కుమారుడు మాట వినలేదని తండ్రి ఆత్మహత్య
Published Fri, Dec 16 2016 11:58 PM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
రాజానగరం :
కొడుకు తన మాట వినలేదన్న కోపంతో ఓ తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలిలావున్నాయి. గండేపల్లి మండలం మల్లేపల్లికి చెందిన బొడ్డుపాటి కృష్ణ అనే రాధాకృష్ణ (38) తాపీ పని చేస్తుంటాడు. రాజానగరంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న తన కుమారుడిని తనతోపాటు కూలీకి రమ్మన్నాడు. ‘నేను చదువుకోవాలి నాన్నా.. పనికి రాలేను’ అని ఆ బాలుడు బదులివ్వడంతో తన మాట లెక్కచేయడం లేదనే కోపంతో ఆ కన్న తండ్రి ‘నేను లేకపోతే తెలుస్తుందిరా, నేనంటే ఏంటో’ అంటూ గురువారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కోపంతో ఇంటి నుంచి వెళ్లిన కృష్ణ రాజానగరం చేరుకుని ‘కొడుకు నా మాట వినడం లేదు, నేను మందు తాగేస్తున్నా’నంటూ రాత్రి 9 గంటల సమయంలో మల్లేపల్లిలో తనకు పని ఇచ్చే తాపీ మేస్త్రి రాంబాబుకి ఫో¯ŒS చేసి చెప్పాడు. మందు అంటే మద్యం అనుకుని తేలిగ్గా తీసుకున్న రాంబాబు కొద్దిసేపటికి అనుమానం వచ్చి తిరిగి ఫో¯ŒS చేస్తే స్విచ్చాఫ్ అంటూ సమాధానం వచ్చింది. దానితో విషయాన్ని అతని భార్య, పిల్లలకు తెలియజేశాడు. రాత్రంతా అతని ఆచూకీ కోసం గాలించారు. కాని ప్రయోజనం లేకపోయింది. శుక్రవారం ఉదయం రాజానగరంలోని నరేంద్రపురం జంక్ష¯ŒS వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నాడనే విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇదే సమయంలో కృష్ణ కోసం గాలిస్తున్న అతని బంధువులు కూడా అక్కడకు రావడంతో ఆ మృతదేహాన్ని కృష్ణదిగా గుర్తించారు. పురుగుల మందు తాగి మరణించినట్టుగా కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై దుర్గాశ్రీనివాసరావు తెలిపారు. మృతునికి భార్య, 15, 12 ఏళ్ల ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Advertisement