B.tech student
-
వేగంగా దూసుకొచ్చి.. బైకుని ఢీకొట్టి..
గచ్చిబౌలి: ఓ యువకుడి నిర్లక్ష్యపు డ్రైవింగ్..మితిమీరిన వేగం కారణంగా బీటెక్ విద్యార్థిని దుర్మరణం పాలైంది. మరో యువకుడు తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. రాయదుర్గం ఇన్స్పెక్టర్ సీహెచ్.వెంకన్న తెలిపిన ప్రకారం..కామారెడ్డి జిల్లా దోమకొండకు చెందిన నర్సయ్య, పూజ దంపతుల రెండో కుమార్తె ఐరేని శివాని(21) గండిపేట్‌లోని సీబీఐటీలో బీటెక్ 4వ సంవత్సరం చదువుతోంది. గండిపేట్‌లోని ఓ హాస్టల్లో ఉంటోంది. నిజాంసాగర్లోని నవోదయ స్కూల్ 10వ తరగతి విద్యార్థుల పూర్వ సమ్మేళనం కోసం ఈ నెల 22న ఉదయం 4.30 గంటలకు హాస్టల్ నుంచి బయలుదేరింది. తిరిగి రాత్రి 12 గంటలకు కూకట్‌పల్లిలో బస్సు దిగి హాస్టల్‌కు వెళ్లేందుకు తన స్నేహితుడైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెంకట్‌రెడ్డిని పిలిచింది. ఇద్దరు కలిసి డిన్నర్ చేసి హాస్టల్‌కు బయలుదేరారు. రాత్రి 1.30 గంటల సమయంలో నానక్‌రాంగూడ రోటరీ నుంచి నార్సింగ్ సర్వీస్ రోడ్డులో బైకుపై వెళ్తున్నారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా దూసుకొచి్చన స్కోడా కారు వీరి బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో శివాని, వెంకట్‌రెడ్డి ఎగిరి కిందపడ్డారు. తీవ్ర గాయాలు కావడంతో ఇద్దరిని 108 అంబులెన్స్‌లో కొండాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే శివాని మృతిచెందినట్లు అక్కడి డాక్టర్లు ధృవీకరించారు. తీవ్ర గాయాలతో ఉన్న వెంకట్‌రెడ్డిని మెరుగైన చికిత్స కోసం మదీనాగూడలోని ఓ హాస్పిటల్లో చేరి్పంచారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. నగరంలోని ఓ ఆస్పత్రిలో పనిచేసే వైద్యుని కుమారుడు శ్రీకాలేష్ (19) కారును అతి వేగంగా నడిపి ప్రమాదానికి కారణమయ్యాడని తేలింది. దీంతో అతన్ని అరెస్ట్ చేసి, స్కోడా కారును స్వాదీనం చేసుకున్నారు. బ్రీత్ ఎనలైజర్ చేయగా ఎలాంటి ఆల్కహాల్ తాగలేదని నిర్ధారణ అయిందని, అతి వేగమే ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు పేర్కొంటున్నారు. కొండాపూర్‌లో నివాసం ఉండే శ్రీకాలేష్ అమెరికా నుంచి వచ్చిన తన స్నేహితులను నార్సింగిలో డ్రాప్ చేసేందుకు కారులో బయలుదేరగా మార్గమధ్యలో ప్రమాదం చోటు చేసుకుంది. మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.ముగ్గురు బీటెక్ విద్యార్థుల అదృశ్యం -
ఆమెకు ఇద్దరు.. మొదటి ప్రియుడిని అడ్డు తొలగించుకునేందుకు..
