DAYAKAR
-
మేడ్చల్: ప్రియుడి ఇంట్లో ప్రియురాలి ఆత్మహత్య!
సాక్షి, క్రైమ్: మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా జవహార్ నగర్లో ఘోరం చోటు చేసుకుంది. ప్రియుడి ఇంట్లోనే ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. మెహిదీపట్నంలో నివాసం ఉంటున్న పూజ.. చైతన్యపురిలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేస్తోంది. ఈ క్రమంలో జవహర్ నగర్ యాప్రాల్‌కి చెందిన దయాకర్‌తో పరిచయం ఏర్పడగా.. అది ప్రేమగా మారింది. అయితే ఆ విషయం తెలిసి దయాకర్ తల్లి ఇద్దరినీ మందలించింది. కూతురిని హద్దులో పెట్టుకోవాలంటూ పూజ పేరెంట్స్‌ను బెదిరించినట్లు కూడా తెలుస్తోంది. ఈ క్రమంలో.. పూజను ఇంటికి తీసుకెళ్లి మరీ తల్లిని ఒప్పించాలని దయాకర్ ప్రయత్నించాడు. ఆ సమయంలో దయాకర్‌కి, అతని తల్లికి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. అయితే తాను పూజను వివాహం చేసుకోనని దయాకర్ తెగేసి చెప్పడం.. ఊహించని ఆ పరిణామంతో పూజ షాక్‌కు గురైంది. ఆపై ఓ గదిలోకి పరిగెత్తి గడియ పెట్టుకుంది. ఎంతకీ ఆమె తలుపు తీయకపోవడంతో.. బద్ధలు కొట్టి చూడగా పూజ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. విషయం పోలీసులకు చేరడంతో వాళ్లు వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం.. పూజ పేరెంట్స్ ఫిర్యాదుతో దయాకర్‌తో పాటు అతని తల్లిపైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
హాజరు అంతంతే..
సాక్షి, వరంగల్ రూరల్ : లోక్‌సభ సమావేశాల్లో మన ఎంపీల హాజరు శాతం అంతంతమాత్రంగానే ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం 2014 మే 26న కేంద్రంలో పాలనా పగ్గాలు చేపట్టగా.. 16వ లోక్‌సభ మొదటి సమావేశం జూన్ నాలుగో తేదీన జరిగింది. అప్పటినుంచి 17 సెషన్లలో 331 రోజుల పాటు సమావేశాలు జరిగాయి. ఉమ్మడి వరంగల్ నుంచి ముగ్గురు ఎంపీలు పసునూరి దయాకర్ (వరంగల్), అజ్మీర సీతారాం నాయక్ (మహబూబాబాద్), డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ (భువనగిరి) ప్రాతినిథ్యం వహిస్తుండగా.. ఈ ఐదేళ్లలో వారు పలు సమస్యలపై గళమెత్తారు. అయితే కొన్ని సమస్యలు పరిష్కారం కాగా.. మరి కొన్ని అలానే ఉన్నాయి. మొత్తానికీ లోక్‌సభ సమావేశాలకు మన ప్రజాప్రతినిధులు కనీసం 80 శాతం హాజరుకాకపోవడం గమనార్హం. 16వ లోక్‌సభ సమావేశాలు బుధవారంతో ముగిసిన నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. వరంగల్ : ‘పసునూరి’ ఇలా.. 2015 నవంబర్ 24న వరంగల్ పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచిన పసునూరి దయాకర్ గెలుపొందారు. అంతకంటే ముందు 2014లో వరంగల్ ఎంపీగా కడియం శ్రీహరి గెలుపొందారు. ఆ తర్వాత కాలంలో సీఎం కేసీఆర్ ఆయనకు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలను అప్పగించడంతో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. గడిచిన నాలుగేళ్లలో దయాకర్ 112 రోజులు లోక్‌సభ సమావేశాలకు హాజరయ్యారు. ఎంపీగా ఎన్నికైన నాటి నుంచి చివరి సమావేశం వరకు ఐదు ప్రశ్నలు మాత్రమే లేవనెత్తారు. బాలికల అక్రమ రవాణా, పసుపు బోర్డు ఏర్పాటు, వాటర్ పొల్యూషన్, ట్రేడ్ ఇన్ బిట్కాన్, రూరల్ డెవలప్మెంట్ల్పై ప్రశ్నలు సంధించారు. 2015 డిసెంబర్ 18, నుంచి లెబర్ డిపార్ట్మెంట్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా పసునూరి కొనసాగారు. మహబూబాబాద్ : సీతారాంనాయక్.. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో మహబూబాబాద్ ఎంపీగా డాక్టర్ అజ్మీరా సీతారాంనాయక్ గెలుపొందారు. ఐదేళ్లలో 331 రోజులు సభ జరుగగా.. 227 రోజులు హాజరయ్యారు. 44 డిపార్ట్మెంట్లపై 118 ప్రశ్నలు అడిగారు. 2014 సెప్టెంబర్ ఒకటి నుంచి ఇప్పటివరకు పార్లమెంట్ నిబద్ధత కమిటీ సభ్యుడు, కమ్యూనికేషన్ ఇన్ఫర్మమేషన్ టెక్నాలజీ కమిటీ సభ్యుడిగా.. 2017 నవంబర్ 3 నుంచి కెమికల్ ఫర్టిలైజర్స్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2017 సెప్టెంబర్ ఒకటి నుంచి నవంబర్ 2 వరకు సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ సభ్యుడిగా కొనసాగారు. భువనగిరి : బూర నర్సయ్యగౌడ్.. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో భువనగిరి లోక్‌సభ సభ్యుడిగా డాక్టర్ బూర నర్సయ్యగౌడ్గెలుపొందారు. 16వ లోక్‌సభ సమావేశాలు ముగిసేసరికి ఆయన 184 రోజులు హాజరయ్యారు. సమావేశాల్లో 59 డిపార్ట్మెంట్లపై 216 ప్రశ్నలు సంధించారు. 2014 సెప్టెంబర్ ఒకటి నుంచి లేబర్ డిపార్ట్మెంట్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా కొనసాగారు. 2014 సెప్టెంబర్ 12 నుంచి 2018 జనవరి 8 వరకు పార్లమెంటరీ వెనుకబడిన తరగతుల స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, స్కిల్ డెవలప్మెంట్ సభ్యుడిగా కొనసాగారు. పాస్‌పోర్ట్ కార్యాలయం తెచ్చా.. వరంగల్‌కు పాస్‌పోర్ట్ కేంద్రాన్ని మంజూరు చేయించి తీసుకొచ్చాను. సీఎం కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేశాను. నా వంతు అభివృద్ధికి పాటుపడ్డా. తక్కువ సమయంలో సీనియర్ల దగ్గర చాలా నేర్చుకున్నా. వరంగల్‌లో నేషనల్ హైవేలు తీసుకొచ్చాను. కొడకండ్లకు ఏకలవ్య స్కూల్ మంజూరు చేయించాను. దీనికి దాదాపు రూ.200 కోట్ల వ్యయమవుతోంది. ప్రభుత్వం కేటాయించిన నిధుల ద్వారా రోడ్లు, కమ్యూనిటీహాళ్లు తదితర అభివృద్ధి పనులకు కేటాయించాను. – పసునూరి దయాకర్, వరంగల్ ఎంపీ గొప్ప అనుభూతి.. మారుమూల గ్రామం నుంచి వచ్చి ప్రొఫెసర్‌గా, సోషల్ వర్కర్‌గా కొనసాగుతూనే సీఎం కేసీఆర్ ఆకాంక్షకు అనుగుణంగా ఉద్యమంలో పాల్గొన్నాను. కేసీఆర్ నన్ను గుర్తించి లోక్‌సభ టికెట్ ఇచ్చి గెలిపించి పార్లమెంట్‌కు పంపించారు. గిరిజన బిడ్డగా అదృష్టంగా భావిస్తున్నా. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని నిరంతరం ఈ ప్రాంత అభివృద్ధి, దేశ గిరిజన సమస్యలపై పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లా. కొన్నింటిని సాధించాను. జిల్లాకు పాస్‌పోర్ట్, నేషనల్ హైవేలు, రెండు ఆర్వోబీలు, కొత్త రైళ్లను మంజూరు చేయించాను. – డాక్టర్ అజ్మీర సీతారాంనాయక్, మానుకోట ఎంపీ -
లోక్‌సభకు పోటీ చేస్తా
సాక్షి, హైదరాబాద్: తాను వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేస్తానని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ వెల్లడించారు. అయితే, ఏ స్థానం నుంచి పోటీ చేయాలన్నది పార్టీ నిర్ణయిస్తుందని, ఎక్కడి నుంచి పోటీచేయమన్నా అందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ దొడ్డిదారిన గెలిచారని విమర్శించారు. వీవీప్యాట్లను లెక్కించాలని తాము కోరుతున్నామని, కాలం గడిచేకొద్దీ సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తాము వేసిన పిటిషన్‌పై వీవీ ప్యాట్ల వివరాలు ఐదేళ్లు ఉంటాయని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టులో చెప్పారని, దీనిపై వచ్చేనెల 7లోపు కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు చెప్పిందని ఆయన వెల్లడించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యంతో పాటు ఓట్ల కూల్చివేత కూడా జరిగిందని, ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై కాంగ్రెస్ పో -
‘వీవీ ప్యాట్’ల లెక్కింపునకు ఆదేశాలివ్వండి
సాక్షి, హైదరాబాద్: ఇటీవల తమ నియోజకవర్గాల పరిధిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ఈసీ) ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు పద్మావతిరెడ్డి, అద్దంకి దయాకర్, బీఎస్పీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఈసీని ఆదేశించింది. ఫిబ్రవరి 7 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఈసీకి స్పష్టం చేసింది. ఈ కౌంటర్‌కు 14వ తేదీ లోపు తిరుగు సమాధానం ఇస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్లను ఆదేశించింది. ఫిబ్రవరి 14న తదుపరి విచారణ చేపడతామంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈవీఎంల ద్వారా తమకు వచ్చిన ఓట్లకు, వీవీ ప్యాట్లలో నమోదైన ఓట్లకు తేడా ఉందని, అందువల్ల వీవీ ప్యాట్లలో ఓట్లను లెక్కించేలా ఈసీని ఆదేశించాలని కోరుతూ కోదాడ కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిరెడ్డి, తుంగతుర్తి కాంగ్రెస్ అభ్యర్థి అద్దంకి దయాకర్‌లు హైకోర్టులో తాజాగా పిటిషన్లు దాఖలు చేశారు. ఇదే అంశంపై మల్రెడ్డి రంగారెడ్డి గతంలోనే పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. వీవీ ప్యాట్లను లెక్కించలేదు.. పిటిషనర్ల తరఫున తూమ్ శ్రీనివాస్ తదితరులు వాదనలు వినిపిస్తూ.. తుంగతుర్తి నియోజకవర్గంలో 18 ఈవీఎంలు సరిగ్గా పనిచేయలేదని, అందువల్ల వీవీ ప్యాట్ల ఓట్లను లెక్కించాల్సిన అవసరం ఉందన్నారు. ఓటు వేసిన ఫలితం ఈవీఎంలపై కనిపించనప్పుడు, నిబంధనల ప్రకారం ఆ ఈవీఎంలను పక్కన పెట్టేయాల్సి ఉంటుందని తెలిపారు. అన్ని ఈవీఎంల ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక, ఈ పనిచేయని ఈవీఎంల వీవీ ప్యాట్లను లెక్కించాల్సి ఉంటుందని, తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో అలా జరగలేదన్నారు. వీవీ ప్యాట్ స్లిప్పులు థర్మల్ పేపర్‌పై ముద్రితమవుతాయని, నిపుణులు చెప్పే దానిని బట్టి వీటిపై ముద్రితమైన వివరాలు 45 రోజుల్లో తుడిచిపెట్టుకుపోతాయన్నారు. ఇలా జరిగితే తాము ఈ వ్యాజ్యాలు దాఖలు చేసి ఎటువంటి ప్రయోజనం ఉండదని నివేదించారు. పిటిషనర్ల వాదనలను ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది అవినాశ్ దేశాయ్ తోసిపుచ్చారు. థర్మల్ ప్రింట్ ఐదేళ్ల వరకు ఉంటుందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఈ వివరాలన్నింటితో కౌంటర్ దాఖలు చేయాలని తెలిపింది. -
అధికారమదంతోనే ఆ మాటలు
కేసీఆర్, కేటీఆర్‌పై కాంగ్రెస్ నేతలు శ్రవణ్, దయాకర్ ధ్వజం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ద్రోహులైన తలసాని శ్రీనివాస్, తుమ్మల నాగేశ్వర్రావు వంటివారిని సిగ్గులేకుండా మంత్రులను చేసిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అధికారమదంతో మాట్లాడుతున్నారని టీపీ సీసీ అధికార ప్రతినిధులు దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్ విమర్శించారు. గాంధీ భవన్లో శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ అబద్దపు హామీలతో, మోసం తో వచ్చిన అధికారం శాశ్వతంగా ఉండ దన్నారు. మంత్రి కేటీఆర్ స్థారుుకి మించి మాట్లాడటం తగదన్నారు. కోదండరాంపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవా లని, తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన కోదండరాంకు క్షమాపణలు చెప్పాలని శ్రవణ్, దయాకర్ సూచించారు. కోదండరాం అంటే ఒక వ్యక్తి కాదని, ఆయన వెనుక తెలంగాణ సమాజం ఉందన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని అహం కారంతో మాట్లాడటం మానుకోకుంటే ప్రజలు మంత్రి కేటీఆర్‌కు తగిన విధంగా బుద్ధిచెప్తారని హెచ్చరించారు. విమలక్క కార్యాలయం సీజ్ సరికాదు.. అరుణోదయ సంస్థ అధ్యక్షురాలు విమలక్క విషయంలో పోలీసుల తీరు సరికాదని టీపీ సీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, నేతలు దాసో జు శ్రవణ్, కత్తి వెంకటస్వామి, ఇందిరా శోభ న్, కైలాష్‌నేత హెచ్చరించారు. గాంధీభవన్ లో వారు శనివారం విలేకరులతో మాట్లా డుతూ తెలంగాణ కోసం నిరంతరం పోరాడిన విమలక్కపై పోలీసుల దాడి, చేయడం, కార్యాలయాన్ని సీజ్ చేయడం అప్రజాస్వామికమన్నారు. వికలాంగుల విభాగ చైర్మన్‌గా వీరయ్య టీపీసీసీ వికలాంగుల విభాగం చైర్మన్‌గా ముత్తినేని వీరయ్యను నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని వీరయ్య తెలిపారు. -
నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను
నేను చనిపోకూడదని ఆశిస్తున్నాను ► ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోంది... చావాలని లేదు. ► దయాకర్ పదమూడేళ్ల పసివాడు. ► అంత చిన్నవాడూ పుట్టిన రోజునే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ► అతడు ఆత్మాహుతికి పాల్పడ్డ కారణమూ చిన్నదే. ► పుట్టిన రోజు కాన్కగా అమ్మను రెండు వందలడిగాడు. ► తల్లి వందే ఇచ్చింది. దయాకర్‌కు మనస్తాపం కలిగింది. ► అంతే! బలవన్మరణానికి పాల్పడ్డాడు. ► ఇంకా వికసించక ముందే తనను తానే రాల్చేసుకున్నాడు. ► తాను వెళ్లిపోయాడు... తల్లిదండ్రుల మనసును బాధపెట్టాడు. ఆత్మహత్య చేసుకునే వారితో ఎవరైనా స్నేహితులు, బంధువులు కాసేపు ప్రేమగా పలకరిస్తే బలవన్మరణానికి పాల్పడరని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ మధ్యకాలంలో చిన్న పిల్లలు కూడా చిన్నచిన్న కారణాలకే బలవన్మరణానికి ఒడిగడుతున్నారు. మనం అందరం ఒక ఫ్యామిలీగా ఈ విషయంలో జాగ్రత్త పడటం చాలా అవసరం. హైదరాబాద్‌కు చెందిన ఈ పసివాడే కాదు... కొన్ని పసిమొగ్గలు ఇలా చిన్నచిన్న కారణాలతో ఆత్మహత్యలు చేసుకొని రాలిపోతున్నాయి. ఇలాంటి అనర్థాలను అరికట్టాలంటే ఏం చేయాలి? తనువూ మనసూ పూర్తి వికాసానికి తల్లిదండ్రులు ఏమార్గం అనుసరించాలి? సైకియాట్రిస్ట్‌లు చెప్పే మాట విందాం. ఎన్నో గర్భశోకాలు నివారిద్దాం. మారుతున్న సమాజంలో పిల్లలపై ఎన్నో ప్రభావాలు పడుతున్నాయి. వాళ్లపై అనేక రకాల ఒత్తిడులను కలిగిస్తున్నాయి. తన ఫ్రెండ్‌కు సుసాధ్యమైనది తనకు ఎందుకు కావడం లేదనే ఆలోచనలు కలిగిస్తున్నాయి. తోటివారు అనుభవించేది తన వరకూ ఎందుకు రావడం లేదు. దీన్నే పీర్ప్రెషర్ అంటారు. పిల్లల్లో ఆత్మహత్యలకు కారణమయ్యే ప్రధాన అంశాల్లో ఇదొకటి. ఇక ఇంటర్నెట్ ప్రభావం కూడా పిల్లల ఆత్మహత్యలకు ఒక ప్రధాన అంశం. మరెన్నో కారణాలు... పిల్లల్లో ఆత్మహత్మలకు మరెన్నో అంశాలు దోహదపడవచ్చు. వాళ్ల కోరికలూ, ఆలోచనస్థాయి కూడా చిన్నగానే అనిపించవచ్చు. కానీ వాళ్లకు అదే పెద్ద విషయం. స్నేహితుల ముందు చిన్నబోవడం ఇష్టం ఉండదు. అలాగని తాను అనుకున్నదీ నెరవేరడం లేదు. దాంతో కొద్దిపాటి ఒత్తిడికే పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు. తమకు తెలియకుండానే తల్లిదండ్రులు కూడా... తమకు తెలియకుండానే తల్లిదండ్రులూ వారిలో ఒత్తిడి పెంచవచ్చు. బాగా చదివే పిల్లలు క్లాస్‌లో టాపర్‌గా నిలవడం తల్లిదండ్రులకు ఆనందం కలిగిస్తుంది. దాంతో వాళ్లు పిల్లలను చదువుకొమ్మని ప్రోత్సహిస్తుంటారు. తామెప్పుడూ మొదటి స్థానంలోనే ఉండాలనే తపనను తమకు తెలియకుండానే పిల్లల్లో పెంచుకుంటూ పోతారు. ఒక దశ తర్వాత తల్లిదండ్రుల ప్రమేయం లేకపోయినా పిల్లలు ఆ స్థానం కోసం తహతహలాడుతుంటారు. తమ మార్కులు ఒకింత తగ్గినా తట్టుకోలేరు. ఇలాంటివే ఇంకెన్నో కారణాలుంటాయి. సామాజిక తారతమ్యాలూ, స్నేహితుల తల్లిదండ్రుల ఆర్థిక స్థాయి, మిత్రుల కొనుగోలు శక్తి వాళ్లను తీవ్రమైన నిరాశకు గురిచేస్తుంటాయి. తెలిసీ తెలియని వయసులో కలిగే ప్రేమ భావనలూ (ఇన్ఫ్యాక్చుయేషన్స్) వాళ్లను ఆత్మహత్యల దిశగా ప్రేరేపించే అంశాల్లో మరో ముఖ్యమైనది. భావోద్వేగ మేధాశక్తి అవసరం... స్కూల్లో పిల్లల వికాసానికి మంచి వాతావరణం ఉండాలి. పిల్లల్లో కష్టాలను ఎదుర్కొనే శక్తిని పెంచడానికి స్కూల్ వాతావరణం బాగా తోడ్పడుతుంది. కేవలం పాఠాలనే కాదు... తాము ఎన్నో సమస్యలను అధిగమించాల్సి ఉందనే అంశాలను స్కూల్ పరోక్షంగా నేర్పిస్తుంది. ఇలాంటి మంచి శిక్షణ వల్ల పిల్లలకు సాధారణమైన చదువులతో పాటు భావోద్వేగ మేధాశక్తిని సమకూరుస్తుంది. ఈ భావోద్వేగ మేధాశక్తి (ఎమోషనల్ ఇంటెలిజెన్స్) పిల్లల్లో ఎంత పెరిగితే, వాళ్లు ఆత్మహత్యలకు పాల్పడే అవకాశాలు అంతగా తగ్గుతాయి. దీన్నే ఎమోషనల్ కోషియెంట్ (ఈక్యూ) అని కూడా అంటారు. ఇంకొందరికి చనిపోవాలనిపించడం ఒక ఫ్యాంటసీలా ఉంటుంది. ఇది కూడా కారణం కావచ్చు. కొన్ని అలవాట్లూ కారణం కావచ్చు... చిన్నపిల్లల్లో కొన్ని దురలవాట్లు సైతం ఆత్మహత్యలకు కారణం కావచ్చు. మాదకద్రవ్యాలు (డ్రగ్స్) తీసుకోవడం వంటి అంశాలు ఆత్మహత్యలకు ప్రధాన కారణం. డ్రగ్స్‌లో ఉన్నప్పుడు విచక్షణ కోల్పవడం, దుందుడుకు చర్యలకు పాల్పడటం వంటివి ఎక్కువ. సాధారణ పిల్లల్లో కంటే ఈ దురలవాటుకు బానిసలయ్యే వారే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతుంటారడానికి ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి. పైగా ఆత్మహత్య భావనకు బీజం పడేది చిన్నతనంలోనే. కొన్ని మానసిక సమస్యలు సైతం... సాధారణంగా కొన్ని మానసిక సమస్యలు సైతం పిల్లలను ఆత్మహత్యలకు పురిగొల్పవచ్చు. ఉదా: డిప్రెషన్, యాంగ్జైటీ, సైకోసిస్, బైపోలార్ డిజార్డర్, వ్యక్తిత్వ లోపాలు (పర్సనాలిటీ డిజార్డర్స్), ప్రవర్తనారుగ్మతలు (కాండక్ట్ డిజార్డర్స్) వంటి మానసిక సమస్యలున్నవారిలోనూ ఆత్మహత్యలు ఎక్కువ. ఇవీ కొన్ని గుర్తులు... పిల్లల్లో కనిపించే కొన్ని సూచనలను గుర్తిస్తే వాళ్ల ఆత్మహత్యలను నివారించడమూ తేలికవుతుందంటున్నారు మానసిక నిపుణులు. అవి... తరచూ ఏడుస్తూ ఉండటం చిరాకు పడుతూ ఉండటం ఏదో కోల్పోయినట్లుగా ఉండటం ఆత్మన్యూనత భావన బరువు తగ్గడం / పెరగడం ఆకలి తగ్గడం నిద్రతగ్గడం లేక పెరగడం బలహీనంగా అనిపించడం అలసట ఏకాగ్రత లేకపోవడం. కొన్ని డిప్రెషన్ సూచనలు శారీరక లక్షణాలతోనూ వ్యక్తం కావచ్చు... అవి కడుపునొప్పి, తలనొప్పి, తలతిరగడం వంటివి. వీటిని ‘మాస్క్ డిప్రెషన్’ అని కూడా అంటారు. అందుకే తల్లిదండ్రులు వాళ్లు చేసే చిన్నపాటి ఫిర్యాదునూ తేలికగా తీసుకోవద్దు. ప్రతి అంశాన్నీ వాళ్లతో మాట్లాడుతూ, భావాలను పంచుకుంటూ సానుకూలత ప్రదర్శించాలి. పసి మనసులపై చెరగని ముద్ర... పెద్దలు అనే మాటలు పసి మనస్సులపై మరచిపోలేని ముద్రవేస్తాయి. అందుకే వాళ్లను ఏదైనా అనడానికి ముందు పెద్దలు విచక్షణతో ఆలోచించాలి. వాళ్లు ఏదైనా తప్పు చేసినట్లయితే అందుకు చిన్నారులను దూషించకూడదు. వారు చేసిన పని ఎంత చెడ్డదో, ఎలా సరైనది కాదో చెప్పాలి. అంతే తప్ప... ‘నువ్వు చవటవు, చేతకానివాడివి / చెడ్డవాడివి / పనికిరాని వాడివి ’ లాంటి మాటలను వాడకూడదు. పిల్లల ప్రవర్తన సరిగా లేనప్పుడు వారిని మంద లించే సమయంలో వారి దుష్ర్పవర్తన వల్ల ఎంతమందికి ఎంత ఇబ్బంది / నష్టం కలుగుతుందో వివరించాలి. అంతేకాదు... తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన సమయా న్ని ఇవ్వాలి. వాళ్ల స్నేహితులతో కలిగిన ఇబ్బందులు, స్కూల్లో అనుభవాలూ షేర్ చేసుకోవాలి. పిల్లల మానసిక సంఘర్షణను తల్లిదండ్రులు తప్పక పంచుకోవాలి. అవి పంచుకోగల తొలి నేస్తాలు తల్లిదండ్రులేననే భరోసా కలిగించాలి. మన దగ్గరే ఎక్కువ... మన దేశంలో జరుగుతున్న ఆత్మహత్యల విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఆందోళన వ్యక్తం చేసింది. ముఫ్ఫయి ఏళ్లలోపు వాళ్లు ఆత్మహత్యలకు తలపెట్టడం అనేది మన దేశంలోనే ఎక్కువని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఇక వీళ్లలోనూ పదకొండు నుంచి పద్దెనిమిదేళ్ల వారిలో చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. వెల్లూరులోని ఒక సంస్థ నిర్వహించిన అధ్యయనంలో దక్షిణ భారతదేశంలో 11 నుంచి 18 ఏళ్ల పిల్లల ఆత్మహత్యలు ఎక్కువని తేలింది. హృదయం చేసే ఆక్రందనే ఆత్మహత్య... ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడుతున్నారంటే... వాళ్లు సహాయం కోసం అర్ధిస్తున్నారని అర్థం. తమకు సాయం కావాలంటూ పరోక్షంగా అభ్యర్థిస్తున్నారని భావించాలి. తమకు చేయూత ఇవ్వాల్సిందిగా కోరుతున్నారని అనుకోవాలి. అందుకే ఎవరైనా ఆత్మహత్య గురించి ఎక్కువగా ప్రస్తావిస్తుంటే, అందునా వారు పసిపిల్లలు లేదా టీనేజ్ పిల్లలైతే తప్పనిసరిగా వాళ్ల వైపు దృష్టిసారించాలి. ఆ మాటలను చాలా సీరియస్‌గా తీసుకోవాలి. తప్పక క్వాలిటీ సమయాన్ని కేటాయించాలి. ఆ హృదయ ఆక్రందనలు వింటే ఆత్మాహుతులు తగ్గుతాయి. పసిమొగ్గలు వికసిస్తాయి. ఒక ‘చిత్ర’కారణం... ఇండోర్‌కు చెందిన ధర్మేంద్ర కుష్వహా అనే ఆ అబ్బాయికి సల్మాన్ సినిమాలంటే పిచ్చి. అతడి సినిమా విడుదలైన రోజున అక్కడి అనుప్ టాకిస్కు వెళ్లాడు. టిక్కెట్టు దొరకలేదు. తనకు ఇవ్వాల్సిందేనంటూ థియేటర్ మేనేజర్‌తో గొడవకు దిగాడు. టిక్కెట్లు ఇవ్వలేనన్నాడు థియేటర్ మేనేజర్. అంతే ఆ చిన్నారి ప్రాణాలు తీసుకున్నాడు. మరో విషాదాంతం ఆగ్రాకు చెందిన గీత అనే బాలిక తనకు ఇష్టమైన సీరియల్ చూడాలనుకుంది. తనకు టీవీ రిమోట్ ఇవ్వాల్సిందిగా సోదరుడు రాహుల్‌ని కోరింది. అతడు ఇవ్వలేదు. తనకు ఇష్టమైన ఐపీఎల్ మ్యాచ్ వస్తోంది కాబట్టి ఇవ్వనన్నాడు. దాంతో మనస్తాపం చెందిన గీత ఆత్మహత్యకు పాల్పడింది. పది కారణాలు... 1. ఇంటి నుంచి దూరంగా ఉండాల్సి రావడం 2. తల్లిదండ్రుల దగ్గర లేకపోవడం 3. లైంగికంగా/శారీరకంగా హింసకు గురికావడం 4. కుటుంబ కలహాలు 5. తల్లిదండ్రులలో మానసిక సమస్యలు ఉండటం 6. తల్లిదండ్రులు పిల్లల పెంపకంపై తగిన శ్రద్ధ చూపకపోవడం 7. ఒంటరితనం 8. శారీరక సమస్యలు 9. స్నేహితుల మధ్య గొడవలు 10. హింస. అయితే ఈ అంశాలన్నీ అందరి పిల్లలపైనా ఒకేలా ప్రభావం చూపవు. కొందరిలో పై అంశాలను తట్టుకొని మళ్లీ మునపటిలా మారే శక్తి (రెజిలియెన్స్) ఎక్కువ. మరికొందరు ఇలా భరించలేరు. మెదడు స్రావాలూ కారణమే... మెదడులో స్రవించే అత్యంత ప్రధానమైన రసాయనాల్లో సెరిటోనిన్ ఒకటి. మితిమీరి దుడుకుదనం ప్రదర్శించే పిల్లల్లో దీని స్రావాలు తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. విపరీతమైన తొందరపాటు, తమను తాము గాయపరుచుకునే ధోరణి వంటి వారిలో దీని స్రావాలు తక్కువ. ఆత్మహత్యలకు పాల్పడ్డవారిలో ఈ సెరిటోనిన్ స్థాయి చాలా తక్కువగా ఉన్నట్లు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. -
దయాకర్ ఎన్నిక చెల్లదు
హైకోర్టులో సర్వే సత్యనారాయణ పిటిషన్ సాక్షి, హైదరాబాద్: వరంగల్ పార్లమెంట్ స్థానానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పసునూరు దయాకర్ ఎన్నికను సవాలు చేస్తూ ఆయన చేతిలో ఓటమి పాలైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణ హైకోర్టులో ఎన్నికల పిటిషన్ (ఈపీ) దాఖలు చేశారు. దయాకర్ ఎన్నికను చెల్లనిదిగా నిర్ణయించి, వరంగల్ పార్లమెంట్ స్థానానికి తాను ఎన్నికైనట్లు ప్రకటించాలని సర్వే తన పిటిషన్లో కోరారు. ఇందులో దయాకర్‌తో పాటు పోటీ చేసిన అభ్యర్థులు, ఎన్నికల కమిషన్, రిటర్నింగ్ అధికారి తదితరులను ప్రతివాదులుగా చేర్చారు. ఉప ఎన్నిక నామినేషన్ దాఖలు చేసే నాటికి దయాకర్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నారని, ఆ సంస్థతో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ డాక్యుమెంట్లలో దయాకర్, అతని భార్య సంతకాలు చేశారని సర్వే పేర్కొన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్ట నిబంధనల మేరకు ప్రభుత్వంతో కాంట్రాక్టు ఉన్న వారు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులని ఆయన తెలిపారు. నామినేషన్ పత్రాల్లోని ఆస్తుల కాలమ్‌లో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వద్ద రూ.1.49 లక్షలు అడ్వాన్స్‌గా ఉన్నట్లు పేర్కొన్నారని, దీనిని బట్టి బీపీసీఎల్‌తో తను వ్యాపారం చేస్తున్నట్లు దయాకర్ స్వయంగా ఒప్పుకునట్లయిందన్నారు. ఎన్నికల అఫిడవిట్లో కూడా దయాకర్ తప్పుడు సమాచారం ఇచ్చారని, అందులో భార్యను గృహిణిగా పేర్కొన్నారని, వాస్తవానికి ఆమె బీపీసీఎల్ ఒప్పందంలో సంతకం చేశారని, రోహిణి గ్యాస్ ఏజెన్సీకి యజమాని కూడానన్నారు. వాస్తవాలను మరుగునపరిచి దయాకర్ సమర్పించిన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి ఆమోదించారని తెలిపారు. -
ఎంపీగా దయాకర్ ప్రమాణ స్వీకారం
హన్మకొండ : వరంగల్ ఎంపీగా ఘన విజయం సాధించిన పసునూరి దయాకర్ లోక్‌సభ సభ్యుడిగా గురువారం ప్రమాణం చేశారు. శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు ఆయన పార్లమెంట్లో ఎంపీగా తెలుగులో ప్రమాణం చేశారు. దయాకర్ వెంట టీఆర్ఎస్ జెడ్పీ ఫ్లోర్ లీడర్ సకినాల శోభన్‌కుమార్, వర్ధన్నపేట జెడ్పీటీసీ సభ్యుడు పాలకుర్తి సారంగపాణి, జిల్లా నాయకులు గద్దల నర్సింగరావు, గుజ్జ సంపత్‌రెడ్డి తదితరులు ఢిల్లీ వెళ్లారు. వీరు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో పసునూరి దయాకర్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందించారు. కాగా, భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీ తెలంగాణ భవన్‌లోని అంబేద్కర్ విగ్రహానికి దయాకర్‌తో పాటు పలువురు నాయకులు నివాళులర్పించారు. -
దయాకర్..క్లియర్
-
దయాకర్.. క్లియర్
టీఆర్ఎస్ అభ్యర్థిగా పసునూరి ఎంపిక కలిసొచ్చిన విధేయత తెలంగాణ భవన్లో రెండు రోజులుగా చర్చలు హన్మకొండ: వరంగల్ ఎంపీ ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున పసునూరి దయాకర్ ఎన్నికల బరిలో దిగనున్నారు. రెండురోజుల తర్జనభర్జనల అనంతరం దయాకర్ పేరును ఖరారు చేస్తూ శుక్రవారం రాత్రి 8:30 గంటలకు ఆ పార్టీ ప్రకటించింది. మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి పసునూరి దయాకర్ నిబ ద్ధత, విధేయత కలిగిన నాయకుడిగా టీఆర్ ఎస్‌లో పని చేస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపశిల్పిగా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎట్టకేలకు ఖరారు.. వరంగల్ ఉప ఎన్నికలో అధికార పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థి ఎంపిక సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జిల్లా పార్టీ నేతలంతా హైదరాబాద్‌లో సమావేశమై గురు, శుక్రవారాల్లో విస్తృతంగా సంప్రదించారు. ఎన్నికల బరిలో నిలిచే పార్టీ అభ్యర్థి పార్లమెంటు, ఢిల్లీ రాజకీయాల్లో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే సమర్థత కలిగి ఉండాలని కేసీఆర్ నిర్ణయించారు. గురువారం సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ఉద్యమ నేపథ్యం ఉండి, చట్టాలపై అవగాహనతో పాటు ఇంగ్లిష్, హిందీ భాషలలో పట్టున్న వ్యక్తిని ఎన్నికల బరిలో నిలుపుతామని ప్రకటించారు. దీంతో గుడిమళ్ల రవికుమార్ పేరు ఖరారైనట్లు ప్రచారం జరిగింది. అరుుతే రవికుమార్ అభ్యర్థిత్వంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో టీఆర్ఎస్ నాయకత్వం పునరాలోచనలో పడినట్లుగా తెలుస్తోంది. కడియం శ్రీహరి, కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్‌తో పాటు జిల్లాకు చెందిన పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు శుక్రవారం మరోసారి సమావేశమై సుదీర్ఘ చర్చలు జరిపారు. ఆఖరి నిమిషం వరకు రవికుమార్, దయాకర్ మధ్య అభ్యర్థిత్వ ఖరారు అంశం ఊగిసలాడగా చివరకు దయాకర్‌ను ఎంపిక చేశారు. కలిసి వచ్చిన విధేయత.. సంగెం మండలం బొల్లికుంట గ్రామానికి చెందిన దయాకర్‌కు వివాదరహితుడిగా పేరుంది. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఉద్యమంలో పాల్గొన్నారు. జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ నుంచి పట్టభద్రుడయ్యారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపశిల్పిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 2008-11 మధ్య టీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా, 2011 నుంచి 2013 వరకు వర్ధన్నపేట నియోజకర్గ టీఆర్ఎస్ ఇన్చార్జిగా పని చేశారు. 2009, 2014 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కకపోయినా పార్టీ పట్ల విధేయతతో పనిచేశారు. మలిదశ ఉద్యమంలో పని చేస్తున్నప్పుడే అగ్నిమాపకశాఖలో ఉద్యోగం వచ్చినా వదులుకుని తెలంగాణ పోరాటంలో పాల్గొన్నారు. ఇవన్నీ గుర్తించిన కేసీఆర్ ఆయనకు ఉప ఎన్నికల బరిలో అవకాశం కల్పించారు. ప్రతిష్టగా మారిన ఎన్నికలు తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రిగా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే టి.రాజయ్య నియమితులయాయరు. అనూహ్య రాజకీయ పరిణామాల నడుమ ఆయన బర్తరఫ్ కావడంతో వరంగల్ ఎంపీ కడియం శ్రీహరికి ఆ పదవి ద క్కింది. ఫలితంగా వ రంగల్ లోక్‌సభ స్థానానికి ఎన్నికలు అనివార్యమయ్యాయి. టీఆర్ ఎస్‌లో అంతర్గత మార్పులతోనే ఈ ఎన్నిక జరుగుతుండటంతో పార్టీ విజయం తప్పనిసరని భావించిన కేసీఆర్.. అభ్యర్థి ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరించారు. -
కరెంట్ షాక్‌తో ఉపాధి కూలీ మృతి
కొండాపూర్ (మెదక్): కరెంటు షాక్‌తో ఓ ఉపాధి కూలీ మృతి చెందాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా కొండాపూర్ మండలంలో శనివారం జరిగింది. మండలంలోని తొగర్పల్లి గ్రామానికి చెందిన సందగల్ల దయానంద్ (38) ఉపాధి పనిలో భాగంగా విద్యుత్ స్తంభం పక్కన గుంత తవ్వుతుండగా షాక్ తగిలింది. దీంతో తోటి కూలీలు దయానంద్‌ను ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందాడు. కాగా.. మృతుడి కుటుంబ సభ్యులు మృతదేహంతో ఏడీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
పాలకుల వివక్షతో వడ్డెర్లకు భద్రత కరువు
తిరుపతి కల్చరల్: వృత్తినే జీవనాధారంగా చేసుకుని బతుకులు వెళ్లదీస్తున్న వడ్డెర్ల పట్ల పాలకులు చూపుతున్న వివక్షతో భద్రత కోల్పోతున్నారని ఏపీ వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గుంజి దయాకర్ తెలిపారు. ఏపీ వడ్డెర వృత్తిదారుల సంఘం నగర కమిటీ సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో వడ్డెర వృత్తిదార్లు సుమారు 25 లక్షల మంది ఉన్నారన్నారు. ఇందులో 15 లక్షల మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారన్నారు. వృత్తిలో జరిగే ప్రమాదంలో వీరు చనిపోయినా పట్టించుకునే నాథుడే కరువయ్యారని వాపోయారు. వీరి కున్న సంక్షేమ పథకాలు కూడా నామ మాత్రమే అయినప్పటికీ అవి కూడా సక్రమంగా అందడంలేదన్నారు. ప్రభుత్వం వడ్డెర్ల సంక్షేమానికి బడ్జెట్లో వంద కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. గుట్టలపై, క్వారీలపై పూర్తి హక్కు వడ్డెర వృత్తిదారులకు ఇవ్వాలన్నారు. జనాభా ప్రాతిపదికన రాష్ట్ర ఫెడరేషన్‌కు నిధులు కేటాయించాలన్నారు. వృత్తిరీత్యా చనిపోయిన వారికి రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కోరారు. సొసైటీల ద్వారా లేదా వ్యక్తిగత రుణాలు మంజూరు చేసి వడ్డెర్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వడ్డెర వృత్తిదారుల సంఘం నాయకులు మోహన్, రవి, రమణ, వెంకటరమణయ్య, చక్రవేలు, రవికుమార్ తది తరులు పాల్గొన్నారు.