
సాక్షి, విజయవాడ : కృష్ణాజిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని ఆగిరిపల్లిలో బీటెక్ విద్యార్థినిపై సీనియర్ విద్యార్థులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఎన్‌ఆర్‌ఐ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాలేజీలో చదువుతున్న బీటెక్ విద్యార్థిని సీనియర్లు అయిన శివారెడ్డి, కృష్ణారెడ్డి పుట్టినరోజు పార్టీ పేరిట పిలిచారు. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి.. ఆమెకు ఇచ్చారు. ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత అత్యాచారం చేస్తూ.. వీడియో చిత్రీకరించారు. జరిగిన దారుణం గురించి బాధితురాలు కుటుంబసభ్యులకు వివరించింది.
కుటుంబసభ్యులు కాలేజీని వెళ్లి నిలదీయడంతో.. కాలేజీ కరస్పాండెంట్ సమక్షంలో పంచాయతీ నిర్వహించి.. బాధితురాలికి నిందితులతో క్షమాపణలు చెప్పించారు. అనంతరం సీనియర్ విద్యార్థుల ఫోన్ల నుంచి వీడియోలు డిలీట్ చేశారు. ఈ ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత ప్రవీణ్ అనే మరో సీనియర్ వద్ద ఈ వీడియో చూసింది. అతను ఈ వీడియోను చూపిస్తూ.. బాధితురాలిని బ్లాక్‌మెయిల్ చేశాడు. తన కోరిక తీర్చాలని, రూ. పది లక్షలు ఇవ్వాలని అతడు డిమాండ్ చేశాడు. దీంతో ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్‌లో తల్లిదండ్రులతో కలిసి బాధితురాలు ఫిర్యాదు చేశారు. దీంతో సీనియర్లు కృష్ణారెడ్డి, శివారెడ్డి, ప్రవీణ్‌లపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment