షార్ట్ ఫిలిం బ్యూటీతో అర్జున్ రెడ్డి రొమాన్స్ | Priyanka Jawalkar to romance Vijay Deverakonda | Sakshi
Sakshi News home page

షార్ట్ ఫిలిం బ్యూటీతో అర్జున్ రెడ్డి రొమాన్స్

Published Tue, Oct 17 2017 3:24 PM | Last Updated on Tue, Oct 17 2017 3:24 PM

Priyanka Jawalkar

అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ ఒక్కసారిగా స్టార్ లీగ్ లోకి చేరిపోయాడు. ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో విజయ్ వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. అంతేకాదు తన నెక్ట్స్ సినిమాల కోసం క్రేజీ కాంబినేషన్ లను సెట్ చేస్తూ ఆసక్తి రేకెత్తిస్తున్నాడు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాళవికా నాయర్ హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ గా షార్ట్ ఫిలిం స్టార్ ప్రియాంక జవాల్కర్ ను ఎపింక చేశారు. ఈ సినిమాలో ప్రియాంక డాక్టర్ అను పాత్రలో కనిపించనుందట. విజయ్ క్యాబ్ డ్రైవర్ శివగా నటిస్తున్న ఈ సినిమా సరికొత్త కథా కథనాలతో రూపొందుతోంది. అనంతపురానికి చెందిన ప్రియాంక అక్కడే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ను పూర్తి చేసింది. తరువాత నిఫ్ట్ లో ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసిన ఈ బ్యూటీ నటిగా స్థిరపడే ప్రయత్నాల్లో ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement