
ప్రతీకాత్మక చిత్రం
ఘట్‌కేసర్: ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాంకు చెందిన టింకు శర్మ(24) ఘనాపూర్‌లోని పవర్‌గ్రిడ్‌లో వాటర్ బాయ్‌గా ఆరేళ్ల నుంచి పని చేస్తూ స్నేహితులతో కలిసి గ్రామంలో ఉంటున్నాడు. ఆర్థిక సమస్యలు వెంటాడటంతో జీవితంపై విరక్తి చెంది తానుండే గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అనంతరం గదికి వచ్చిన స్నేహితులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment