
అర్జున్‌రెడ్డితో తిరుగులేని స్టార్‌డమ్ సొంతం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాతో టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరో అయ్యాడు. పెద్ద హీరోల నుంచే కాకుండా సినీ విశ్లేషకుల నుంచి విజయ్‌కు ప్రశంసలు వెల్లువెత్తాయి. అర్జున్ రెడ్డి పాత్రను విజయ్ తప్ప ఇంకెవరూ చేయలేరేమో అన్నంతగా మెప్పించాడు. అయితే సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో అంతే స్థాయిలో వివాదాలు కూడా చుట్టుముట్టాయి. అది పిల్లలు చూడలేని సినిమా అని, అశ్లీలతను ప్రోత్సహించేలా ఉందని ఇలా పలురకాలుగా అర్జున్‌రెడ్డిని బంధించాయి. అయినా ఇవేవి కూడా సినిమాను ఆపలేకపోయాయి. ఎవరూ ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది అర్జున్ రెడ్డి. ఈ సినిమా ఇప్పుడు తమిళ, హిందీ భాషల్లో కూడా రీమేక్ అవుతోంది.
ఇదంతా బాగానే ఉంది కానీ, ఇప్పుడిదంతా ఎందుకు అనుకుంటున్నారా? విజయ్ ప్రస్తుతం టాక్సీవాలా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, గీతా2 ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమా ఎలా ఉండబోతోందన్న విషయాన్ని ఓ షార్ట్‌ఫిల్మ్ ద్వారా స్పష్టంచేశారు. ఈ వీడియోలో విజయ్ ఇంట్లో ఓ సినిమా చూస్తుండగా...నలుగురు పిల్లలు వచ్చి విజయ్‌తో అర్జున్‌రెడ్డి సినిమాను చూడలేకపోయామంటూ...దానికి కొన్నికారణాలను కూడా కనుక్కున్నామంటూ... పిల్లలు వారికి తగ్గట్టుగా విజయ్‌ను మారుస్తుంటారు.
అర్జున్ రెడ్డిలో వాడిన భాష, వేషం లాంటి వాటిని మార్చేసి...కొత్త స్క్రిప్టును ఓకే చేస్తారు ఆ నలుగురు పిల్లలు. అదే టాక్సీవాలా అని సింబాలిక్‌గా టాక్సీలో నలుగురు పిల్లలతో బయల్దేరుతారు. చివర్లో పిల్లలు దిగి వెళ్తుండగా... సీ యూ ఇన్ థియేటర్స్ అంటూ విజయ్ చెప‍్పడంతో వీడియో ముగుస్తుంది. సో... టాక్సీవాలా సినిమాను చిన్న పిల్లలతో పాటు ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చని విజయ్ హామి ఇచ్చినట్టే. డ్రీమ్ బిహెండ్ టాక్సీవాలా అంటూ విడుదల చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment