Jaipur Train Firing: Owaisi Request KTR To Help Hyderabadi Victim - Sakshi
Sakshi News home page

జైపూర్‌ ట్రైన్‌ కాల్పుల్లో హైదరాబాదీ మృతి.. ఆదుకోవాలని కేటీఆర్‌కు ఒవైసీ ట్వీట్‌

Published Tue, Aug 1 2023 6:29 PM | Last Updated on Tue, Aug 1 2023 6:38 PM

Jaipur Train Firing: Owaisi Request KTR To Help Hyderabadi Victim - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జైపూర్‌ ట్రైన్‌ కాల్పుల ఘటనలో హైదరాబాదీ మృతి చెందాడు. ఈ విషయాన్ని ప్రకటించిన ఎంఐఎం అధినేత, నగర ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ.. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలంటూ ట్విటర్‌ ద్వారా మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశాడు. 

జైపూర్‌-ముంబై ట్రైన్‌ కాల్పుల్లో హైదరాబాద్‌ నాంపల్లి బజార్‌ఘాట్‌ చెందిన సయ్యద్‌ సైఫుల్లా మృతి చెందాడు. అతనికి భార్యా, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. చిన్న కూతురికి ఆరు నెలల వయసే ఉంది. మృతదేహాన్ని రప్పించడంలో నాంపల్లి ఎమ్మె‍ల్యే చొరవ చూపిస్తున్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలంటూ మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్‌ చేశారాయన. 

ఇదిలా ఉంటే.. రాజస్థాన్‌ జైపూర్‌ నుంచి ముంబై వెళ్తున్న జైపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. రైలు పాల్ఘడ్‌(మహారాష్ట్ర) చేరుకున్న టైంలో.. ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ చేతన్‌ సింగ్‌ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో అతని సీనియర్‌ అధికారి  ఏఎస్సైఐ టికా రామ్‌ మీనా, మరో ముగ్గురు మృతి చెందారు. ఆపై దహిసర్‌ స్టేషన్‌ వద్ద రైలు దూకి చేతన్‌ పారిపోగా.. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. షార్ట్‌టెంపర్‌తోనే అతను ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అధికారులు చెబుతుండగా.. మరోవైపు ఉగ్రదాడి కోణం అంటూ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ నడుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement