02: 35 PM
►మధ్యాహ్నం 2.30 గంటలకు తిరిగి ప్రారంభమైన లోక్‌సభ
11: 25 AM
► ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు ప్రమాద స్థలం నుంచి బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం దాన్ని డీకోడ్ కోసం ఢిల్లీ లేదా బెంగళూరు తరలించే అవకాశం ఉంది.
11: 20 AM
► లోక్‌సభలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. బిపిన్ రావత్ దంపతులు, బృందంతో కూడిన హెలికాప్టర్ బుధవారం ఉదయం 11.35 నిమిషాలకు సులూరు నుంచి వెల్లింగ్టన్ బయలుదేరిందన్నారు. మధ్యాహ్నం 12.08 గంటలకు రాడార్ నుంచి సంకేతాలు నిలిచిపోయాయని తెలిపారు.
► ఈ క్రమంలో 12.20 నిమిషాలకు ప్రమాదం జరిగిందనన్నారు.పేలుడు సంభవించినప్పుడు హెలికాప్టర్‌లో 14 మంది ఉన్నారని.. వీరిలో 13 మంది మృతి చెందారని తెలిపారు. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వారికి పార్లమెంట్ సభ్యులు సంతాపం తెలిపారు. అమరుల భౌతిక కాయాలు సాయంత్రానికి ఢిల్లీ చేరతాయని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరుగుతుందని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.
11: 05 AM
► తమిళనాడులో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ దంపతులతో పాటు.. మొత్తం 13 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై గురువారం లోక్‌సభలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రమాదం జరిగిన ఘటనపై పూర్తి వివరాలు వెల్లడిస్తున్నారు.
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా గురువారం సభ ప్రారంభమయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment