![HYD:Young Man Met With An Accident Three Days Before Marriage, Died - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/2/road-accident.jpg.webp?itok=-0_En-3Y)
వట్టిపల్లి రాజు (ఫైల్)
సాక్షి, హైదరాబాద్: నాలుగు రోజుల్లో పెళ్లి అనగా ఓ యువకుడు బైక్‌పై వెళుతుండగా కారు ఢీకొంది. ఈ సంఘటనలో చికిత్స పొందుతూ బాధితుడు మృతి చెందాడు. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. ఎదులాబాద్‌కు చెందిన వట్టిపల్లి రాజు (28) ఘట్‌కేసర్ ఈశ్వర గ్యాస్ ఏజన్సీలో పనిచేస్తున్నాడు. ఏప్రిల్ 14న అతడి వివాహం కావాల్సి ఉంది. ఏప్రిల్ 10న ఎంనంపేట్ చౌరస్తా నుంచి సోదరితోపాటు బైక్‌పై వస్తున్నాడు.
మైసమ్మగుట్ట బీపీసీఎల్ పెట్రోల్ బంక్ వద్దకు రాగానే ఎన్‌ఎఫ్‌సీనగర్‌కు చెందిన వినయ్ కారును నడుపుతూ రాజు ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టాడు. రాజు, అతడి సోదరికి గాయాలు కాగా గాంధీ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. రాజు చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. దీంతో ఎదులాబాద్ గ్రామస్తులు వందలాది మంది కారు యజమాని ఇంటి ఎదుట శవం ఉంచి నిరసన తెలిపారు. పోలీసులు నచ్చచెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
చదవండి: సిద్ధిపేట జిల్లాలో కేఏ పాల్‌పై టీఆర్‌ఎస్ నేతల దాడి
Comments
Please login to add a commentAdd a comment