బెల్లంపల్లి (ఆదిలాబాద్) : హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి రోడ్డు ప్రమాదానికి గురై బ్రెయిన్‌డెడ్ కావడంతో తల్లిదండ్రులు అవయవదానం చేశారు. బెల్లంపల్లి ఏరియా కైరిగూడ ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులో పని చేస్తున్న నూల శంకరయ్య, సరోజ దంపతుల కుమారుడు సాగర్‌బాబు(20) హైదరాబాద్‌లోని గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఈ నెల 23న కళాశాల నుంచి హాస్టల్‌కు వెళ్తుండగా.. ట్రాలీ ఢీకొని తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించగా సాగర్‌బాబు బ్రెయిన్ స్పందించడం లేదని వైద్యులు నిర్ధారించారు.
ఈ పరిస్థితుల్లో వైద్యం చేసినా ప్రయోజనం ఉండదని వైద్యులు సూచించడంతో కొడుకు అవయవాలను దానం చేయడానికి తల్లిదండ్రులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శనివారం అవేర్ గ్లోబల్ ఆస్పత్రిలో జీవన్‌దాన్ సంస్థకు గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, కిడ్నీలు, కళ్లు అప్పగించి పుట్టెడు దుఃఖంలోనూ ఉదారతను చాటుకున్నారు. వైద్యం చేసినా కొడుకు బతకడనే చేదు నిజాన్ని దిగమింగి మరొకరికి ప్రాణదానం చేయడానికి ముందుకొచ్చిన సింగరేణి కార్మిక దంపతులను స్థానికులు అభినందించారు.
బ్రెయిన్‌డెడ్ కావడంతో అవయవదానం
Published Sat, Sep 26 2015 7:03 PM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement