హైదరాబాద్ : 'చదువులో వెనుకబడిన నేను అమ్మానాన్నలకు భారం కాదల్చుకోలేదు.. అందుకే ప్రాణం తీసుకుంటున్నా' అని సూసైడ్ నోట్ రాసి ఓ బీటెక్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన నగరంలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌కు చెందిన జె. రాకేష్(20) స్థానిక యన్.సి.యల్ శివసాయి బాయ్స్ హాస్టల్‌లో ఉంటూ మేడ్చల్‌లోని సీఎంఆర్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.
ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా చదువులో వెనుకబడిపోవడంతో.. అమ్మానాన్నలకు భారంగా మారుతున్నానని భావించి హాస్టల్‌లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
'అమ్మానాన్నలకు భారం కాదల్చుకోలేదు'
Published Mon, Mar 21 2016 5:12 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement