organs donation
-
డాక్టర్ కోసం గూగుల్‌లో వెతికా.. అప్పుడే నాకు అర్థమైంది: విజయ్ దేవరకొండ
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. అర్జున్‌రెడ్డి సినిమాతో పాన్ ఇండియా క్రేజ్‌ను దక్కించుకున్నారు యంగ్ హీరో. తాజాగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమాలో నటిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో పేస్ హాస్పటల్స్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు. అర్గాన్స్ డొనేషన్‌పై కీలక ప్రకటన చేశారు యంగ్ హీరో. (చదవండి: ట్రైలర్ అద్భుతంగా ఉంది.. 'మసూద'పై విజయ్ దేవరకొండ ప్రశంస) విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ' ఐదేళ్ల క్రితం నేను డాక్టర్ కోసం గూగుల్‌లో వెతికా. అప్పుడు నాకు ఫణి పరిచమయ్యారు. మా డాడీకి అరోగ్య సమస్యలు ఉండేవి. వెంటనే డాడీకి సర్జరీ చేయడం జరిగింది. ఒకవైపు సర్జరీ.. మరోవైపు బిల్ స్ట్రెస్. అప్పుడు నా వద్ద డబ్బులు లేవు. నేను ఒకరూమ్‌లో కూర్చుండి ఆలోచిస్తూ ఉండిపోయా. ఇన్సూరెన్స్ కూడా లేదు. బిల్స్‌పై మనం మాట్లాడాకుందామని డాక్టర్‌తో చెప్పా. అప్పటినుంచి పేస్ హాస్పిటల్స్‌తో నాకు అనుబంధం ఉంది. అవయవావ మార్పిడి అనేది పబ్లిక్ డోనర్స్ వల్లే జరుగుతోందని డాక్టర్ చెప్పేవారు. అందుకే నేను నా అర్గాన్స్ డొనేట్ చేస్తున్నా. సాధారణంగా మధ్యతరగతి ప్రజలు ఆస్పత్రికి వెళ్లరు. ఖర్చులకు భయపడి చాలామంది ఇలాగే ఆలోచిస్తారు. కానీ కొన్నిసార్లు చెకప్ చేయించకోవడం మంచిది.' అంటూ సూచించారు. -
పంది గుండె మార్పిడి చేయించుకున్న రోగి చనిపోవడానికి కారణం అదే...
Animal virus detected in patient: ఇటీవలే పందిగుండె అమర్చిన వ్యక్తి మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే అతను ఎందువల్ల చనిపోయాడు కారణాలేంటి అనే దానిపై వైద్యులు పరిశోధనలు చేయడం మొదలు పెట్టారు. అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ వైద్యులు 57 ఏళ్ల డేవిడ్ బెన్నెట్‌కి గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేశారు. పంది గుండెని అమర్చి ప్రపంచ చరిత్రోలోనే ఒక సంచలనాత్మక ప్రయోగానికి నాంది పలికారు. ఆ సర్జరీ కూడా విజయవంతమైంది. ఇది వైద్యశాస్రంలోనే ఒక సరికొత్త అధ్యయనం అని అందరూ ఆనందించేలోపే ఆ వ్యక్తి సర్జరీ జరిగిన రెండు నెలల్లోనే చనిపోయాడు. వైద్యులు కూడా అతన్ని బతికించేందుకు శతవిధాల ప్రయత్నించారు కూడా. అసలు ఎందుకు ఇలా జరిగిందని పరిశోధనలు చేస్తున్న వైద్యులు కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈమేరకు యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ వైద్యులు మాట్లాడుతూ... పంది గుండె లోపన వైరల్ డీఎన్ఏ ఉంది. పోర్సిన్ సైటోమెగలో వైరస్ అని పిలువబడే ఈ బగ్ రకరకాల ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందనే విషయాన్ని గుర్తించలేకపోయాం. జంతువుల నుంచి మనుషులను అవయవాలను అమర్చినప్పుడూ కొత్త ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవలసి ఉంటుంది. కొన్ని వైరస్లు చాలా గుప్తంగా ఉంటాయి. సర్జరీకి ముందు బెన్నెట్ మానవ గుండె మార్పిడికీ అనర్హుడని, పైగా అతనికి వ్యాధి నిరోధక శక్తి తక్కువని తెలిసే జన్యుమార్పిడి చేసిన పంది గుండెను అమర్చాం. పైగా ఆ వైరస్ భారిన పడకుండా ఉండేలా అతని అత్యంత మెరుగైన చికిత్స కూడా అందించాం. మా బృందం దాత పంది ఆరోగ్యంగా ఉందని, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ పరీక్షలు నిర్వహించి నిర్ధారించింది. అంతేకాదు ఆ పంది అంటువ్యాధులు వ్యాప్తి చేయకుండా నిరోధించేలా పెంచే ప్రత్యేక సదుపాయంలో ఉంది. బెన్నెట్‌కి యాంటీ వైరల్ మందులు, రోగనిరోధక శక్తిని పెంచే చికిత్సలను అందించాం. అని అన్నారు. బెన్నెట్ సర్జరీ తర్వాత నెమ్మదిగా కోలుకోవడం మొదలు పెట్టాడని, ముందు జాగ్రత్త చర్యగా వైరల్ ఇన్ఫెక్టకు సంబంధించిన పరీక్షలు కూడా నిర్వహించామని సర్జరీ చేసిన డాక్టర్ బార్ట్లీ గ్రిఫిత్ తెలిపారు. ఐతే పంది గుండే ఉబ్బిపోయి ద్రవంతో నిడిపోయి పనిచేయడం మానేసిందన్నారు. కానీ ఈ పంది వైరస్ ఎలా మానవ శరీరంపై ప్రభావితం చేస్తుందో స్పష్టం చేయలేదు. (చదవండి: పెనువిషాదం. పంది గుండె అమర్చిన వ్యక్తి కన్నుమూత) -
పెనువిషాదం. పంది గుండె అమర్చిన వ్యక్తి కన్నుమూత
వైద్య శాస్త్రంలో మరో చారిత్రక ఘట్టం అవుతుందనుకున్నది కాస్త విషాదంగా మిగిలింది. పంది గుండె అమర్చిన వ్యక్తి కన్నుమూశాడు. జనవరి 7వ తేదీన 57 ఏళ్ల డేవిడ్ బెన్నెట్ అనే వ్యక్తికి ఈ సర్జరీ జరిగింది. కానీ, ఆ ఆనందం రెండు నెలల్లోనే ముగిసింది. మేరీల్యాండ్(అమెరికా)కు చెందిన డేవిడ్ బెన్నెట్‌కు రెండు నెలల క్రితం అమెరికాలోని మేరీల్యాండ్ ఆసుపత్రిలో గుండెమార్పిడి శస్త్రచికిత్స చేశారు. ప్రపంచ వైద్య చరిత్రలోనే తొలిసారిగా జన్యుమార్పిడి చేసిన పంది నుంచి సేకరించిన గుండెను ఆయనకు విజయవంతంగా అమర్చారు. దీంతో దీనిని పెద్ద ముందడుగుగా భావించారు. కొన్ని రోజులుగా బెన్నెట్ ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుండడంతో ఆయనను బతికించేందుకు వైద్యులు తీవ్రంగా కృషి చేశారు. అయితే, ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. మంగళవారం బెన్నెట్ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. తండ్రి మృతి విషయాన్ని బెన్నెట్ కుమారుడు బెన్నెట్ జూనియర్ నిర్ధారించారు. 1984లోనూ ఇలాంటి ప్రయోగమే జరగ్గా అది కూడా విఫలమైంది. 1984లో బబూన్(కోతి జాతికి చెందినది) గుండెను ఓ నవజాత శిశువుకు అమర్చగా.. సర్జరీ విజయవంతం అయినప్పటికీ ఆ పసికందు మాత్రం 20 రోజులే జీవించగలిగింది. అయితే, ఈసారి పందిగుండె అమర్చుకున్న బెన్నెట్ రెండు నెలలు జీవించడం కొంత మెరుగైన ఫలితంగా భావించినా.. ఇప్పుడదీ విషాదమే అయ్యింది. -
చారిత్రక ఘట్టం.. పంది గుండె మనిషికి!
Pig Heart Transplantation To Human: వైద్య శాస్త్రంలో మరో చారిత్రక ఘట్టం చోటు చేసుకుంది. మనిషికి పంది గుండెను విజయవంతంగా అమర్చారు అమెరికన్ వైద్యులు. తద్వారా అవయవాల కొరత, అవి దొరక్క చనిపోతున్న వేల మందికి ప్రాణదానం చేసే అవకాశం లభించినట్లయ్యింది. శుక్రవారం బాల్టిమోర్ ‘మేరీలాండ్ మెడికల్ స్కూల్ ఆస్పత్రిలో ఈ అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. పంది నుంచి తీసిన గుండెను మనిషికి అమర్చారు. ఆపరేషన్ విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు వైద్యులు. జన్యుపరంగా మార్పు చేయబడిన పంది గుండెను అమర్చడం ద్వారా పేషెంట్‌కు ప్రాణదానం చేసినట్లయ్యింది. 57 ఏళ్ల డేవిడ్ బెన్నెట్ అనే వ్యక్తికి ఈ సర్జరీ జరిగింది. సంప్రదాయ మార్పిడికి పేషెంట్ పరిస్థితి అనుకూలించని తరుణంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు వైద్యులు. ఇందుకోసం అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అత్యవసర అనుమతులు జారీ చేసింది. ప్రస్తుతం డేవిడ్ కోలుకుంటున్నాడని, ఇంకొన్నాళ్లు అబ్జర్వేషన్లో ఉంచాలని చెప్తున్నారు. పేషెంట్ గనుక పూర్తిగా కొలుకుంటే గనుక అద్భుతమే అవుతుంది. వైద్య శాస్త్రంలో ఇదొక చారిత్రక ఘట్టమని చెబుతున్నారు వైద్యులు. తద్వారా భవిష్యత్తులో ఆర్గాన్ డొనేషన్స్ కొరతను పరిష్కరించడానికి ఒక మార్గం దొరికినట్లు అయ్యింది. ఇదిలా ఉంటే బ్రెయిన్ డెడ్ అయి కృత్రిమ లైఫ్ సపోర్ట్‌పై కోలుకోలేని స్థితిలో ఉన్న వ్యక్తికి పంది కిడ్నీని అమర్చిన సంగతి తెలిసిందే. కిందటి ఏడాది అక్టోబర్‌లో న్యూయార్క్ యూనివర్సిటీ లాన్‌గోన్ హెల్త్ మెడికల్ సెంటర్లో వైద్యులు ఈ ఆపరేషన్ చేయగా.. పేషెంట్ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. వేలల్లో మరణాలు అమెరికాలో ప్రతీ ఏడాది సగటున ఆరు వేల మందికి పైగా పేషెంట్లు.. గుండె మార్పిడికి ముందే చనిపోతున్నారు. అవయవాల కొరతే అందుకు ప్రధాన కారణం. ప్రస్తుతం అమెరికాలో లక్షా పదివేల మందికి పైగా గుండె మార్పిడి ఆపరేషన్ల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. 1984లో బబూన్(కోతి జాతికి చెందినది) గుండెను ఓ నవజాత శిశువుకు అమర్చగా.. సర్జరీ విజయవంతం అయినప్పటికీ ఆ పసికందు మాత్రం 20 రోజులే జీవించగలిగింది. అయితే ఇప్పుడా పరిస్థితి మారింది. ఇక పంది శరీరాకృతి, ఎదుగుదల, పైగా మాంసం తింటారు కాబట్టి ఆధారంగా.. అవయవాలు తీసుకోవడానికి ఉత్తమమైందని అమెరికన్ డాక్టర్లు భావిస్తున్నారు. సంబంధిత వార్త: పేషెంట్‌కు పంది కిడ్నీ అమర్చారు -
‘హార్ట్’ టచింగ్ మెసేజ్
సామాజిక మాధ్యమం ట్విటర్లో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర చేసిన ఓ పోస్ట్ గుండెకు హత్తుకునేలా ఉంది. చనిపోయిన కూతురి ఓ తండ్రి ఎంత ప్రేమను కనబరుస్తున్నాడో తెలిపే ఓ వీడియోను ట్వీట్ చేసిన ఆయన..‘ఈ రోజు నేను రెండు ప్రొడక్ట్స్ ప్రారంభించినప్పటికీ.. ఈ వీడియోను మీతో షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ వీడియో ఎప్పటిదో నాకు తెలియదు.. కానీ అది నా మనసును కదిలించింది. అదే విధంగా ఆ తండ్రి కూడా తన కూతురు గుండెను కదిలించాడు. మన చర్మం ఏ రంగులో ఉన్న.. శరీరంలోని గుండె మాత్రం అందరిలో ఒకేలా కొట్టుకుంటుందనే చక్కటి సందేశం అందులో ఉంద’ని పేర్కొన్నారు. ఆ వీడియోలో ఏముదంటే.. యూఎస్‌లోని ఒరెగాన్కు చెందిన బిల్ కన్నేర్కు గతేడాది తన కొడుకు ఆస్టిన్, కూతురు అబ్బేతో కలిసి ఫ్యామిలీ టూర్‌కు వెళ్లాడు. అక్కడ ఆస్టిన్, అబ్బేలు ప్రమాదానికి గురయ్యారు. ఆ ప్రమాదం నుంచి ఆస్టిన్ బయటపడినప్పటికీ.. అబ్బే మరణించింది. తర్వాత బిల్ ఆమె అవయవాలను దానం చేశారు. అయితే తన కూతురిని మరచిపోలేకపోయిన బిల్.. అబ్బే జ్ఞాపకార్థంగా సైకిల్‌పై దేశవ్యాప్తంగా పర్యటించాలని అనుకున్నాడు. అలాగే అవయవ దానం గొప్పతనం గురించి చాటిచెప్పే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా అతడు అబ్బే అవయవాలు దానం చేసిన హెల్త్ సెంటర్‌కు వెళ్లి.. ఆమె అవయవాలు ఎవరికైతే అమర్చారో వారి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఆయన విజ్ఞప్తితో హెల్త్ సెంటర్ సిబ్బంది అబ్బే అవయవాలు అమర్చిన వారిని సంప్రదించారు. A lot on today,including two product launches but had to share this post.Don’t know how old the story is but it touched my heart the same way this dad touched his daughter’s heart. A powerful message that no matter what colour our skin,the heart beating underneath is the same... pic.twitter.com/CM3xL87nR9 — anand mahindra (@anandmahindra) 15 November 2018 అందులో ఆమె హృదయాన్ని అమర్చిన లూమోత్ జాక్ మాత్రమే.. అబ్బే తండ్రిని కలిసేందుకు అంగీకారం తెలిపాడు. దీంతో హెల్త్ సెంటర్ నిర్వహకులు అతని వివరాలను బిల్‌కు అందజేశారు. తన యాత్రలో భాగంగా ఫాదర్స్‌డే రోజున లూమెత్ను కలిసిన బిల్ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. స్టేతస్కోప్తో లూమెత్ గుండె(అతనికి అమర్చిన అబ్బేది) చప్పుడు విని కూతురిని గుర్తుచేసుకున్నారు. అక్కడే ఉన్న లూమెత్ తండ్రి బిల్‌ను ఓదార్చారు. లూమెత్ విషయానికి వస్తే.. 21 ఏళ్ల లూమెత్ గుండె బలహీనంగా ఉండటం వల్ల ఎక్కువ కాలం బ్రతకడని వైద్యులు ప్రకటించారు. ఆ సమయంలో అబ్బే గుండె అమర్చడం వల్ల లూమెత్కు మరో జన్మ లభించినట్టయింది. -
అవయవదానం
డోన్ టౌన్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి..బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. డోన్ పట్టణానికి చెందిన వ్యాపారవేత్త దారా శ్రీనివాసరెడ్డి(52) శనివారం సాయంత్రం తన బావగారి ఊరైన కొట్రాయి నుంచి డోన్‌కు ద్విచక్రవాహనంపై వస్తుండగా ఐచర్ వాహనం ఢీ కొనింది. తీవ్రంగా గాయపడిన అతన్ని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు బ్రెయిన్‌డెడ్ అయినట్లుగా తెలిపారు. అయితే బంధువులు హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రికి తరలించగా..అక్కడి వైద్యులు ఫలితం లేదని చెప్పారు. దీంతో అతని గుండె, లివర్, కిడ్నీలను యశోదా ఆసుపత్రి ద్వారా జీవన్‌దాన్ ట్రస్ట్‌కు, రెండు కళ్లను ఎల్వీ ప్రసాద్ఐ ఇన్స్టిట్యూట్కు అందజేసేందుకు భార్య శారదమ్మ అంగీకరించింది. శ్రీనివాస రెడ్డికి కుమార్తెలు ప్రత్యూషా, అలైఖ్యారెడ్డిలు ఉన్నారు. ఇతని స్వగ్రామం మద్దికెర మండలం ఎం. అగ్రహారం గ్రామం కాగా 30 ఏళ్ల క్రితం డోన్ పట్టణంలో స్థిరపడ్డారు. -
పుట్టెడు దుఃఖంలో..
► బ్రెయిన్ డెడ్ అయిన భర్త అవయవాలు దానం చేసిన భార్య ► బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలు దానం ► దివ్యంగురాలిగా ఆ బాదేంటో నాకు తెలుసన్న భార్య దేవరకొండ : పుట్టెడు కష్టంలోనూ వారు పరోపకారం వైపు ఆలోచన చేశారు. ఓ వైపు కన్నీళ్లను దిగమింగుకుని ఆ ఇంటి పెద్ద అవయవాలను దానం చేశారు. అవయవ లోపం మనిషిని ఎంత కుంగదీస్తుందో స్వయంగా అనుభవిస్తున్న ఆమె అలాంటి కష్టం మరొకరికి రావద్దనుకుంది. 56 ఏళ్ల వయస్సులో బ్రెయిన్ డెడ్ అయిన తన భర్త అవయవాలను దానం చేసి ఆ దివ్యాంగురాలు నేటి తరానికి ఆదర్శంగా నిలిచింది. వివరాలు... నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం కొమ్మేపల్లి గ్రామపంచాయతీకి చెందిన షేక్ నిరంజన్ అలియాస్ బాబు(56) గ్రామంలో ఉంటూ కిరాణం, చికెన్ సెంటర్ నడుపుతున్నాడు. అతనికి దివ్యాంగురాలైన భార్య, నలుగురు పిల్లలున్నారు. అందరికీ పెళ్లిళ్లు అయ్యా యి. అయితే అతని భార్య షరీఫా కొన్నేళ్ల క్రితం ఓ ప్రమాదంలో కాలు పోగొట్టుకుంది. అయితే దివ్యాంగురాలైన షరీఫా భర్తకు చేదోడువాదోడుగా ఉంటోంది. ఈ క్రమంలో నిరంజన్ గత గురువా రం వనవాసం సందర్భంగా ఊళ్లో కోళ్లు అమ్ముడుపోతాయని భావించి వాటిని కొనుగోలు చేయడానికి ద్విచక్రవాహనంపై గ్రామం నుంచి దేవరకొండకు బయలుదేరాడు. మార్గమధ్యలో ఎదురుగా వస్తున్న లారీ బైక్‌ను ఢీకొట్టడంతో నిరంజన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కుటుం బ సభ్యులు అతడిని హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించారు. అయితే రెండు రోజుల పాటు చికిత్స నిర్వహించిన వైద్యులు అతని బ్రెయిన్ డెడ్ అయ్యిందని నిర్ధారించి బంధువులకు తెలిపారు. ఇదే క్రమంలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల అవయవాలు మరొకరికి దానం చేయడం వల్ల వారికి పునర్జన్మను ప్రసాదించవచ్చునని డాక్టర్లు చెప్పడంతో నిరంజన్ భార్య, కుమారుడు వెంటనే తమ అంగీకారాన్ని తెలిపారు. తమ తండ్రి మరణించిన అతని అవయవాలు మరొకరిని బతికిస్తాయంటే సంతోషమేనని తెలిపారు. దీంతో నిరంజన్ శరీరం నుంచి కిడ్నీలు, లివర్, కళ్లను వైద్యులు సేకరించారు. భర్త మరణంతో నిరంజన్ షరీఫా అనా థైంది. కొడుకులు, బిడ్డలకు పెళ్లిళ్లవడంతో షరీఫా ఇప్పుడు అనామకురాలిగా మారింది. తోటి వారికి సాయపడాలన్న అలాంటి ఉన్నతమైన వ్యక్తులకు ప్రభుత్వం కూడా తోడ్పాటునందించాలని పలు వురు కోరుతున్నారు. -
బ్రెయిన్‌డెడ్ కావడంతో అవయవదానం
బెల్లంపల్లి (ఆదిలాబాద్) : హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి రోడ్డు ప్రమాదానికి గురై బ్రెయిన్‌డెడ్ కావడంతో తల్లిదండ్రులు అవయవదానం చేశారు. బెల్లంపల్లి ఏరియా కైరిగూడ ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులో పని చేస్తున్న నూల శంకరయ్య, సరోజ దంపతుల కుమారుడు సాగర్‌బాబు(20) హైదరాబాద్‌లోని గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఈ నెల 23న కళాశాల నుంచి హాస్టల్‌కు వెళ్తుండగా.. ట్రాలీ ఢీకొని తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించగా సాగర్‌బాబు బ్రెయిన్ స్పందించడం లేదని వైద్యులు నిర్ధారించారు. ఈ పరిస్థితుల్లో వైద్యం చేసినా ప్రయోజనం ఉండదని వైద్యులు సూచించడంతో కొడుకు అవయవాలను దానం చేయడానికి తల్లిదండ్రులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శనివారం అవేర్ గ్లోబల్ ఆస్పత్రిలో జీవన్‌దాన్ సంస్థకు గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, కిడ్నీలు, కళ్లు అప్పగించి పుట్టెడు దుఃఖంలోనూ ఉదారతను చాటుకున్నారు. వైద్యం చేసినా కొడుకు బతకడనే చేదు నిజాన్ని దిగమింగి మరొకరికి ప్రాణదానం చేయడానికి ముందుకొచ్చిన సింగరేణి కార్మిక దంపతులను స్థానికులు అభినందించారు. -
మరణంలేని మనస్విని
-
బ్రెయిన్‌డెడ్ అయిన ఎనిమిదేళ్ల బాలిక అవయవ దానం
హైదరాబాద్ (బంజారాహిల్స్) : ఈ నెల 22వ తేదీన గోదావరి పుష్కరాలకు వెళ్లి తిరిగి వస్తూ నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కరీంనగర్ జిల్లాకు చెందిన జి. మనస్విని అనే ఎనిమిదేళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది. గడిచిన మూడు రోజుల నుంచి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మనస్విని బ్రెయిన్‌డెడ్‌తో తుది శ్వాస విడవడంతో.. పాప తల్లిదండ్రులు ఆమె శరీర అవయవాలైన కాలేయం, రెండు మూత్రపిండాలు, గుండె కవాటాలను జీవన్‌దాన్ కార్యక్రమం ద్వారా దానం చేశారు. శనివారం అపోలో ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో తల్లిదండ్రులు వివరాలు వెల్లడించారు. -
ఆ ఒక్కడు... ఐదుగురికి దేవుడు!
హైదరాబాద్: మృత్యువు ముంగిట నిలిచినా, మరో ఐదుగురి ప్రాణాలు నిలబెట్టి చిరంజీవిగా నిలిచాడు ఓ వ్యక్తి! వరంగల్ నగరానికి చెందిన బెన్సన్(46) కొన్ని రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేర్చగా... చికిత్స పొందుతూ శనివారం ఉదయం 11 గంటలకు మృతి చెందాడు. బ్రెయిన్‌డెడ్ అయినట్లు అపోలో వైద్యులు ధ్రువీకరించారు. దీంతో బెన్సన్ భార్య కొమ్ము సరోజ అవయవదానానికి అంగీకరించారు. బెన్సన్ కళ్లు, ఊపిరితిత్తులు, కిడ్నీలు, గుండె నాళాలను సేకరించిన వైద్యులు వాటిని జీవన్‌దాన్ ట్రస్టుకు శనివారం అందజేశారు. -
మరో బ్రెయిన్ డెడ్ కేసులో అవయవాలు దానం
విశాఖపట్నం:ఇచ్ఛాపురానికి చెందిన కృష్ణారావు అనే వ్యక్తికి బ్రెయిన్ డెడ్ అయ్యింది. అతని మెదడు పనిచేయకపోవటంతో వారి కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకొచ్చారు. కృష్ణారావు ఊపిరితిత్తులు, కిడ్నీలను సావిత్రిబాయి పూలే ట్రస్టుకు దానం చేశారు. ఆయన రెండు కిడ్నీలను కేర్, అపోలో ఆస్పత్రులకు అందించారు. అలాగే ఊపిరితిత్తులను కేర్ ఆస్పత్రికి అందించారు. ఈ నెల ఆరంభంలో ఇదే తరహా ఘటన ఒకటి చోటు చోసుకున్న సంగతి తెలిసిందే. విజయవాడలో3వ తేదీన సెంటినీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వద్ద తోట మణికంఠ(21) మోటారు సైకిల్ నడుపుతూ ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో మణికంఠ బ్రెయిన్‌డెడ్ కావడంతో అతని అవయవాలను నలుగురికి దానం చేశారు. -
కవితా... హాట్సాఫ్!
ముష్కర మూకలను మట్టుబెట్టే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాను ఒకరయితే, తాను చనిపోతూ ముగ్గురికి జీవితాన్నిచ్చిన చిరంజీవి మరొకరు. వీరెవరో కాదు హేమంత్ కర్కరే, ఆయన సతీమణి కవితా కర్కరే. దేశం కోసం హేమంత్ ప్రాణాలు తృణప్రాయంగా ఆర్పించగా, ఆయన భార్య అనారోగ్యంతో చనిపోతూ ముగ్గురు ప్రాణాలు నిలబెట్టారు. మహారాష్ట్ర ఏటీఎస్ చీఫ్‌గా వ్యవహరించిన హేమంత్ కర్కరే దేశ ఆర్థిక రాజధాని ముంబైపై దండెత్తిన దుర్మార్గులను తుదముట్టించే క్రమంలో ప్రాణాలు కోల్పోయారు. 26/11 దాడిలో ఉగ్రవాదుల తూటాలకు నేలకొరిగారు. దేశం కోసం ప్రాణాలర్పించిన కర్కరే కుటుంబాన్ని విధి చిన్నచూపు చూసింది. హేమంత్ మరణించిన ఆరేళ్లకు ఆయన సతీమణి కవితను కానరాని దూరాలకు తీసుకుపోయింది, అవయవ దానం చేసి కవిత చిరంజీవిగా నిలిచారు. కవితా కర్కరే- బ్రెయిన్ హెమరేజితో సెప్టెంబర్ 29న ముంబైలో కన్నుమూశారు. అయితే కవిత ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఆమె అవయవాలను దానం చేయడానికి అంగీకరించి పెద్ద మనసు చాటుకున్నారు. త్యాగనిరతిలో తమ తల్లిదండ్రులకు తగినవారమని నిరూపించుకున్నారు. కవిత రెండు మూత్రపిండాలను ఇద్దరికి అమర్చారు. కాలేయాన్ని 49 ఏళ్ల రోగికి అమర్చారు. ఆమె కళ్లను ఐబ్యాంకుకు దానం చేశారు. కర్కరే కుటుంబం త్యాగనిరతిని అందరూ ప్రశంసిస్తున్నారు. అవయవదానంపై అవహగాన లేకపోవడంతో మనదేశంలో దాతలు ముందుకురాని పరిస్థితి నెలకొంది. అవయవాలు పాడైపోయి ఏటా దేశంలో దాదాపు ఐదు లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అవయవదాతులు ముందుకు వస్తే ఈ పరిస్థితిని చాలావరకు నివారించవచ్చు. మరణానికి సార్థకత కావాలంటే అవయవదానమొక్కటే దారి. చనిపోయిన తర్వాత కూడా జీవించాలనుకుంటే అవయవదానం చేయండి.