వాషింగ్టన్: చికాగోలో హైదరాబాదీపై కాల్పులు కలకలం సృష్టించాయి. పాతబస్తీ చంచల్ గూడకు చెందిన సిరాజ్‌పై కొందరు దుండగులు కాల్పులు జరిపారు. డిసెంబర్ 4న ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిరాజ్ అమెరికాలో పనిచేస్తున్నాడు. డిసెంబర్ 4 తెల్లవారుజామున ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుండగా.. డెవాన్ ఉత్తరాన అతని కారుపై గుర్తు తెలియని షూటర్లు నాలుగుసార్లు కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తూ అతను సురక్షితంగా బయటపడ్డారు. కారు వెనుక సీటు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ సంఘటనలో కొన్ని ఆటోమేటిక్ గన్స్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. కాల్పుల విషయాన్ని విదేశాంగ మంత్రి, భారత ప్రభుత్వం, యుఎస్ఎలోని భారత రాయబారి, చికాగోలోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్ దృష్టికి తీసుకెళ్లినట్టు సిరాజ్ కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment