
వాషింగ్టన్: విమానంలో సహ ప్రయాణికురాలిని లైంగికంగా వేధించిన కేసులో అమెరికా పోలీసులు భారతీయుడొకరిని అరెస్ట్ చేశారు. ప్రభు రామమూర్తి అనే వ్యక్తి టెక్నాలజీ గ్రూప్‌లో ప్రాజెక్టు మేనేజర్‌గా పనిచేస్తూ అమెరికాలో ఉంటున్నారు. ఈయన భార్య తాత్కాలిక వీసాపై వచ్చారు. బుధవారం ఇద్దరూ కలిసి స్పిరిట్ ఎయిర్‌లైన్స్ విమానంలో లాస్‌వెగాస్ నుంచి డెట్రాయిట్‌కు బయల్దేరారు. రామమూర్తికి ఓ వైపు భార్య, మరో వైపు ఓ యువతి(22) కూర్చుని ఉన్నారు. అయితే, సదరు యువతి నిద్రిస్తున్న సమయంలో రామమూర్తి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలు విమాన సిబ్బందికి ఫిర్యాదు చేయటంతో మిషిగాన్‌లో విమానం ఆగిన సమయంలో ఫెడరల్ పోలీసులు రామమూర్తిని అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment