‘అర్జున్‌ రెడ్డి’ ఫస్ట్ ఫొటో | One Year Of Vijay Devarakonda Arjun Reddy | Sakshi
Sakshi News home page

Published Sun, Aug 26 2018 11:05 AM | Last Updated on Sun, Aug 26 2018 12:54 PM

One Year Of Vijay Devarakonda Arjun Reddy - Sakshi

గత ఏడాది సంచలన విజయం సాధించిన సినిమా అర్జున్‌ రెడ్డి. విజయ దేవరకొండ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో వివాదాల మధ్య విడుదలై సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఈ సినిమాతో హీరోగా విజయ్‌, దర్శకుడిగా సందీప్‌ ఓవర్‌ నైట్‌ స్టార్స్‌గా మారిపోయారు. అర్జున్‌ రెడ్డి రిలీజ్‌ అయి ఏడాది పూర్తయిన సందర్భంగా చిత్రయూనిట్ ఆసక్తికర ఫొటోనూ ట్వీట్ చేశారు.

గ్లౌస్‌ ధరించి ఉన్న చేతికి బాగా రక్తం అంటి ఉండటం, అదే చేత్తో సిగరెట్‌ తాగుతున్న ఫొటోను విజయ్‌ తన సోషల్‌ మీడియా పేజ్‌లో పోస్ట్‌ చేశారు, అర్జున్‌ రెడ్డి కోసం తీసిన తొలి ఫొటో అని కామెంట్‌ చేశాడు విజయ్‌ దేవరకొండ. విజయ్‌ సరసన షాలిని పాండే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ప్రణయ్‌ రెడ్డి వంగా నిర్మించారు. తెలుగులో సూపర్‌ హిట్ అయిన అర్జున్‌ ప్రస్తుతం తమిళ్‌లో వర్మగా రీమేక్‌ అవుతుండగా బాలీవుడ్‌ లో సందీప్ దర్శకత్వంలో షాహిద్‌ కపూర్‌ హీరోగా రీమేక్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement