Economical problems
-
భవిష్యత్తు బాగుండాలంటే..?
‘ఈ రోజు గడిస్తే చాలు.. రేపటి సంగతి రేపు చూసుకుందాం..?’ ఇలా అనుకుంటే అది భద్రతకు హామీనివ్వదు. రేపటి కోసం కొంత పొదుపు చేసుకుంటేనే భవిష్యత్తులోనూ నిశ్చితంగా ఉంటామని అర్థం చేసుకునే వారు కొందరే. కష్టపడి తెచ్చిందంతా ఖర్చు పెడుతూ.. రెక్కాడితే కానీ డొక్కాడని స్థితిలో ఉండడం కుటుంబానికి ఏ మాత్రం భరోసానీయదు. చాలా మంది పొదుపును వాయిదా వేసుకుంటూ వెళతారు. ఆర్థిక ఇబ్బంది, అత్యవసర పరిస్థితి రానంత వరకు ఇదంతా సాఫీగానే అనిపిస్తుంది. కరోనా రాక ముందు వరకు చాలా మంది ఆరోగ్య బీమాను, అత్యవసర నిధిని నిర్లక్ష్యం చేసిన వారే. ఈ తరహా వ్యక్తుల్లో కొంత మందికి కనువిప్పు కలిగింది. ‘ఎవరో వస్తారు.. ఏదో చేస్తారు’ అని కాకుండా.. ఎవరి భవిష్యత్తు కోసం వారే రక్షణాత్మకంగా వ్యవహరించాలి. భవిష్యత్తు కోసం ఎందుకు పొదుపు, మదుపులు అవసరమో అవగాహన కల్పించే ప్రాఫిట్ ప్లస్ కథనమే ఇది. జీవితం అంటే ఎప్పుడూ ఒకే తీరున, సాఫీగా సాగిపోదు. కొన్ని ఇబ్బందులు సర్వ సాధారణం. ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోవచ్చు. కరోనా నియంత్రణకు 2020 మార్చి చివరి నుంచి నెలరోజులకుపైగా లాక్డౌన్లను విధించడం తెలిసిందే. ఆ సమయంలో ఎంతో మంది ఉద్యోగాలు, ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఆస్పత్రి పాలు కావచ్చు. భవిష్యత్తులో ఏ రోజు ఎలా ఉంటుందన్నది మన చేతుల్లో లేని అంశం. కాకపోతే ఏది వచ్చినా ఎదుర్కోగల సన్నద్ధతే మన చేతుల్లో ఉంటుంది. తగినంత పొదుపు ఉంటే, పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవచ్చు. ఆ సమయంలో ఇతరుల నుంచి ఆర్థిక సాయం కోసం అర్థించాల్సిన అవస్థ తప్పుతుంది. అందుకే పొదుపు, మదుపులను వాయిదా వేయవద్దు. ఆదాయం ఆగిపోతుంది.. సంపాదన బండి ఏదో ఒకరోజు (రిటైర్మెంట్) ఆగిపోతుందని తెలిసిందే. కానీ, సంపాదన ఆగిపోయిన తర్వాతి రోజు నుంచి జీవితం ఎలా? ఈ విషయాన్ని తెలిసినా కానీ, చాలా మంది దాటవేస్తుంటారు. ఎప్పుడో 60 ఏళ్ల తర్వాత కదా, చూసుకోవచ్చులే.. అనుకుంటూ రిటైర్మెంట్ ప్రణాళికను ఎక్కువ మంది వాయిదా వేస్తుంటారు. కానీ, ముందు నుంచే పొదుపు చేస్తే కాంపౌండింగ్‌తో తక్కువ మొత్తం అయినా పెద్ద నిధిగా సమకూరుతుంది. అదే 40–45 తర్వాత మొదలు పెడితే, ఉన్న కొద్ది కాలంలో ఎంత వెనుకేయగలరు?.. 60 ఏళ్ల తర్వాతి జీవించి ఉన్నంత కాలం అవసరాలను ఆ మొత్తం తీర్చగలదా? అని ఆలోచించాలి. ప్రశాంతత కోసం.. భద్రత, ప్రశాంతత ఈ రెండింటికీ అవినాభావ సంబంధం ఉంది. ఏ కష్టం వచ్చినా ఎదుర్కొనేంత నిధి దగ్గర ఉంటే.. ప్రశాంతంగా, నిశ్చింతగా ఉండొచ్చు. ఆఫీసులో కొంత మంది ఉద్యోగులను తీసేస్తున్నారన్న వార్త మీ చెవిన పడితే, ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే, పిల్లల స్కూల్ ఫీజులు పెరిగాయని తెలిస్తే.? ఇవన్నీ చిన్నవే అయినా ఎంతో కొంత ఆందోళనకు గురి చేసేవే. దేనిని అయినా టేక్ ఇట్ ఈజీ పాలసీగా ఎప్పుడు తీసుకుంటాం? తగినంత ఆర్థిక స్తోమత ఉన్నప్పుడే కదా! బ్యాంకులో బ్యాలన్స్ లేకుండా, సాగిపోయే వారికి ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోతే ? కష్టకాలం మొదలవుతుంది. కావాల్సినంత పొదుపు చేయలేని వారిపై అంతర్లీనంగా ఒత్తిడి ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. కనుక పొదుపు, మదుపు అవసరాన్ని గుర్తించాలి. అపరాధ భావం ఎందుకు? చాలా మంది ముందుచూపు, ప్రణాళికలేమితో పొదుపును నిర్లక్ష్యం చేస్తుంటారు. అవగాహన ఉన్నా కానీ, పొదుపు చేయలేని వారు కూడా ఉంటారు. ఈ తరహా వ్యక్తులు అవసరానికి సరిపడా ఖర్చు చేసేందుకు కూడా వెనుకాడుతుంటారు. కానీ, దీని వెనుక కారణం.. వారు పిసినారులని కాదు. తగినంత సంపద లేకపోవడమే. దీంతో వెళ్లిన ప్రతి చోటా పాకెట్ నుంచి ఖర్చు చేసేందుకు ధైర్యం చాలదు. కానీ, ఇది వారిపై, వారి జీవిత భాగస్వామి, పిల్లలపై ప్రభావం చూపిస్తుందని గుర్తించాలి. చక్కని ఆర్థిక జీవనం అంటే.. తగినంత పొదుపు చేయడమే కాదు.. అవసరానికి సరిపడా, వివేకంగా ఖర్చు చేయడం కూడా. కనుక పొదుపును నిర్లక్ష్యం చేయకూడదు. ఖర్చును పూర్తిగా బంధించేయకూడదు. వారసత్వం విషయంలో... తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా ఆస్తులు అందరికీ లభిస్తాయన్న గ్యారంటీ ఉండదు. తమ పిల్లలకు భూమి/ఇల్లు రూపంలో ఆస్తిని ఇవ్వాలని కొందరు తల్లిదండ్రులు భావిస్తారు. తల్లిదండ్రుల నుంచి చెప్పుకోతగ్గ ఆస్తులు లభిస్తే.. వాటిని మెరుగ్గా నిర్వహించే ప్రణాళిక ఉండాలి. వారసత్వ ఆస్తుల్లేని వారు, తమ పిల్లలకు ఆస్తులను సమకూర్చిపెట్టాలని భావిస్తే.. ఇది అదనపు ప్రణాళిక అవుతుంది. ఇందుకోసం పెద్ద మొత్తమే ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఆస్తుల విషయంలోనూ ప్రణాళికాయుతంగా నడుచుకోవాలి. పెద్ద లక్ష్యాలు జీవితంలో ఎన్నో కీలకమైన లక్ష్యాలు ఎదురవుతాయి. వీటిల్లో కొన్ని తప్పించుకునేవి కావు. పిల్లల విద్యా ఖర్చు, వివాహాలు, ఇల్లు కొనుగోలు చేయడం, రిటైర్మెంట్, పర్యటనలు ఇలా ఎన్నో ఉంటాయి. భవిష్యత్తు కోసం తగినంత కూడబెట్టలేకపోతే, రుణాలపై ఆధారపడితే చివరికి పరిష్కారం ఎవరు చూపిస్తారు? అందుకని జీవితాన్ని చేయి దాటిపోనీయకుండా, భవిష్యత్తు పట్ల ముందు చూపుతో పొదుపు చేసుకుంటూ వెళ్లాలి. ఆర్థిక స్వేచ్ఛ వేతనంపై ఇక ఆధారపడని రోజు ఒకటి జీవితంలో వస్తుంది. అప్పటికి కనీస అవసరాలకు సరిపడా ఆదాయాన్ని తెచ్చిపెట్టేంత నిధిని సమకూర్చుకోవాలి. దీన్నే ఆర్థిక స్వాతంత్య్రంగా చెబుతారు. మీ అవసరాలకు వేరేవారిపై ఆధారపడకపోవడం. ఆర్జన ఆరంభించిన తొలినాళ్లలో ఎక్కువ మంది వద్ద ఎటువంటి నిధి (వారసత్వంగా ఉంటే తప్ప) ఉండదు. కనుక 100 శాతం వేతనంపైనే జీవనం ఆధారపడి ఉంటుంది. అయితే, కాలక్రమేణా బుట్టలోకి సంపద చేరాలి. అప్పుడే అవసరానికి కావాల్సినంత తీసుకోగలరు. ఒక వ్యక్తికి కుటుంబ ఖర్చులు నెలవారీగా రూ.40,000 అవుతున్నాయని అనుకుంటే.. 12 నెలలకు సరిపడా రూ.4.8 లక్షలు కనీసం అతని వద్ద ఉండాలి. రూ.48 లక్షలు ఉంటే 8–10 ఏళ్ల అవసరాలను తీర్చుకోవచ్చు. అందుకని జీవితంలో కోరుకున్న దశ నుంచి కనీస అవసరాలను తీర్చుకునేందుకు సరిపడా నిధి ఏర్పడాలి. అందుకోసం ఆర్జన మొదలైన వెంటనే పొదుపు, మదుపు ప్రయాణాన్ని ఆరంభించాలి. దాంతో చాలా వేగంగా (50 ఏళ్లకే) ఆర్థిక స్వాతంత్య్ర స్థితిని చేరుకుంటారు. పురోగతి జీవితానికి పురోగతి కీలకమైనది. ఉద్యోగం ఆరంభంలో బ్యాంకు బ్యాలన్స్ జీరోగా ఉన్నా.. 5–10 ఏళ్ల సర్వీసు తర్వాత తగినంత కనిపించాలి. అది పురోగతికి చిహ్నంలా మరింత ప్రేరణనిస్తుంది. ఉత్సాహంతో పనిచేసేందుకు సరిపడా బూస్ట్‌నిస్తుంది. పదేళ్ల కెరీర్ తర్వాత కూడా బ్యాంకు ఖాతా వెక్కిరిస్తోందంటే.. అది పురోగతికి చిహ్నం కాబోదు. నికర విలువ పెరగడం లేదంటే ‘ధనిక బానిస’ అనే అనుకోవాల్సి వస్తుంది. ‘ఎంత చెట్టుకు అంత గాలి’ అన్నట్టు ఉన్నంతలో ఎంతో కొంత ఆదా చేసుకోవడమే ఆచరణ కావాలి. ప్రతి నెలా రూ.5,000 సిప్ ఆరంభించి 30 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేస్తే, 12 శాతం రాబడి రేటు ప్రకారం రూ.1.76 కోట్లు సమకూరుతుంది. 30 ఏళ్లలో మీరు చేసిన పెట్టుబడి రూ.18 లక్షలే. కానీ, వచ్చిన రాబడి రూ.1.58 కోట్లు. మెరుగైన మార్గం.. చేస్తున్న ఉద్యోగంలో సంతోషంగా లేకపోవచ్చు. ఏదైనా కొత్తగా చేయాలన్న ఆలోచనతో ఉండొచ్చు. వెనుక కావాల్సినంత నిధితో బ్యాకప్ ప్రణాళిక లేకపోతే ఆలోచన వచ్చినా ఏమీ చేయలేని పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావచ్చు. మెరుగైన ఆదాయం, జీవనం కోసం ఉద్యోగం మారాలనుకుంటే కనీసం 2–3 ఏళ్లపాటు ఖాళీగా ఉండాల్సి వచ్చినా.. జీవనానికి ఇబ్బంది ఎదురుకాకూడదు. మీ వద్ద నిధి ఉంటే, ధైర్యంగా ముందుకు సాగిపోతారు. కనుక విజయంలోనూ ‘వెల్త్’ పాత్ర ఉంటుంది. రుణ ఊబిలోకి వెళ్లొద్దు.. రుణం తీసుకోవడం ఒక్కసారి మొదలు పెడితే.. ఆ తర్వాత దాన్ని స్టాప్ చేయడం కష్టమే. ముందు ఇది చిన్నగానే మొదలు కావచ్చు. కొన్నేళ్లకు నియంత్రించలేనంత స్థాయికి చేరిపోతుంది. చివరికి బయట పడలేనంత ఊబిగా మారే ప్రమాదం లేకపోలేదు. అందుకనే క్రెడిట్ కార్డు అయినా, వ్యక్తిగత రుణం తీసుకుంటున్నా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాలి. రుణం తీసుకుంటున్నారంటే.. తగినంత పొదుపు లేకపోవడం వల్లే. పొదుపు లేకుండా రుణం బాటపడితే.. తిరిగి అప్పుల భారం నుంచి బయటకు వచ్చి, పొదుపు చేసుకోవడానికి ఎంతో కష్టపడాల్సి రావచ్చు. కొందరికి అది అసాధ్యం కావచ్చు. కనుక డెట్‌కు దూరంగా ఉండాలి. ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. అనుసరించాల్సిన ప్రణాళిక ► మెరుగైన జీవనం కోసమే ప్రణాళికాయుత ఆర్థిక జీవనం. ఇందులో ముందుగా తన కుటుంబ రక్షణ కోసం సరిపడా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలి. ► 12 నెలల అవసరాలకు సరిపడా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ఈ నిధిని అల్ట్రా షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుకుని ఉంచుకోవాలి. అవసరమైన వెంటనే తీసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ► ప్రతీ నెలా ఇంటికి తీసుకెళ్లే వేతనం (సంపాదన) నుంచి 20–40 శాతాన్ని ఈక్విటీల్లోకి మళ్లించాలి. మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ► పెట్టుబడుల్లో అస్థిరతలు తగ్గించేందుకు వీలుగా కొంత డెట్‌లోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అప్పటికే ఈపీఎఫ్ రూపంలో చేస్తున్న డెట్ భాగాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. ► ఎండోమెంట్, మనీబ్యాక్ ఇన్సూరెన్స్ పాలసీలకు దూరంగా ఉండాలి. బీమాను, పెట్టుబడిని కలపొద్దు. -
‘నా చావుకి ఎవరూ బాధ్యులు కారు’
సాక్షి, హైదరాబాద్: రోజురోజుకి పని వత్తిడి పెరగడం.. మరోవైపు చేసిన అప్పు ఎలా కట్టాలని మనస్థాపంతో ఇంట్లో ఉరివేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ భిక్షపతిరావు తెలిపిన వివరాల ప్రకారం... బాలాజీనగర్ పాతబస్తీలో నివాసం ఉంటున్న బొల్లి అశ్వినికి బొల్లి వెంకటేష్ (31)తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. వెంకటేష్ హిమాయత్‌నగర్‌లో ఉన్న కర్ణాటక బయోటిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో పని చేస్తున్నాడు. అశ్విని స్ధానికంగా ఓ టైలరింగ్ దుకాణంలో పని చేస్తోంది. గురువారం భర్త వెంకటేష్ ఇంట్లో ఉన్న సమయంలోనే అశ్విని పనికి వెళ్లింది. తిరిగి సాయంత్రం 4.30 గంటలకు కుమారుడిని పాఠశాల నుంచి ఇంటికి తీసుకుని వచ్చింది. ఇంటి తలుపులు కొట్టినప్పటికి వెంకటేష్ తీయకపోవడంతో కిటికీ నుంచి చూడగా వంటగదిలో ఉన్న ఫ్యాన్‌రాడ్‌కు ఉరివేసుకుని కనిపించాడు. చుట్టు పక్కలవారి సహాయంతో తలుపులు తెరిచి వెంటనే సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వెంకటేష్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వెంటనే అశ్విని పోలీసులకు సమాచారం అందించింది. ‘ఆర్థిక ఇబ్బందులతోనే చనిపోతున్నా... నా చావుకు ఎవరూ బాధ్యులు కారు’ అంటూ వెంకటేష్ సూసైడ్‌నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
‘జీవితంపై విరక్తి.. అందుకే ఈ నిర్ణయం’
ఘట్కేసర్: ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాంకు చెందిన టింకు శర్మ(24) ఘనాపూర్‌లోని పవర్‌గ్రిడ్‌లో వాటర్ బాయ్‌గా ఆరేళ్ల నుంచి పని చేస్తూ స్నేహితులతో కలిసి గ్రామంలో ఉంటున్నాడు. ఆర్థిక సమస్యలు వెంటాడటంతో జీవితంపై విరక్తి చెంది తానుండే గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతరం గదికి వచ్చిన స్నేహితులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
Lockdown Impact: ‘చిరు’ నవ్వులు దూరం
భూపాలపల్లి: కరోనా మహమ్మారి వేల కుటుంబాల్లో చిచ్చు పెడుతోంది. అయిన వారిని కోల్పోయి వేలాది మంది దుఖః అనుభవిస్తున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు చిరు వ్యాపారులు, అసంఘటిత రంగ కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారు. లాక్డౌన్ కారణంగా పూట గడవక పనుల కోసం ఎదురుచూస్తున్నారు. వైరస్ ప్రబలడమేమో కానీ కూలీ దొరికి ఇంటికి నిత్యావసర సరుకులు తీసుకెళ్తే బాగుండు అని భావిస్తున్నారు. ఉపాధి లేక వేలాది మంది.. రాష్ట్రంలో కరోనా సెకండ్‌వేవ్ విజృంభించి పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 12వ తేదీ నుంచి లాక్డౌన్ విధించింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే అన్ని వ్యాపార సంస్థలు తెరవాలని, మిగతా సమయాల్లో కచ్చితంగా లాక్డౌన్ పాటించాలని ప్రకటించింది. దీంతో వ్యాపారాలు, ప్రజా రవాణా, వివిధ రంగాల్లో పనులు జరుగక అసంఘటిత రంగంలోని 27 విభాగాల్లో పని చేస్తున్న సుమారు 20 వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. వీరంతా గత 12 రోజులుగా పనులు లేక పస్తులుండాలి్సన పరిస్థితి నెలకొంది. కుటుంబాన్ని వెళ్లదీసేందు కు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. చేసేది లేక అప్పులు తీసుకొని వచ్చి నిత్యావసర సరుకులు, కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. చిరు వ్యాపారుల పరిస్థితి దయనీయం.. రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ చిరు వ్యాపారులపైనే తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆటో, ట్రాలీ డ్రైవర్లు లాక్డౌన్ సడలింపు సమయంలో అడ్డాల వద్ద గిరాకీ కోసం ఎదురు చూస్తున్నప్పటికీ ఫలితం లభించడం లేదు. రెక్కాడితే గానీ డొక్కాడని హమాలీ, రిక్షా కార్మికుల పరిస్థితి అయితే మరీ దయనీయంగా మారింది. పొట్టకూటి కోసం రహదారికి ఇరువైపులా చిరు వ్యాపారం సాగించే కూరగాయలు, పండ్లు, సోడా, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, గప్‌చుప్, మిర్చిబండ్ల వ్యాపారుల పరిస్థితి దయనీయంగా మారింది. వీరంతా ఇంటికే పరిమితమై వైరస్ ప్రభావం ఎప్పుడు తగ్గుతుందా.. లాక్డౌన్ ఎప్పుడు ముగుస్తుందా అని ఆలోచిస్తున్నారు. లాక్డౌన్ ముగిసే వరకు రాష్ట్ర ప్రభుత్వం తమకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. పూట ఎల్లుడు ఇబ్బంది ఐతాంది.. లాక్డౌన్ పెట్టినంక పుటకు ఎల్లుడు ఇబ్బంది ఐతాంది. ఇదివరకు రోజంతా రిక్షా తొక్కితే రూ. 400 నుంచి రూ. 500 వచ్చేవి. ఇప్పుడు రిక్షా అడిగినొళ్లే లేరు. అడ్డా మీద రోజుకు నాలుగు రిక్షాలు బయటకు వెళ్తలేవు. రోజుకు ఒక గిరాకీ వస్తే వస్తాంది.. లేదంటే లేనే లేదు. రోజుకు వంద కూడా సంపాదించకపోతే ఇల్లు ఎట్ల గడుస్తది. చాన ఇబ్బంది పడుతానం. - మొలుగూరి సారయ్య, రిక్షా కార్మికుడు ఇంటికాడనే ఉంటాన.. లాక్డౌన్ల పొద్దున 6 గంటల నుంచి 10 గంటల వరకే దుకాండ్లు తియ్యాలె అంటుండ్రు. మధ్యాహ్నం అయితేనే సోడాలకు గిరాకీ ఉంటది. పొద్దుపొద్దున సోడా తాగెటోళ్లు ఎవ్వరు ఉండరు. పొయిన ఎండాకాలం మొత్తం లాక్‌డౌనే ఉన్నది. ఇప్పుడు కూడా గట్లనే అయింది. ఇంటి కర్చులైతే ఆగవు కదా. పని లేక, పైసలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం మాలాంటి వాళ్లను ఆదుకోవాలె. - మార్కండేయ, సోడాబండి వ్యాపారి ప్రభుత్వం సాయం అందించాలి కరోనా లాక్‌డౌన్‌తో ప్రజలు ఎవరూ బయటకు వస్తలేరు. ఆర్టీసీ బస్సులే నడుస్త లేవు. ఇగ మా ఆటోలు నడుస్తయా. ఉదయం 6 గంటలకు ఆటోను అడ్డా మీద ఉంచితే ఒక్కరు కూడా కిరాయి అడుగుతలేరు. రోజుకు రూ. వంద గిరాకీ కూడా అయితలేదు. చూసి చూసి 9 గంటలకు ఇంటికి వెళ్తున్నాం. ఆటో ఫైనాన్స్‌కు కిస్తీ తప్పకుండా కట్టాలి్సందే. ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలి. - యార రామకృష్ణ, ఆటో డ్రైవర్ -
పెట్టుబడులు, టెండర్లు ఆపేయండి
న్యూఢిల్లీ: ముందస్తు కొనుగోళ్ల ఆర్డర్లు, ఇప్పటికే ఖరారైన టెండర్లను తదుపరి ఉత్తర్వులిచ్చేదాకా నిలిపివేయాలంటూ ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ను టెలికం శాఖ (డాట్) ఆదేశించింది. దీంతో పెట్టుబడి వ్యయాలకు సంబంధించి కొత్త టెండర్లు ప్రకటించాలంటే ముందుగా ఢిల్లీలోని కార్పొరేట్ ఆఫీసర్ అనుమతులు తీసుకోవాలంటూ అన్ని సర్కిల్స్ హెడ్స్‌కు బీఎస్ఎన్ఎల్ ఆర్థిక విభాగం ఆదేశాలు జారీ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. బీఎస్ఎన్ఎల్ తీవ్ర ఆర్థిక సవాళ్లతో సతమతమవుతున్న నేపథ్యంలో తాజా ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘బీఎస్ఎన్ఎల్ తాత్కాలికంగా ఆర్థిక ఒత్తిళ్లు ఎదుర్కొంటోందని, ఇప్పటికే పేరుకుపోయిన రుణభారాలను తీర్చే పరిస్థితుల్లో లేదని సర్కిల్ హెడ్స్‌కు పంపిన ఆర్డరులో కంపెనీ పేర్కొంది‘ అని బీఎస్ఎన్ఎల్ వర్గాలు తెలిపాయి. పెట్టుబడి వ్యయాలను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ డాట్ నుంచి ఆదేశాలు రావడంతో బీఎస్ఎన్ఎల్ ఈ మేరకు ఆర్డరు జారీ చేసినట్లు వివరించాయి. ప్రైవేట్ టెలికం సంస్థలు ఓవైపున వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తుండగా.. వాటితో పోటీపడేందుకు 4జీ స్పెక్ట్రం కేటాయింపుల కోసం బీఎస్ఎన్ఎల్ ఇంకా ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురుచూస్తోంది. హై స్పీడ్ ఇంటర్నెట్ను అందించేందుకు అనువుగా భారీ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ ఉన్నప్పటికీ అందుకు అవసరమైన పరికరాలు ఇంకా కొనుగోలు చేయాల్సి ఉంది. నిధుల సమీకరణ కోసం రియల్ ఎస్టేట్ ఆస్తులను విక్రయించే ప్రతిపాదనను పంపినప్పటికీ కేంద్రం దానిపై నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టింది. ఇవన్నీ బీఎస్ఎన్ఎల్ కార్యకలాపాల విస్తరణకు అడ్డంకులుగా మారాయి. 2014–15లో రూ. 672 కోట్ల నిర్వహణ లాభం ఆర్జించిన బీఎస్ఎన్ఎల్ ఆ తర్వాత ఆర్థిక సంవత్సరంలో రూ. 3,885 కోట్లు, 2016–17లో రూ. 1,684 కోట్ల నిర్వహణ లాభాలు ఆర్జించింది. రిలయన్స్ జియో రాకతో మిగతా టెల్కోల తరహాలోనే బీఎస్ ఎన్‌ఎల్‌పై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం పడిన సంగతి తెలిసిందే. టెలికం రంగంలో గతంలో ఎన్నడూ లేనంత భీకరమైన పోటీ నెలకొందంటూ కంపెనీ ఫైనాన్స్ విభాగం డైరెక్టర్ ఎస్కే గుప్తా గత నెలలో చీఫ్ జనరల్ మేనేజర్స్‌కు రాసిన లేఖలో వ్యాఖ్యానించారు. పోటీ సంస్థలు ఆఫర్ చేస్తున్న అత్యంత చౌకైన టారిఫ్‌ల కారణంగా కంపెనీ ఆదాయం గణనీయంగా పడిపోయిందని అందులో ఆయన పేర్కొన్నారు. -
శానిటరీ మేస్త్రీ ఆత్మహత్య
విజయవాడ(చిట్టినగర్): శానిటరీ మేస్త్రీ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తపేట పోలీస్‌స్టేçÙన్ పరి«ధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం కేఎల్‌రావునగర్ వీఎంసీ కాలనీకి చెందిన వడ్డాది ఏడుకొండలు కార్పొరేషన్ ప్రజారోగ్య విభాగంలో శానిటరీ మేస్త్రీగా ఉద్యోగం చేస్తుంటాడు. భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఇంటి అవసరాల నిమిత్తం రూ.ఆరు లక్షలు అప్పులు చేశాడు. అప్పు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి అడుగుతారనే ఆందోళనతో ఆదివారం సాయంత్రం పాముల కాల్వ సమీపంలో తన బైక్‌లోని పెట్రోల్ ఒంటిపై పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్రగాయాలతో ఆస్పత్రికి తరలించిన ఏడుకొండలు చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యాబిడ్డలపై గొడ్డలితో దాడి.. ఆత్మహత్య
అచ్చంపేట(మహబూబ్‌నగర్): కుటుంబ కలహాలకు తోడు ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోవడంతో విచక్షణ కోల్పోయిన భర్త భార్యను కత్తితో కిరాతకంగా నరికి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భార్య చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన వెంకటయ్య(46), దాలమ్మ 40 దంపతులకు నలుగురు సంతానం. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న వీరి మధ్య తరచు గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో శనివారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన వెంకటయ్య భార్యతో పాటు పిల్లలను చంపేందుకు గొడ్డలితో దాడి చేశాడు. దీంతో భయపడిపోయిన దాలమ్మ పిల్లలను పక్కింట్లో పడుకోబెట్టి భర్తతో వాదులాడుతుండగా.. కోపోద్రిక్తుడైన భర్త కత్తితో ఆమె పై దాడి చేశాడు. అనంతరం భార్య చనిపోయిందనుకొని ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమె కేకలు విన్న స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కుషాయిగూడలో వ్యక్తి ఆత్మహత్య
హైదరాబాద్: కుషాయిగూడ పోలీసుస్టేషన్ పరిధిలోని సోనియాగాంధీనగర్‌లో నరసింహాచారి(35)అనే వ్యక్తి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులతోనే నరసింహాచారి ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. పోస్ట్‌మార్టమ్ కోసం మృతదేహాన్ని గాంధీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న యువకుడు
రుద్రంపూర్(ఖమ్మం): ఆర్థిక ఇబ్బందులతో యువకుడు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో సోమవారం జరిగింది. వివరాలు.. కొత్తగూడెం మున్సిపాలిటి పరిధిలోని పదో వార్డుకు చెందిన సానబోయిన వెంకట నగేష్(32) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో వినాయక శోభాయాత్రలో పాల్గొని ఉదయమే ఇంటికి చేరకున్న నగేష్ ఇంటి దగ్గర పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.