గోనెగండ్ల: గాజులదిన్నె ప్రాజెక్టు సమీపంలో ప్రేమజంటపై జరిగిన దాడి ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. యవకుడిపై దాడి వెనుక యువతి ఉన్నట్లు సమాచారం. ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన అరవింద్ డిస్టెన్స్ డిగ్రీ చదువుతున్నాడు. అరవింద్ ఇంటర్ చదివే సమయంలో ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరి మధ్య ప్రేమ పెళ్లి వరకు వచ్చింది. విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు మందలించడంతో విరమించుకున్నారు. ప్రస్తుతం అమ్మాయి ఓ కళాశాలలో బీటెక్ చదువుతోంది. అదే కళాశాలలో మరో అబ్బాయితో ప్రేమలో పడింది. ఒకరికి తెలియకుండా మరొకరితో మాట్లాడుతూ ఇద్దరితోనూ ప్రేమాయణం నడుపుతోంది. ఇటీవల మొదటి ప్రియుడి విషయం తెలుసుకున్న రెండవ ప్రియుడు.. యువతిని నిలదీయడంతో తప్పును కప్పి పుచ్చుకునేందుకు తాను ప్రేమించడం లేదని, అతడే వేధిస్తున్నాడని చెప్పింది. ఈక్రమంలో రెండో ప్రియుడితో కలసి మొదటి ప్రియుడు అరవింద్‌పై దాడికి కుట్ర పన్నారు. రెండు రోజులు ముందుగానే గాజులదిన్నె ప్రాజెక్టు వద్దకు వచ్చి రెక్కీ నిర్వహించుకుని వెళ్లింది. మంగళవారం అరవింద్‌ను గాజులదిన్నె ప్రాజెక్టు వద్దకు తీసుకెళ్లింది. ఇదే విషయాన్ని ఫోన్లో మెసేజ్ ద్వారా ఎప్పటికప్పుడు రెండవ ప్రియుడికి సమాచారం ఇచ్చింది. అతడు తన స్నేహితులతో కలిసి వేటకొడవళ్లతో అక్కడికి చేరుకుని అరవింద్‌పై దాడి చేశారు. యువతి అక్కడి నుంచి పారిపోయింది. అరవింద్ కేకలు వేయడంతో చుట్టుపక్కల రైతులు కాపాడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా విచారణలో యువతిదే పక్కా ప్లాన్ అని తెలిసి పోలీసులు అవాక్కయినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సీఐ గంగాధర్ మాట్లాడుతూ ప్రేమజంటపై దాడి ఘటనను విచారిస్తున్నామని, గురువారం వివరాలు మీడియాకు వెల్లడిస్తామని చెప్పారు.‘నా భార్యను అంతలా చూస్తున్నారు.. చంపేస్తా’ -
అమ్మానాన్నకు అబద్ధం చెప్పానంటూ..
రాజాపూర్: తల్లిదండ్రులకు అబద్ధం చెప్పానని.. మనస్తాపానికి గురైన ఒక బీటెక్ విద్యార్థి ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండల కేంద్రానికి చెందిన మీసేవా కేంద్రం నిర్వాహకుడు సున్నపు రాధాకృష్ణ కుమారుడు సుభాశ్(22) హైదరాబాద్‌లోని కూకట్పల్లి జేఎన్టీయూలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. కాగా, సుభాశ్ బీటెక్‌లో కొన్ని సబ్జెక్ట్‌లు ఫెయిలైన విషయాన్ని దాచి.. పాస్ అయినట్టు తల్లిదండ్రులకు అబద్ధం చెప్పాడు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిస్తే ఏమంటారోనని లోలోపలే మధనపడ్డాడు. ఈ క్రమంలోనే సోమవారం ఇంట్లో ఒంటరిగా ఉన్న సుభాశ్.. ఉరి వేసుకుని మృతి చెందాడు. కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. -
బీటెక్ విద్యార్థినికి ప్రాణం నిలిపిన సీఎం జగన్
కోడుమూరు రూరల్: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బీటెక్ విద్యార్థిని ప్రాణం నిలిపారు. కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన గుర్రం క్రిష్ణయ్య 108లో డ్రైవర్, ఆయన భార్య నాగలక్ష్మమ్మ అంగన్వాడీ టీచర్. వీరి కుమార్తె జాన్వీకౌసిక్ ఒంగోలులోని రైజ్ ఇంజినీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. కాలికి గడ్డ ఏర్పడి.. అది క్రమంగా క్యాన్సర్‌గా మారింది. తల్లిదండ్రులు కర్నూలు, తిరుపతి, విజయవాడలో చూపించగా.. వైద్యులు ఆరు నెలలకు మించి ఆమె బతకదని, హైదరాబాద్‌లోని బసవతారకం ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ఆశతో అక్కడికి వెళ్లగా రూ.7 లక్షలు ఖర్చవుతుందని, ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేసేందుకు కూడా పరిమితి దాటిందని చెప్పారు. దీంతో ఆ తల్లిదండ్రులు అంత ఖర్చు పెట్టి చూపించే స్థోమత లేక వెనుదిరిగారు. కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్‌ను కలిసి తమ గోడును వెళ్లబోసుకోవడంతో ఆయన ఆరోగ్యశ్రీ ఉన్నతాధికారులతో, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో మాట్లాడి నిధులు మంజూరయ్యేలా చూశారు. దీంతో విద్యార్థినికి మార్చి నెలలో బసవతారకం ఆస్పత్రిలో ఆపరేషన్ జరిగింది. ఆగస్టులో విద్యార్థిని క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకోనుండటంతో ఆ తల్లిదండ్రుల సంతోషం అంతా ఇంతా కాదు. ఎన్నో ఆస్పత్రులు తిరిగి పాప ప్రాణం దక్కదని ఆశలు వదులుకున్న దశలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ రూపంలో సీఎం జగన్ తమ బిడ్డ ప్రాణాలు కాపాడారని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్‌కు రుణపడి ఉంటామని చెబుతున్నారు. జగనన్న వల్లే తాను కోలుకుంటున్నానని విద్యార్థిని జాన్వీకౌసిక్ చెప్పింది. -
మరికొన్ని రోజుల్లో విదేశాలకు! పాపం.. అంతలోనే కానరాని లోకానికి
ఖిలా వరంగల్/కాశిబుగ్గ: కొడుకుపై ఆ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. బీటెక్ తరువాత విదేశాలకు పంపాలని ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ కూడా పొందారు. మరో ఐదు రోజుల్లో కాలేజీకి వెళ్లాలి. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదం ఆ యువకుడిని బలితీసుకుంది. స్నేహితుడి ఇంటికి వెళ్లొస్తుండగా వీధి కుక్క అడ్డురావడంతో తప్పించబోగా బైక్ అదుపుతప్పి సైకిల్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న యువకుడితోపాటు సైకిల్‌పై ఉన్న వ్యక్తి కూడా అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వరంగల్–నర్సంపేట రహదారిపై దయానందకాలనీ కనకదుర్గమ్మ దేవాలయం సమీపాన మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ములుగు జిల్లా ఏటూరునాగరం మండలం చిన్నబోయినపల్లి గ్రామానికి చెందిన తుమ్మ సంజీవరెడ్డి–నాగశ్రీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు తుమ్మ జయసింహారెడ్డి, అలియాస్ టున్న(19) ఉన్నారు. ప్రస్తుతం వీరి కుటుంబం వరంగల్ పోచమ్మమైదానం సమీపంలోని టీచర్స్‌కాలనీలో నివాసం ఉంటుంది. కాగా, జయసింహారెడ్డి సోమవారం రాత్రి రంగశాయిపేటలోని స్నేహితుడి ఇంటికి వెళ్లొస్తానని తల్లిదండ్రులు చెప్పి బైక్‌పై వెళ్లాడు. తిరిగి మంగళవారం తెల్లవారుజామున సుమారు 2.40 గంటలకు టీచర్స్‌కాలనీలోని ఇంటికి బయలుదేరాడు. వరంగల్–నర్సంపేట రహదారిలోని దయానందకాలనీ కనకదుర్గమ్మ దేవాలయం సమీపానికి రాగానే వేగంగా ఉన్న బైక్‌కు వీధి కుక్క అడ్డు వచ్చింది. కుక్కను తప్పించబోయే క్రమంలో సైకిల్‌పై కూరగాయల మార్కెట్‌కు బయలుదేరిన వరంగల్ గాంధీనగర్‌కు చెందిన ముదిగొండ నాగవీరం(47)ను బైక్ బలంగా ఢీకొట్టింది. దీంతో ఇద్దరు రోడ్డుపై పడిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. జయసింహారెడ్డి మొబైల్ ఫొన్, నోట్లోని పళ్లు ఊడిపోయి రోడ్డుపై ఎగిరిపడ్డాయి. సమాచారం అందుకున్న మిల్స్‌కాలనీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుల కుటుంబీలకు సమాచారం అందజేశారు. అనంతరం మృతదేహాలను ఎంజీఎం మార్చురీకి తరలించారు. జయసింహారెడ్డి ఇటీవలే ఇంటర్ పూర్తి చేసి బీటెక్‌లో చేరేందుకు సిద్ధమయ్యాడు. చేతికొస్తున్న కొడుకు అకాల మరణం చెందడంతో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. అలాగే, నాగవీరం పనికి వెళ్తేగాని కుటుంబం పూటగడవదు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చిన్నబోయినపల్లి, వరంగల్ టీచర్స్ కాలనీ, గాంధీనగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడు ముదిగొండ నాగవీరం బావమరిది రాజనాల శ్రీనివాసప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మిల్స్‌కాలనీ ఇన్స్పెక్టర్ ముస్కే శ్రీనివాస్ తెలిపారు. అధ్వానంగా రహదారి.. దయానందకాలనీ నుంచి వెంకట్రామ జంక్షన్ వరకు ఇరువైపులా రోడ్డు ఇరుకుగా ఉందని, దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని, రాంకీ వరకు రోడ్డు విస్తరణ చేసి వెంకట్రామ జంక్షన్ వరకు ఎందుకు చేయడంలేదో చెప్పాలంటున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి దయానందకాలనీ నుంచి వెంకట్రామ జంక్షన్ వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని కోరుతున్నారు. -
రమ్య హత్యకు ముందు రెక్కీ
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): గుంటూరులో ఈ నెల 15న బీటెక్ విద్యార్థిని రమ్యను హత్యచేసిన శశికృష్ణ ముందురోజు రెక్కీ నిర్వహించినట్లు తెలిసింది. అతడిని పోలీసులు విచారించినప్పుడు మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ ఏడాది జనవరిలో ఇన్‌స్ట్రాగామ్‌లో రమ్యకు, వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామానికి చెందిన నిందితుడు కుంచాల శశికృష్ణకు పరిచయం ఏర్పడింది. కొద్దిరోజులు ఇద్దరూ ఇన్‌స్ట్రాగామ్‌లో స్నేహంగా మెలిగారు. తనని ప్రేమించాలంటూ శశికృష్ణ వేధిస్తుండటంతో రమ్య ఇన్‌స్ట్రాగామ్‌తోపాటు, అతడి ఫోన్ నంబరును బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. ఈ క్రమంలో శశికృష్ణ ఏప్రిల్‌లో రమ్య స్వగ్రామమైన చిలుమూరు వెళ్లి ఇబ్బంది పెట్టాడు. రమ్య కళాశాలకు వస్తోందా.. లేదా అని తెలుసుకునేందుకు ఈ నెల 14న శశికృష్ణ బుడంపాడులోని కళాశాలకు వెళ్లాడు. ద్విచక్ర వాహనంపై తన స్నేహితుడితో కలిసి వెళ్లిన అతడు దూరం నుంచి రమ్యను చూశాడు. బస్సు దిగుతూ శశికృష్ణను గమనించిన రమ్య భయంతో తన స్నేహితురాలితో కలిసి కళాశాలలోకి పరుగులు పెట్టింది. అదేరోజు సాయంత్రం ఇద్దరు స్నేహితులతో కలిసి కాలేజీ వద్దకు వెళ్లాడు. మధ్యాహ్నానికే కాలేజీ అయిపోవడంతో రమ్య అప్పటికే ఇంటికి వెళ్లిపోయింది. తనతో ఉన్న స్నేహితుల్లో ఒకరి వద్ద కత్తిని తీసుకున్న శశికృష్ణ ఈ నెల 15న ఉదయం కాకానిరోడ్డులో రమ్య కోసం మాటేశాడు. ఆ సమయంలో టిఫిన్ కోసం వచ్చిన రమ్యతో.. తనను ఎందుకు ప్రేమించడంలేదంటూ వాదులాటకు దిగాడు. రమ్య ఫోన్ లాక్కున్నాడు. టిఫిన్ ఇంట్లో ఇచ్చి, తన ఫోన్ కోసం వచ్చిన రమ్యను బండి ఎక్కాలని బలవంతం చేశాడు. దీంతో రమ్య శశికృష్ణను నెట్టి ఫోన్ తీసుకుని ఇంటికి వెళుతున్న క్రమంలో అడ్డగించి కత్తితో పొడిచి చంపేశాడు. నిష్పక్షపాత దర్యాప్తు చేయండి రమ్య హత్యపై డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ లేఖ సాక్షి, న్యూఢిల్లీ: గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని ఏపీ డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఆదేశించింది. ఈ మేరకు ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ రేఖాశర్మ మంగళవారం డీజీపీకి లేఖ రాశారు. మహిళలపై జరుగుతున్న దాడులు, భద్రత గురించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా కేసు స్వీకరిస్తున్నట్లు ఎన్సీడబ్ల్యూ ట్వీట్ చేసింది. -
బీటెక్ విద్యార్థినిపై సీనియర్ విద్యార్థులు అత్యాచారయత్నం
-
పార్టీ అని పిలిచి.. బీటెక్ విద్యార్థినిపై..!
సాక్షి, విజయవాడ : కృష్ణాజిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని ఆగిరిపల్లిలో బీటెక్ విద్యార్థినిపై సీనియర్ విద్యార్థులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఎన్ఆర్ఐ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాలేజీలో చదువుతున్న బీటెక్ విద్యార్థిని సీనియర్లు అయిన శివారెడ్డి, కృష్ణారెడ్డి పుట్టినరోజు పార్టీ పేరిట పిలిచారు. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి.. ఆమెకు ఇచ్చారు. ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత అత్యాచారం చేస్తూ.. వీడియో చిత్రీకరించారు. జరిగిన దారుణం గురించి బాధితురాలు కుటుంబసభ్యులకు వివరించింది. కుటుంబసభ్యులు కాలేజీని వెళ్లి నిలదీయడంతో.. కాలేజీ కరస్పాండెంట్ సమక్షంలో పంచాయతీ నిర్వహించి.. బాధితురాలికి నిందితులతో క్షమాపణలు చెప్పించారు. అనంతరం సీనియర్ విద్యార్థుల ఫోన్ల నుంచి వీడియోలు డిలీట్ చేశారు. ఈ ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత ప్రవీణ్ అనే మరో సీనియర్ వద్ద ఈ వీడియో చూసింది. అతను ఈ వీడియోను చూపిస్తూ.. బాధితురాలిని బ్లాక్మెయిల్ చేశాడు. తన కోరిక తీర్చాలని, రూ. పది లక్షలు ఇవ్వాలని అతడు డిమాండ్ చేశాడు. దీంతో ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులతో కలిసి బాధితురాలు ఫిర్యాదు చేశారు. దీంతో సీనియర్లు కృష్ణారెడ్డి, శివారెడ్డి, ప్రవీణ్‌లపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
మోసపోయాను.. నన్ను క్షమించు నాన్నా..
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడులో విషాదం చోటుచేసుకుంది. ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని శనివారం ఓ బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. లోయారాణి అనే విద్యార్థిని ఇంట్లోనే ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. రాణి రాసిన సూసైడ్ నోట్ కేసులో కీలకంగా మారింది. ప్రేమించిన అబ్బాయి ఫోన్ నెంబర్‌ను రాణి లెటర్లో పేర్కొంది. పోలీసులు దాని ఆధారంగా అతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాణి సూసైడ్ నోట్లో ‘ నాన్న నేను తప్పు చేశాను. నువ్వు అనుకున్నట్లుగానే నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. అన్నీ అయిపోయాక నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. నన్ను మోసం చేశాడు. అందుకే నేను చనిపోతున్నాను. నా ముఖం మీకు చూపించలేను. నేను చేసిన దానికి నన్ను క్షమించు నాన్న.’ అంటూ పేర్కొంది. -
కీచకుడి బెదిరింపు.. బీటెక్ విద్యార్థిని రమ్య మృతి
సాక్షి, నిజామాబాద్ : జిల్లాలో గత నెల 28న కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బీటెక్ విద్యార్థిని రమ్యకృష్ణ చికిత్స పొందుతూ మరణించింది. 80 శాతం కాలిన గాయాలతో గత ఆరు రోజులుగా మృత్యువుతో పోరాడిన ఆమె శనివారం ఉదయం ప్రాణాలు వదిలింది. గతంలో సన్నిహితంగా ఉన్న ఫొటోలు ఇంటర్నెట్లో పెడతానని ఓ వ్యక్తి బెదిరించడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకుంది. మాక్లూరుకు చెందిన రమ్యకృష్ణకు ప్రసాద్ అనే వ్యక్తితో పరిచయం ఉంది. ప్రసాద్ వృత్తి రీత్యా కువైట్‌లో స్థిరపడ్డాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చదువు పూర్తి కావొస్తున్న రమ్యకృష్ణకు ఇంట్లో వివాహా సంబంధాలు చూస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రసాద్ పెళ్లికి ఒప్పుకుంటే గతంలో దిగిన ఫొటోలు నెట్లో పెడతానంటూ రమ్యను బెదిరించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రమ్యకృష్ణ గత నెల 28న ఒంటిపై కిరోసిన్ పోసుకుని, నిప్పంటిచుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆమె శరీరం పూర్తిగా కాలిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి వద్ద స్టేట్మెంట్ నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చదివింది బీటెక్.. చేసేది ఎర్రచందనం స్మగ్లింగ్
రాయచోటి టౌన్ : యువత వివిధ కారణాల రీత్యా పెడదోవ పడుతోంది. సంపాదన కోసం పెడదారి పట్టడానికి కూడా వెనకాడటం లేదనడానికి ఎర్రచందనం కూలీలే (యువకులే) నిదర్శనం. బుధవారం ఎర్రచందనం అక్ర మ రవాణాలో పట్టుబడిన వారిలో యువకులే ఎక్కువగా ఉన్నారు. వీరిలో తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన తమిళ మణి (22) యువకుడు బీటెక్ చదివాడు. చదువుకు తగ్గ ఉద్యోగం దొరక్కపోవడంతో జీవనోపాధి కోసం ఒక యజమాని వద్ద ఒక చిరుద్యోగంలో చేరాడు. ఆయన వద్ద వచ్చే సంపాదనతో ఇల్లు గడవడమే కష్టమైంది. ఇంతలో చెల్లి పెళ్లి కుదిరింది. ఏమి చేయాలో దిక్కుతోచక తాను పని చేస్తున్న యజమాని వద్దకు వెళ్లి తన సోదరి వివాహం కుదిరిందని.. కొంత డబ్బులు ఇస్తే ఉద్యోగం చేసే సమయంలో నెలనెలా కొంత మొత్తం కడతానని చెప్పారు. ఆ యువకుడి అవసరాన్ని తన ఆయుధంగా మార్చుకున్న యజమాని తాను ఇచ్చే డబ్బులు నెల నెలా తీర్చాల్సిన అవసరం లేకుండా మంచి అవకాశం ఇస్తానని, ఒక సారి తాను చెప్పిన పని చేస్తే లక్షాధికారి అవుతావని నమ్మించాడు. ఆ యువకుడు ఇదేదో చాలా బాగుందనుకొని అందుకు సరేనన్నాడు. ఏమి చేయాలని అడిగాడు. ఒకసారి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి అక్కడి వైఎస్సార్ జిల్లాలోని అడవులలో ఎర్రచందనం తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పాడు. ఆ మాటలు నమ్మి వెంటనే రంగంలోకి దూకాడు. వచ్చిన మొదటి రోజే పోలీసులకు దొరికిపోయాడు. ఇది తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన తమళి మణి నిజ జీవిత చరిత్ర. -
పరీక్షలో ఫెయిల్.. బీటెక్ విద్యార్థి..?
విశాఖపట్నం: పరీక్షలో ఫెయిల్ అయ్యాడని క్షణికావేశంలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దువ్వాడ విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజీలో యశ్వంత్(18) అనే విద్యార్థి బీటెక్ చదువుతున్నాడు. బీటెక్ సెకండ్ సెమిస్టర్లో రెండు సబ్జెక్టుల్లో యశ్వంత్ ఫెయిల్ అయ్యాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెంది అదే కాలేజీ బిల్డింగ్ మీద నుంచి కిందకు దూకాడు. వెంటనే కాలేజీ యాజమాన్యం దగ్గరలోని ఆసుపత్రికి తరలించింది. చికిత్సపొందుతూ యశ్వంత్ మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చదివింది బీటెక్..చేసేది చీటింగ్
స్నేహితుడిని మోసం చేసిన వ్యక్తి అరెస్ట్ రూ. 1.50 లక్షల విలువైన ఐదు మొబైల్స్ రికవరీ చిక్కడపల్లి: స్నేహితుని మోసం చేసి రూ. 1.50 లక్షల విలువైన మొబైల్ ఫోన్లను దొంగిలించి పరారైన బి.టెక్. చదివిన యువకుణ్ణి చిక్కడపల్లి క్రై మ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ మంత్రి సుదర్శన్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మారుతీ నందీశ్వర్బాబ్జీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దిల్సుఖ్ నగర్‌కు చెందిన ఉదయ్ కిరణ్ (27) బి.టెక్. పూర్తిచేసి దిల్‌సుక్‌నగర్, అమీర్‌పేట తదితర ప్రాంతాల్లో మొబైల్ షాపులలో పనిచేసేవాడు. ఇటీవల విద్యానగర్‌కు చెందిన తన స్నేహితుడు రాజ్‌కిషోర్ వద్దకు వచ్చి తనకు ఉద్యోగం లేదని షెల్టర్ ఇవ్వాలని కోరాడు. చిక్కడపల్లిలోని లాట్మొబైల్ కంపెనీ లో రాజ్‌కిషోర్ పనిచేస్తున్న విషయం తెలుసుకుని కస్టమర్లు అడుగుతున్నారని 5 మొబైళ్లు తేవాలని సూచించాడు. అతని మాటలు నమ్మిన రాజ్‌కిషోర్ రెండు విలువైన ఐ ఫోన్లు , 3 స్యామ్సంగ్ ఫోన్లు ఇంటికి తేగా కస్టమర్లకు విక్రయిస్తానని చెప్పి ఫోన్లతో ఉడాయించాడు. ఈ నెల 16న ఈ సంఘటన చోటుచేసుకోగా 26న బాధితుడు ఫిర్యాదు చేశాడు. సోమవారం పోలీసులు ఉదయ్‌కిరణ్‌ను అరెస్టు చేసి రి మాండ్‌కు తరలించారు. అతని నుంచి 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. -
బీటెక్ విద్యార్థిని అదృశ్యం
హైదరాబాద్ : విద్యార్థిని అదృశ్యమైన సంఘటన మల్కాజిగిరి పీఎస్ పరిధిలో జరిగింది. స్థానిక ఎస్ఐ మోహన్ కథనం ప్రకారం.. జేఎల్ఎస్ నగర్‌కు చెందిన కృష్ణగౌడ్ కుమార్తె ఉషారాణి (22) సీవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజిలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతోంది. ఈ నెల 10న కాలేజీకి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండడంతో ఆచూకీ కూడా తెలియలేదు. ఆదివారం విద్యార్థిని తండ్రి కృష్ణగౌడ్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డుప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి
అరకులోయ (విశాఖ) : వేగంగా వస్తున్న రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతిచెందాడు. ఈ సంఘటన విశాఖ జిల్లా అరకులోయలో శనివారం చోటుచేసుకుంది. అరకు లోయ నుంచి విశాఖ వెళ్తున్న స్కార్పియో వాహనం ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న వేద సాయితరుణ్(21) అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు విజయవాడ వి.ఆర్. సిద్దార్థ్ కళాశాలలో బీటెక్ సెంకండియర్ చదువుతున్నట్లు సమాచారం. -
పరీక్షలు సరిగ్గా రాయలేదని..
బోయిన్పల్లి (కరీంనగర్) : ఈ మధ్యకాలంలో యువత చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు ఎక్కువవుతున్నాయి. తాజాగా బీటెక్ పరీక్షలు సరిగ్గా రాయలేదని మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా బోయిన్పల్లి మండలం విలాసాగర్లో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొప్పుల శ్రీలేఖ(21) హైదరాబాద్‌లోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ ఇనిస్టిట్యూట్స్‌లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. నాలుగు రోజుల క్రితమే పరీక్షలు ముగించుకొని ఇంటికి వెళ్లిన శ్రీలేఖ పరీక్షలు సరిగ్గా రాయలేదని అన్యమనస్కంగా ఉంటోంది. ఈ క్రమంలో గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
హైటెక్ మాస్ కాపీయింగ్ చేస్తూ పట్టుబడ్డ విద్యార్థి
హైదరాబాద్ : చాంద్రాయణగుట్టలోని అరోరా ఇంజనీరింగ్ కాలేజీలో శుక్రవారం హైటెక్ మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతూ ఓ విద్యార్థి స్క్వాడ్‌కు దొరికాడు. పట్టుబడిన విద్యార్థి షేక్ వసీం అహ్మద్.. నవాబ్ షా ఆలం ఖాన్ ఇంజనీరింగ్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. లోదుస్తుల్లో మొబైల్‌ను, బనియన్‌లో ట్రాన్స్మీటర్లను అమర్చి, చిన్న పరిమాణంలో బ్లూటూత్ పరికరాన్ని చెవిలో పెట్టుకుని ఆన్లైన్లో పరీక్ష రాస్తుండగా స్క్వాడ్ పట్టుకున్నారు. -
'అమ్మానాన్నలకు భారం కాదల్చుకోలేదు'
హైదరాబాద్ : 'చదువులో వెనుకబడిన నేను అమ్మానాన్నలకు భారం కాదల్చుకోలేదు.. అందుకే ప్రాణం తీసుకుంటున్నా' అని సూసైడ్ నోట్ రాసి ఓ బీటెక్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన నగరంలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌కు చెందిన జె. రాకేష్(20) స్థానిక యన్.సి.యల్ శివసాయి బాయ్స్ హాస్టల్లో ఉంటూ మేడ్చల్‌లోని సీఎంఆర్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా చదువులో వెనుకబడిపోవడంతో.. అమ్మానాన్నలకు భారంగా మారుతున్నానని భావించి హాస్టల్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
విద్యార్థిని అదృశ్యం
మల్కాజిగిరి : ఓ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన మల్కాజిగిరి పీఎస్ పరిధిలో జరిగింది. ఎస్ఐ నరసయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్టీసీ కాలనీకి చెందిన ఎం.నరేందర్ కూతురు యమునా వాణి(22) నగరంలోని ఓ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఈ నెల 13న ప్రాజెక్ట్ వర్క్ కోసం బయటకు వెళ్లిన ఆమె ఇంటికి తిరిగి రాలేదు. సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో తండ్రి నరేందర్ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
వరంగల్ : హసన్‌పర్తిలోని కిట్స్ ఇంజనీరింగ్ కాలేజీ బాయ్స్ హాస్టల్లో డి.సందీప్ గౌడ్(19) అనే విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. సందీప్ ప్రస్తుతం బీటెక్(సివిల్) రెండో సంవత్సరం చదువుతున్నాడు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
రైలుపట్టాలపై విద్యార్థి ఆత్మహత్య
నల్లగొండ : నల్లగొండ రైల్వేస్టేషన్ సమీపంలో ఓ బీటెక్ విద్యార్థి రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. మృతుడు మహబూబ్‌నగర్ జిల్లా వీపనగండ్ల మండలం గూడెం గ్రామానికి చెందిన హరికృష్ణగా గుర్తించారు. ఇతడు మహాత్మాగాంధీ వర్సిటీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. నల్లగొండ రైల్వే స్టేషన్‌కు సమీపంలోని ఫ్లైఓవర్ కింద పట్టాలపై తన మృతదేహం ఉంటుందని, వచ్చి తీసుకెళ్లాలంటూ ఆత్మహత్యకు ముందు హరికృష్ణ తన మిత్రుడికి ఎస్ఎంఎస్ పంపినట్టు పోలీసులు గుర్తించారు. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. -
నీలిమకు ఏపీ సీఎం ఆర్థికసాయం
హైదరాబాద్: ఎవరెస్ట్ అధిరోహణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థినికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.2 లక్షలు ఆర్థిక సాయం అందించారు. ఈ వివరాలను ఏపీ ప్రభుత్వ సమాచార, ప్రజా సంబంధాలశాఖ ఓ లేఖలో పేర్కొంది. శనివారం నాడు విద్యార్థినికి చెక్ ఇచ్చి ఆమెను అభినందించారు. ఎవరెస్ట్ అధిరోహించనున్న ఇంజినీరింగ్ విద్యార్థి నీలిమ స్వస్థలం గుంటూరు జిల్లా తురకాపాలెం. నేపాల్ భూకంపం నేపథ్యంలో గతంలో ఆమె చేపట్టిన యాత్ర మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది. రెస్క్యూ టీమ్స్ ఆమెను కాపాడటంతో నేపాల్ దుర్ఘటన నుంచి బయటపడింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో నీలిమ తన యాత్రను ప్రారంభించనుంది. తన ఎవరెస్ట్ యాత్రకుగానూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని నీలిమ హర్షం వ్యక్తం చేసింది. -
ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
రాజానగరం (తూర్పు గోదావరి జిల్లా) : రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామంలో దామర నవీన్(19) అనే బీ.టెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం తన రూంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ముగ్గురు స్నేహితులతో కలిసి నవీన్ ఓ రూంలో ఉంటూ చదువుకుంటున్నాడు. కాగా మంగళవారం కాలేజీకి వెళ్లలేదు. సాయంత్రం కాలేజీ నుంచి రూమ్‌కి వచ్చిన స్నేహితులు తలుపు కొడితే తీయకపోయేసరికి బద్దలు కొట్టారు. రూంలో నవీన్ ఉరివేసుకుని విగతజీవిగా కనిపించడంతో బిత్తరపోయారు. నవీన్ మండలంలోని గోదావరి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. నవీన్ స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన ప్రదేశంలో ఓ సూసైడ్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సూసైడ్ నోట్లో ‘మమ్మీ ఐ లవ్ యూ, డాడీ ఐ లైక్ యూ’ అని మాత్రమే రాసి ఉంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. -
రోడ్డుప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి
ఘట్కేసర్ (రంగారెడ్డి) : వేగంగా వస్తున్న డీసీఎం.. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ప్రమాదంలో బైక్ పై ఉన్న ఒక విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం జోడిమెట్ల వద్ద సోమవారం చోటుచేసుకుంది. స్థానిక వీబీఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న కె. సందీప్(22) స్నేహితుడు సాయి కిరణ్‌తో కలిసి హోండా యాక్టీవాపై కళాశాలకు వెళ్లి వస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న డీసీఎం వాహనం ఢీకొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న సందీప్ అక్కడికక్కడే మృతిచెందగా.. సాయి కిరణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రియురాలు లేని లోకంలో ఉండలేక..
కొత్తగూడెం (ఖమ్మం) : ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రేయసి దూరమవడంతో.. జీవించడం వృధా అనుకున్న ఓ భగ్న ప్రేమికుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం వేపలగడ్డలోని అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని సుజాతా నగర్ పంచాయతీ నాయకుల గూడెం గ్రామానికి చెందిన ఓడుగు సంతోష్(21) ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. అదే గ్రామానికి చెందిన బాలు వినీల(19) డిప్లొమా చివరి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో ఇరువురి మనసులు కలిశాయి. ప్రేమ జంట చెట్టపట్టాలేసుకొని తిరిగారు. ఈ సంవత్సరంతో చదువులు పూర్తవుతుండటంతో.. ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసిపోయిందనే భయంతో గురువారం రాత్రి వినీల పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం మృతి చెందింది. ఈ విషయం తెలిసిన సంతోష్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఏం చేయాలో తోచక తన ప్రియురాలు లేని లోకంలో తాను బతకలేనని కళాశాల ప్రాంగణంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గుర్తించిన తోటి విద్యార్థులు అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా.. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.