రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామంలో దామర నవీన్(19) అనే బీ.టెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
రాజానగరం (తూర్పు గోదావరి జిల్లా) : రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామంలో దామర నవీన్(19) అనే బీ.టెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం తన రూంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ముగ్గురు స్నేహితులతో కలిసి నవీన్ ఓ రూంలో ఉంటూ చదువుకుంటున్నాడు. కాగా మంగళవారం కాలేజీకి వెళ్లలేదు. సాయంత్రం కాలేజీ నుంచి రూమ్కి వచ్చిన స్నేహితులు తలుపు కొడితే తీయకపోయేసరికి బద్దలు కొట్టారు. రూంలో నవీన్ ఉరివేసుకుని విగతజీవిగా కనిపించడంతో బిత్తరపోయారు.
నవీన్ మండలంలోని గోదావరి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. నవీన్ స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన ప్రదేశంలో ఓ సూసైడ్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సూసైడ్ నోట్‌లో ‘మమ్మీ ఐ లవ్ యూ, డాడీ ఐ లైక్ యూ’ అని మాత్రమే రాసి ఉంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.