ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. అర్జున్‌రెడ్డి సినిమాతో పాన్ ఇండియా క్రేజ్‌ను దక్కించుకున్నారు యంగ్ హీరో. తాజాగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమాలో నటిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో పేస్ హాస్పటల్స్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు. అర్గాన్స్ డొనేషన్‌పై కీలక ప్రకటన చేశారు యంగ్ హీరో.
(చదవండి: ట్రైలర్ అద్భుతంగా ఉంది.. 'మసూద'పై విజయ్ దేవరకొండ ప్రశంస)
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ' ఐదేళ్ల క్రితం నేను డాక్టర్ కోసం గూగుల్‌లో వెతికా. అప్పుడు నాకు ఫణి పరిచమయ్యారు. మా డాడీకి అరోగ్య సమస్యలు ఉండేవి. వెంటనే డాడీకి సర్జరీ చేయడం జరిగింది. ఒకవైపు సర్జరీ.. మరోవైపు బిల్ స్ట్రెస్. అప్పుడు నా వద్ద డబ్బులు లేవు. నేను ఒకరూమ్‌లో కూర్చుండి ఆలోచిస్తూ ఉండిపోయా. ఇన్సూరెన్స్ కూడా లేదు. బిల్స్‌పై మనం మాట్లాడాకుందామని డాక్టర్‌తో చెప్పా. అప్పటినుంచి పేస్ హాస్పిటల్స్‌తో నాకు అనుబంధం ఉంది. అవయవావ మార్పిడి అనేది పబ్లిక్ డోనర్స్ వల్లే జరుగుతోందని డాక్టర్ చెప్పేవారు. అందుకే నేను నా అర్గాన్స్ డొనేట్ చేస్తున్నా. సాధారణంగా మధ్యతరగతి ప్రజలు ఆస్పత్రికి వెళ్లరు. ఖర్చులకు భయపడి చాలామంది ఇలాగే ఆలోచిస్తారు. కానీ కొన్నిసార్లు చెకప్ చేయించకోవడం మంచిది.' అంటూ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment