ఘట్‌కేసర్ (రంగారెడ్డి) : అనారోగ్యంతో ఓ విద్యార్థి బలవన్మరణం చెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. జిల్లాలోని ఘట్‌కేసర్ మండల కేంద్రంలోని బాలాజీ నగర్‌లో నివాసముండే కందుకూరి ఉపేంద్ర సంస్కృతి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. అయితే శుక్రవారం అనారోగ్యంగా ఉందంటూ కాలేజీకి వెళ్లలేదు. రూమ్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిది ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంగా పోలీసులు నిర్ధారించారు.