ్లిచూపులు’ ఫేం విజయ్ దేవరకొండ, పూజా జవేరి జంటగా నటించారు. సూపర్‌గుడ్ ఫిలింస్ అధినేత ఆర్బీ చౌదరి సమర్పణలో శ్రీనివాస్ రవీంద్ర దర్శకత్వంలో లెజెండ్ సినిమా పతాకంపై ప్రద్యుమ్న, గణేష్ నిర్మించారు. సాయికార్తీక్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని ఆర్బీ చౌదరి విడుదల చేయగా, ట్రైలర్‌ను దర్శకులు వంశీ పైడిపల్లి, శ్రీవాస్, దశరథ్ ఆవిష్కరించారు. ఆర్బీ చౌదరి మాట్లాడుతూ- ‘‘మా బ్యానర్ ద్వారా ఇప్పటి వరకూ ఎంతోమంది దర్శకులు, నిర్మాతలు, నటీనటులను పరిచయం చేశాం. ‘ద్వారక’తో శ్రీనివాస్‌ను దర్శకునిగా, ప్రద్యుమ్న, గణేష్‌లను నిర్మాతలుగా పరిచయం చేస్తుండడం ఆనందంగా ఉంది’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ద్వారక అనగానే శ్రీకృష్ణుడు గుర్తుకొస్తాడు. కృష్ణుడంటే నాకు ప్రేమ. ఆ కృష్ణుడు వెన్న దొంగ. మా చిత్రంలోని హీరో కూడా దొంగే. ఓ అమ్మాయి ప్రేమలో పడతాడు. అప్పుడు అతని జీవితంలో ఎటువంటి మార్పు వచ్చిందన్నదే కథ. విజయ్ నటనలో కొత్త కోణం చూపించే చిత్రమిది. సాయికార్తీక్ మంచి ప్రతిభాశాలి. కానీ, ఇప్పటి వరకూ ఆయనకు రావాల్సిన పేరు రాలేదు. ‘ద్వారక’తో ఆ లోటు తీరుతుంది’’ అని చెప్పారు. ‘‘ప్రొడక్షన్ విషయంలో ఆర్బీ చౌదరిగారు ఓ టీచర్లా నన్ను గైడ్ చేశారు. శ్యామ్ కె.నాయుడు కెమెరామ్యాన్గానే కాకుండా ప్రొడక్షన్ బాధ్యతలు చూసుకున్నారు. చిరంజీవిగారు మోషన్ పిక్చర్ రిలీజ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయడం సంతోషంగా ఉంది’’ అని నిర్మాతల్లో ఒకరైన ప్రద్యుమ్న అన్నారు. విజయ్ దేవరకొండ, పూజా జవేరి, దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ, నందినీ రెడ్డి, మారుతి, సంగీతదర్శకుడు ఆర్పీ పట్నాయక్, నిర్మాతలు గణేష్, రాజ్ కందుకూరి తదితరులు పాల్గొన్నారు.