నల్లగొండ రైల్వేస్టేషన్ సమీపంలో ఓ బీటెక్ విద్యార్థి రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు.
నల్లగొండ : నల్లగొండ రైల్వేస్టేషన్ సమీపంలో ఓ బీటెక్ విద్యార్థి రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. మృతుడు మహబూబ్‌నగర్ జిల్లా వీపనగండ్ల మండలం గూడెం గ్రామానికి చెందిన హరికృష్ణగా గుర్తించారు.
ఇతడు మహాత్మాగాంధీ వర్సిటీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. నల్లగొండ రైల్వే స్టేషన్‌కు సమీపంలోని ఫ్లైఓవర్ కింద పట్టాలపై తన మృతదేహం ఉంటుందని, వచ్చి తీసుకెళ్లాలంటూ ఆత్మహత్యకు ముందు హరికృష్ణ తన మిత్రుడికి ఎస్‌ఎంఎస్ పంపినట్టు పోలీసులు గుర్తించారు. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.