
సాక్షి, క్రైమ్: మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా జవహార్ నగర్‌లో ఘోరం చోటు చేసుకుంది. ప్రియుడి ఇంట్లోనే ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి..
మెహిదీపట్నంలో నివాసం ఉంటున్న పూజ.. చైతన్యపురిలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేస్తోంది. ఈ క్రమంలో జవహర్ నగర్ యాప్రాల్‌కి చెందిన దయాకర్‌తో పరిచయం ఏర్పడగా.. అది ప్రేమగా మారింది. అయితే ఆ విషయం తెలిసి దయాకర్ తల్లి ఇద్దరినీ మందలించింది. కూతురిని హద్దులో పెట్టుకోవాలంటూ పూజ పేరెంట్స్‌ను బెదిరించినట్లు కూడా తెలుస్తోంది. ఈ క్రమంలో..
పూజను ఇంటికి తీసుకెళ్లి మరీ తల్లిని ఒప్పించాలని దయాకర్ ప్రయత్నించాడు. ఆ సమయంలో దయాకర్‌కి, అతని తల్లికి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. అయితే తాను పూజను వివాహం చేసుకోనని దయాకర్ తెగేసి చెప్పడం.. ఊహించని ఆ పరిణామంతో పూజ షాక్‌కు గురైంది. ఆపై ఓ గదిలోకి పరిగెత్తి గడియ పెట్టుకుంది. ఎంతకీ ఆమె తలుపు తీయకపోవడంతో.. బద్ధలు కొట్టి చూడగా పూజ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. విషయం పోలీసులకు చేరడంతో వాళ్లు వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం.. పూజ పేరెంట్స్ ఫిర్యాదుతో దయాకర్‌తో పాటు అతని తల్లిపైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment