డెహ్రాడూన్ : షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న బాలీవుడ్ సినిమా ‘కబీర్ సింగ్’ టీమ్ విషాదంలో మునిగిపోయింది. టాలీవుడ్ సెన్సేషన్ మూవీ అర్జున్ రెడ్డికి ఈ సినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ముస్సోరీలో షూటింగ్ జరుపుకొంటోంది. ఇందులో భాగంగా అక్కడి ఫైవ్‌స్టార్ హోటల్‌లో బస చేస్తోంది. ఈ క్రమంలో రామ్ కుమార్(35) అనే క్రూ మెంబర్ ప్రమాదవశాత్తు జనరేటర్‌లో చిక్కుకుని చనిపోయాడు. జనరేటర్‌లో నీటి లెవల్ చెక్ చేస్తున్న సమయంలో అతడి మఫ్లర్ జనరేటర్ ఫ్యాన్‌కు చిక్కుకోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
కాగా రామ్ కుమార్ మృతి పట్ల కబీర్ సింగ్ యూనిట్ సంతాపం వ్యక్తం చేసింది. ఈ ఘటన గురించి నిర్మాతలు మాట్లాడుతూ.. ‘ఈ ఘటన మమ్మల్ని ఎంతగానో కలచివేసింది. రామ్ కుమార్ కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నాం. అతడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం’ అని హామీ ఇచ్చారు. ఇక అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాతో బాలీవుడ్‌లో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. సినీ1 స్టూడియోస్, టీ సిరీస్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో షాహిద్ సరసన ‘భరత్ అనే నేను’ ఫేం కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
సినిమా షూటింగ్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి
Published Fri, Jan 25 2019 4:22 PM | Last Updated on Fri, Jan 25 2019 4:24 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment