ఓ బీటెక్ విద్యార్థి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది.
జవహర్‌నగర్ (రంగారెడ్డి జిల్లా) : ఓ బీటెక్ విద్యార్థి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ అంజయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కీసర మండలం దమ్మాయిగూడలోని శివనందపురికాలనీలో నివాసముండే సాయికిరణ్(25) ఘట్‌కేసర్‌లోని సంస్కృతి ఇంజినీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
సాయికిరణ్ తల్లిదండ్రులు అతడి చిన్నతనంలోనే చనిపోవడంతో తాతయ్య కేదారి వద్ద ఉంటున్నాడు. కాగా సాయికిరణ్ బుధవారం అర్ధరాత్రి ఇంట్లో ఫ్యాన్ కొక్కేనికి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం తెల్లవారుజామున కేదారి చూడగా అప్పటికే మృతిచెందాడు. పోలీసులు మృతదేహానికి గురువారం గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. అయితే యువకుడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది.