Rajnath Singhs
-
హెలికాప్టర్ ఘటనలో మృతి చెందిన వారికి పార్లమెంట్లో సంతాపం
02: 35 PM ►మధ్యాహ్నం 2.30 గంటలకు తిరిగి ప్రారంభమైన లోక్‌సభ 11: 25 AM ► ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు ప్రమాద స్థలం నుంచి బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం దాన్ని డీకోడ్ కోసం ఢిల్లీ లేదా బెంగళూరు తరలించే అవకాశం ఉంది. 11: 20 AM ► లోక్‌సభలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. బిపిన్ రావత్ దంపతులు, బృందంతో కూడిన హెలికాప్టర్ బుధవారం ఉదయం 11.35 నిమిషాలకు సులూరు నుంచి వెల్లింగ్టన్ బయలుదేరిందన్నారు. మధ్యాహ్నం 12.08 గంటలకు రాడార్ నుంచి సంకేతాలు నిలిచిపోయాయని తెలిపారు. ► ఈ క్రమంలో 12.20 నిమిషాలకు ప్రమాదం జరిగిందనన్నారు.పేలుడు సంభవించినప్పుడు హెలికాప్టర్లో 14 మంది ఉన్నారని.. వీరిలో 13 మంది మృతి చెందారని తెలిపారు. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వారికి పార్లమెంట్ సభ్యులు సంతాపం తెలిపారు. అమరుల భౌతిక కాయాలు సాయంత్రానికి ఢిల్లీ చేరతాయని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరుగుతుందని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. 11: 05 AM ► తమిళనాడులో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ దంపతులతో పాటు.. మొత్తం 13 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై గురువారం లోక్‌సభలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రమాదం జరిగిన ఘటనపై పూర్తి వివరాలు వెల్లడిస్తున్నారు. న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా గురువారం సభ ప్రారంభమయ్యింది. -
31 నుంచి బడ్జెట్ సమావేశాలు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు 2019, జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకూ జరగనున్నాయి. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన బుధవారం నాడిక్కడ సమావేశమైన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశాల్లో భాగంగా ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈసారి పార్లమెంటు సమావేశాల సందర్భంగా సభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు సహా పలు కీలక అంశాలను కేబినెట్ కమిటీ చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. లోక్‌సభ మంళవారం ఆమోదించిన పౌరసత్వ బిల్లు–2019ను బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాజ్యసభ ముందుకు తీసుకొచ్చే అవకాశముందని వెల్లడించాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ నెల 31న ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం మధ్యంతర బడ్జెట్‌పై 2–3 రోజుల పాటు పార్లమెంటులో చర్చ సాగనుంది. అయితే కొన్ని కారణాల రీత్యా ఈసారి ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టడం లేదు. కాగా, ఆర్డినెన్సుల జారీకి అనుకూలంగా రాష్ట్రపతి పార్లమెంటును స్వల్పకాలం మాత్రమే ప్రోరోగ్ చేసే అవకాశముందని తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుతం పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆమోదం పొందని ట్రిపుల్ తలాక్, మెడికల్ కౌన్సిల్, కంపెనీ వ్యవహారాల ఆర్డినెన్సులను మరోసారి జారీచేస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
సర్జికల్స్ స్టైక్స్ రెండోసారి జరిగాయా?
-
ప్రధాని మోదీతో గవర్నర్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 1.30 వరకు వీరి భేటీ కొనసాగింది. గవర్నర్ల సమావేశంలో పాల్గొనేందుకు ఐదు రోజుల క్రితం ఢిల్లీ వచ్చిన నరసింహన్ 2వ తేదీన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమయ్యారు. సోమ, మంగళవారాల్లో జరిగిన గవర్నర్ల సమావేశంలో నరసింహన్ పాల్గొన్నారు. బుధవారం ప్రధాని మోదీ అరగంటపాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల్లోని తాజా పరిస్థితులను ప్రధానికి గవర్నర్ వివరించినట్టు సమాచారం. సాయంత్రం 5.30 గంటలకు నరసింహన్ హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. -
ఇండో-చైనా సరిహద్దులో రాజ్‌నాథ్ పర్యటన
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ వారంలో ఉత్తరాఖండ్‌లోని ఇండో-చైనా సరిహద్దులో పర్యటిస్తారని ఆర్మీ అధికార వర్గాలు ఆదివారం ప్రకటించాయి. ఈ మధ్యకాలంలో చైనా బలాగాలు సరిహద్దును అతిక్రమించి భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చిన నేపథ్యంలో రాజ్‌నాథ్ పర్యటనకు ప్రాముఖ్యత ఏర్పడింది. భారతీయ బలగాలు సమర్థవంతంగా ఎదుర్కోవడంతో.. చైనా బలగాలు వెనక్కు మళ్లిన సంగతి తెలిసిందే. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ పర్యటనలో ఇండో టిబెటన్ సరిహద్దు బలగాలతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నట్లు తెలుస్తోంది. డోక్లామ్ వివాదం ముగిసిన తరువాత కేంద్ర అత్యున్నత మంత్రి ఈ ప్రాంతంలో పర్యటించడం ఇదే తొలిసారి. భూమి 12,500 అడుగుల ఎత్తులో ఉన్న రిమ్‌కిమ్, 10,500 అడుగుల ఎత్తులో ఉన్న మనా, 10,200 అడుగుల ఎత్తులో ఉన్న ఆర్మీ పోస్టులను రాజ్‌నాథ్ ఈ నెల 28న సందర్శిస్తారని ఆర్మీ వర్గాలు ప్రకటించాయి. జూలై 25న చైనా బలగాలు ఉత్తరాఖండ్‌లోని ఛమోలి జిల్లాలోని సరిహద్దు ప్రాంతమైన బార్హోతిలోకి 800 అడుగుల మేర చొచ్చుకుని వచ్చి.. కొన్ని గంటలు ఉండి.. తిరిగి వెనక్కు వెళ్లాయి. ఈ పర్యటనలోనే కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముస్సోరిలోని లాల్‌బహుదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ అఫ్ అడ్మినిస్ట్రేషన్‌లోని శిక్షణ కొందుతున్న యువ ఐఏఎస్, ఐపీఎస్‌లను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే చైనా సరిహద్దులో నిర్మిస్తున్న రహదారి పనులను రాజ్‌నాథ్ పర్యవేక్షిస్తారు. -
యూపీలో హోంమంత్రి బంధువు హత్య
లక్నో: కేంద్రం హోం మంత్రి రాజ్‌నాధ్ సింగ్ బంధువును ముగ్గురు దుండగులు కాల్చిచంపిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపింది. బైక్‌పై వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ బంక్ యజమాని అయిన అరవింద్ సింగ్‌ను అతి సమీపంనుండి మెడపై కాల్చి చంపారు. సమీప పొలాల్లో పనిచేసుకుంటున్న మహిళ ఈ సంఘటనపై గ్రామస్తులకు సమాచారం అందించారు. భార్యను ఎయిర్‌పోర్ట్‌లో దించి ఇంటికి తిరిగి వస్తుండగా ముగ్గురు దుండగులు అరవింద్ సింగ్‌ను అటకాయించిన దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారని సమాచారం. దుండగుల్లో ఒకడు అరవింద్ ప్రయాణిస్తున్న కారులోకి చొరబడి కొద్ది నిమిషాలు అతనితో మాటలు కలిపి ఆ తరువాత అతిసమీపం నుండి కాల్చినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అనంతరం సంఘటనా స్థలం నుంచి వారు పారిపోయారని చెప్పారు. కాగా ఈ ఘటనలో ఇంతవరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని ఖాళీ తూటాను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ ఎకే పాండే (రూరల్) తెలిపారు. రాష్ట్రంలో పాలన కొరవడిందని, ప్రతీరోజు జనం చచ్చిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఉత్తర ప్రదేశ్ బీజేపీ నాయకులు మండిపడుతున్నారు.