‘అర్జున్‌ రెడ్డి’ రీమేక్‌ నుంచి హీరోయిన్‌ అవుట్‌ | Tara Sutaria Quits Arjun Reddy Remake | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 9 2018 12:11 PM | Last Updated on Sun, Sep 9 2018 4:41 PM

Tara Sutaria Quits Arjun Reddy Remake - Sakshi

టాలీవుడ్ సెన్సేషన్‌ హిట్ అర్జున్‌ రెడ్డి కోలీవుడ్, బాలీవుడ్‌లలో రీమేక్‌ అవుతున్న సంగతి తెలిసిందే. హిందీ రీమేక్‌కు ఒరిజినల్‌కు దర్శకత్వం వహించిన సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ యువ కథానాయకుడు షాహిద్ కపూర్ హీరోగా నటిస్తుండగా తారా సుతారియా హీరోయిన్ గా నటించేందుకు ఓకె చెప్పారు.

త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాకు హీరోయిన్‌ తారా షాక్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ భామ టైగర్‌ ష్రాఫ్ సరసన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ అనుకున్న సమయానికి పూర్తి కాకపోవటంతో అర్జున్‌ రెడ్డి రీమేక్‌కు డేట్స్‌ అడ్జస్ట్ చేయలేక తప్పుకున్నారట. అయితే మరో కారణం కూడా ఉందన్న టాక్‌ వినిపిస్తోంది. కెరీర్‌ స్టార్టింగ్‌లోనే బోల్డ్ క్యారెక్టర్ చేయటం కరెక్ట్ కాదేమో అన్న ఆలోచనతోనే ఈ ప్రాజెక్ట్‌ నుంచి తారా తప్పుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

విజయ్‌ దేవరకొండ, షాలిని పాండే హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన అర్జున్‌ రెడ్డి భారీ వివాదాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంచలన విజయం సాధించింది. ఈ సినిమాతో కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్‌ కుమారుడు ధృవ్‌ హీరోగా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. వర్మ పేరుతో తెరకెక్కుతున్న తమిళ వర్షన్‌కు బాల దర్శకత్వం వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement