ఘట్‌కేసర్, న్యూస్‌లైన్: బైకును ఆటో ఢీకొనడంతో ఓ బీటెక్ విద్యార్థి దుర్మణం చెందాడు. ప్రమాదంలో మరో విద్యార్థికి గాయాలు అయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలోని జోడిమెట్ల సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని కొత్తపేట ప్రాంతంలోని టెలిఫోన్ కాలనీకి చెందిన తాళ్లపాక రాంమోహన్‌రావు కుమారుడు సందీప్ ఘట్‌కేసర్ మండల పరిధిలోని అనురాగ్ కాలేజీలో ఇంజినీరింగ్ నాలుగో ఏడాది చదువుతున్నాడు.
నగరంలోని తార్నాకలో నివాసం ఉండే కరుణకాంత్ సందీప్ క్లాస్‌మేట్. ఇద్దరూ మంచి స్నేహితులు. శుక్రవారం సందీప్ బైకుపై కళాశాలకు బయలుదేరాడు. మండల పరిధిలోని జోడిమెట్ల వద్ద కరుణకాంత్‌కు స్నేహితుడు లిఫ్ట్ ఇచ్చాడు. కొద్దిదూరం వెళ్లాక మరో 5 నిమిషాల్లో కళాశాలకు చేరుకోవాలి ఉండగా ఎదురుగా వచ్చిన ఆటో వీరి బైకును ఢీకొంది. ప్రమాదంలో సందీప్‌కు తీవ్రగాయాలై రక్తస్రావం జరిగి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. బైకు వెనుకాల కూర్చున్న కరుణకాంత్ ఎడమ చేయి విరిగింది. చికిత్స నిమిత్తం అతడిని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సందీప్ మృతదే హానికి నగరంలోని గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. ఎదిగి వచ్చిన కుమారుడు మృత్యువాత పడ్డాడని సందీప్ తల్లిదండ్రులు రోదించిన తీరు హృదయ విదారకం. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి
Published Sat, Jan 4 2014 12:13 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement