సత్యదేవ్, పూజా ఝవేరి
సత్యదేవ్, పూజా ఝవేరీ, రోషిణి ప్రకాష్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘47 డేస్’. ‘ద మిస్టరీ అన్‌ఫోల్డ్స్’ అనేది ఉపశీర్షిక. ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో దబ్బార శశిభూషణ్ నాయుడు, రఘు కుంచె, శ్రీధర్ మక్కువ, విజయ్ శంకర్ డొంకాడ నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ఇటీవల వస్తోన్న థ్రిల్లర్ సినిమాలు మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. అందుకే.. మా మూవీ అవుట్‌పుట్ తెలిసిన ‘త్రిశూల్ సినిమాస్’ మంచి ధరకు ఓవర్సీస్ రైట్స్ దక్కించుకుంది.
రఘు కుంచె సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణ. ప్రేమికులరోజు సందర్భంగా దర్శకుడు పూరి జగన్నాథ్ చేతుల మీదుగా రిలీజ్ చేసిన ‘క్యా కరూన్’ పాటకు మంచి స్పందన వచ్చింది. త్వరలో ట్రైలర్, వేసవిలో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. రవివర్మ, హరితేజ, ఇర్ఫాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ముక్తార్ ఖాన్, సత్యప్రకాష్, కిరీటి, అశోక్ కుమార్ తదితరులు నటించిన ఈ సినిమాకి కెమెరా: జీకె, సహనిర్మాత: అనిల్ కుమార్ సోహాని.
Comments
Please login to add a commentAdd a comment