'అర్జున్‌ రెడ్డి ఫుల్ కట్ చూపించు'.. డైరెక్టర్‌ను కోరిన విజయ్ దేవరకొండ! | Vijay Devarakaonda Tweet Goes Viral On Arjun Reddy Movie Anniversary | Sakshi
Sakshi News home page

Vijay Devarakaonda: 'అర్జున్‌ రెడ్డికి ఏడేళ్లు.. నమ్మలేకపోతున్నా'.. విజయ్ దేవరకొండ

Published Sun, Aug 25 2024 5:58 PM | Last Updated on Sun, Aug 25 2024 6:15 PM

Vijay Devarakaonda Tweet Goes Viral On Arjun Reddy Movie Anniversary

విజయ్ దేవరకొండ- సందీప్‌ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం అర్జున్ రెడ్డి. బాలీవుడ్ భామ షాలినీ పాండే హీరోయిన్‌గా నటించింది. 2017లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా రిలీజై నేటికి ఏడేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ మూవీ స్టిల్స్‌ షేర్ చేశారు. అప్పుడే ఏడేళ్లు గడిచాయంటే నమ్మలేకుండా పోతున్నానంటూ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఓ రిక్వెస్ట్ చేశారు. 

విజయ్ తన ట్వీట్‌లో రాస్తూ.. 'పదో వార్షికోత్సవానికి  అర్జున్‌రెడ్డి ఫుల్‌ కట్‌ను అందుబాటులోకి తీసుకురా. అర్జున్‌ రెడ్డి విడుదలై ఏడేళ్లు గడిచాయంటే నమ్మలేకపోతున్నా. ఇదంతా గత సంవత్సరంలోనే జరిగినట్లుగా అనిపిస్తోంది' అంటూ మూవీ షూటింగ్‌ ఫోటోలను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు అర్జున్ రెడ్డి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా పదో వార్షికోత్సవానికి ఫుల్‌ వెర్షన్‌ విడుదల చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

కాగా.. రొమాంటిక్‌ డ్రామా ఫిల్మ్‌గా తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో రన్‌ టైమ్‌ దాదాపు 3 గంటల 45 నిమిషాలుగా ఉంది. కానీ పలు కారణాల రీత్యా 3 గంటల 2 నిమిషాలకు కుదించారు. అభ్యంతరకర పదాలు, ముద్దు సన్నివేశాల నిడివిని తగ్గించాలని సెన్సార్‌ బోర్డు కట్ చెప్పింది. తెలుగులో సూపర్‌హిట్ నిలిచిన‌ ఈ చిత్రాన్ని తమిళంలో ఆదిత్య వర్మగా , హిందీలో కబీర్‌ సింగ్‌గా రీమేక్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement