ఎంపీగా దయాకర్ ప్రమాణ స్వీకారం
హన్మకొండ : వరంగల్ ఎంపీగా ఘన విజయం సాధించిన పసునూరి దయాకర్ లోక్‌సభ సభ్యుడిగా గురువారం ప్రమాణం చేశారు. శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు ఆయన పార్లమెంట్‌లో ఎంపీగా తెలుగులో ప్రమాణం చేశారు. దయాకర్ వెంట టీఆర్‌ఎస్ జెడ్పీ ఫ్లోర్ లీడర్ సకినాల శోభన్‌కుమార్, వర్ధన్నపేట జెడ్పీటీసీ సభ్యుడు పాలకుర్తి సారంగపాణి, జిల్లా నాయకులు గద్దల నర్సింగరావు, గుజ్జ సంపత్‌రెడ్డి తదితరులు ఢిల్లీ వెళ్లారు.
వీరు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో పసునూరి దయాకర్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందించారు. కాగా, భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీ తెలంగాణ భవన్‌లోని అంబేద్కర్ విగ్రహానికి దయాకర్‌తో పాటు పలువురు నాయకులు నివాళులర్పించారు.