‘టాక్సీవాలా’ టీజర్‌ వచ్చేస్తోంది..! | Taxiwaala Teaser on 17thApril | Sakshi
Sakshi News home page

Published Sat, Apr 14 2018 3:36 PM | Last Updated on Sat, Apr 14 2018 3:37 PM

Taxiwaala Teaser on 17thApril - Sakshi

అర్జున్‌ రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించిన విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం టాక్సీవాలా. అర్జున్‌ రెడ్డి తరువాత ఏ మంత్రం వేసావే సినిమాతో నిరాశపరిచిన ఆ ప్రభావం విజయ్ కెరీర్ మీద పెద్దగా కనిపించలేదు. రాహుల్‌ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టాక్సీవాలా సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. యువీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

ఇప్పటికే టైటిల్‌, ఫస్ట్ లుక్‌ పోస్టర్‌లతో ఆకట్టుకుంటున్న టాక్సీవాలా టీం ఏప్రిల్‌ 17న టీజర్‌ ను రిలీజ్ చేస్తోంది. టీజర్‌ రిలీజ్‌ డేట్‌ ను ఎనౌన్స్‌చేస్తూ ఆసక్తికర పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌. విజయ్‌ దేవరకొండ స్టైలిష్‌ లుక్‌ లో కండలు తిరిగిన బాడీతో సూపర్బ్‌ గా కనిపిస్తున్నాడు. హీరోయిన్‌ ప్రియాంక లుక్‌ను కూడా ఈ పోస్టర్‌లో రివీల్‌ చేశారు. గోపిసుందర్‌ సంగీతమందిస్తున్న ఈ సినిమా మే మూడోవారంలో రిలీజ్‌కు రెడీ అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement