సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో యువకుడు గుండెపోటుకు బలయ్యాడు. మేడ్చల్ సీఎంఆర్ కాలేజీలో ఈ విషాద ఘటన జరిగింది. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విశాల్ అనే విద్యార్థి గుండెపోటుతో కాలేజీ ఆవరణలోనే కుప్పకూలాడు. కారిడార్‌లో నడుస్తూ ఛాతీలో నొప్పితో సడన్‌గా కిందపడిపోయాడు.
తోటి విద్యార్థులు అతడ్ని సీఎంఆర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విశాల్‌ది రాజస్థాన్ అని తెలుస్తోంది.
కాగా.. ఇటీవల యువకుల్లో గుండెపోటు ఘటనలు బాగా పెరిగిపోయాయి. కొద్దిరోజుల క్రితమే యువ కానిస్టేబుల్ జిమ్‌లో కసరత్తులు చేస్తూ గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. మరో ఘటనలో స్నేహితుడి పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ యువకుడు సడన్‌గా కుప్పకూలి ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే..
గుండె.. ఉండేది మనిషి గుప్పెడంత. కానీ, నిలువెత్తు మనిషి ప్రాణం దాని మీదే ఆధారపడి ఉంటుంది. అయితే మారుతున్న లైఫ్‌స్టైల్.. ఆహారపు అలవాట్లు మనిషిని నిలబెట్టే ఆ బలాన్ని.. బలహీనపరుస్తోంది. అందుకే గుండె సమస్యలతోపాటు కార్డియాక్ అరెస్ట్ సమస్యలతో.. వయసుతో సంబంధం లేకుండా ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు. అప్పటికప్పుడే ప్రాణం విడుస్తున్నారు.
చదవండి: దోస్తు పెళ్లి బరాత్‌లో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడు.. 19 ఏళ్లకే గుండెపోటుతో..
Comments
Please login to add a commentAdd a comment