Jaipur Express
-
జైపూర్ ట్రైన్ కాల్పుల్లో హైదరాబాదీ మృతి.. కేటీఆర్‌కు ఒవైసీ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: జైపూర్ ట్రైన్ కాల్పుల ఘటనలో హైదరాబాదీ మృతి చెందాడు. ఈ విషయాన్ని ప్రకటించిన ఎంఐఎం అధినేత, నగర ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలంటూ ట్విటర్ ద్వారా మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశాడు. జైపూర్-ముంబై ట్రైన్ కాల్పుల్లో హైదరాబాద్ నాంపల్లి బజార్‌ఘాట్ చెందిన సయ్యద్ సైఫుల్లా మృతి చెందాడు. అతనికి భార్యా, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. చిన్న కూతురికి ఆరు నెలల వయసే ఉంది. మృతదేహాన్ని రప్పించడంలో నాంపల్లి ఎమ్మెల్యే చొరవ చూపిస్తున్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలంటూ మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేశారాయన. ఇదిలా ఉంటే.. రాజస్థాన్ జైపూర్ నుంచి ముంబై వెళ్తున్న జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. రైలు పాల్ఘడ్(మహారాష్ట్ర) చేరుకున్న టైంలో.. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో అతని సీనియర్ అధికారి ఏఎస్సైఐ టికా రామ్ మీనా, మరో ముగ్గురు మృతి చెందారు. ఆపై దహిసర్ స్టేషన్ వద్ద రైలు దూకి చేతన్ పారిపోగా.. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. షార్ట్‌టెంపర్‌తోనే అతను ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అధికారులు చెబుతుండగా.. మరోవైపు ఉగ్రదాడి కోణం అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ నడుస్తోంది. The fourth victim of the #JaipurExpressTerrorAttack has been identified as Syed Saifullah. He was a resident of Bazaarghat, Nampally. He is survived by 3 daughters, the youngest is just 6 months old. AIMIM Nampally MLA @Jaffarhusainmla is with the family for the past few hours &… — Asaduddin Owaisi (@asadowaisi) August 1, 2023 -
జైపూర్-ముంబై ఎక్స్‌ప్రెస్‌లో కాల్పుల కలకలం.. నలుగురు మృతి
ముంబై: మహారాష్ట్ర: జైపూర్-ముంబై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ రైలులో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. కదులుతున్న రైలులో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌కు(ఆర్పీఎఫ్) చెందిన పోలీసు తన వద్దనున్న తుపాకీతో ప్రయాణికులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆర్పీఎఫ్ ఏఎస్సై సహా నలుగురు మృత్యువాతపడ్డారు. జైపూర్ నుంచి ముంబై వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలులో సోమవారం ఉదయం 5 గంటలకు పాల్ఘర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ కాల్పులు జరిగాయి. కాల్పులు తెగబడిన వ్యక్తిని ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ సింగ్‌గా గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు బోరివలి స్టేషన్‌కు తరలించారు. దీనిపై దర్యాప్తు జరుపుతున్నారు. చదవండి: చిన్నారుల అక్రమ రవాణాలో యూపీ టాప్ VIDEO | Railway Protection Force (RPF) jawan opens firing inside Jaipur-Mumbai train killing four people: Official. The jawan has been arrested and brought to Borivali Police Station. pic.twitter.com/86cFwbt3cq — Press Trust of India (@PTI_News) July 31, 2023 -
పట్టాలు తప్పిన లోకల్ రైలు
గుమ్మిడిపూండి, న్యూస్‌లైన్ : డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో విద్యుత్ లోకల్ రైలు పట్టాలు తప్పింది. ఈ సంఘటన గుమ్మడిపూండిలో మంగళవారం ఉదయం జరిగింది. చెన్నై నుంచి సోమవారం రాత్రి గుమ్మిడిపూండికి వచ్చిన లోకల్ రైలు షెడ్డులో ఉంది. ఈ రైలు మంగళవారం ఉదయం 4.30 గంటలకు గుమ్మిడిపూండి నుంచి చెన్నైకి వెళ్లాల్సి ఉంది. 4.20 గంటల ప్రాంతంలో డ్రైవర్ లేకపోవడంతో సహాయ డ్రైవర్ షెడ్డు నుంచి 4వ నెంబరు ప్లాట్‌ఫాం మీదకు రైలును తీసుకువస్తున్నాడు. ఆ సమయంలో మామూలుగా 5 కిలోమీటర్లు వేగంతో రావాలి. మలుపు వద్ద 20 కిలో మీటర్ల వేగంతో బండి నడవడంతో 7వ బాక్స్ చక్రాలు పట్టాలు తప్పాయి. దీంతో పెద్ద చప్పుడుతో దుమ్ము, కంకర లేచింది. ఆ సమయంలో పక్కనే ఉన్న విద్యుత్ సంభాలు నేలకొరిగి పట్టాలకు అడ్డంగా పడిపోయాయి. విద్యుత్ లైన్ తెగిపోయింది. దీంతో విద్యుత్ సరఫరా ఆగిపోయి గుమ్మిడిపూండి వైపు వెళ్లే బండ్లు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న చెన్నై రిస్కు టీమ్ ప్రత్యేక రైలులో వచ్చి పట్టాలు తప్పిన బోగీలను తొలగించి, పడిపోయిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త వాటిని బిగించారు. ఈ సంఘటన కారణంగా 5 గంటల సేపు గుమ్మిడిపూండికి వచ్చే, వెళ్లే బండ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఆంధ్ర వైపు నుంచి వస్తున్న జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైలును గుమ్మిడిపూండి, పొన్నరి స్టేషన్లో ఆపి ప్రయాణికులను చెన్నైకి తరలించారు. అధికారుల ఆదేశాల మేరకు చెన్నై నుంచి వచ్చే లోకల్ రైళ్లు పొన్నేరి వరకు నడిచాయి. అధికారులు సకాలంలో స్పందించడంతో ఉదయం 11 గంటలకు రైళ్లు యధావిధిగా నడిచాయి. ఈ సంఘటన వలన ఉదయం వివిధ పనులకు వెళ్లే ఉద్యోగాలు, వ్యాపారులు, విద్యార్థులు, తీవ్ర ఇబ్బంది పడ్డారు. చెన్నై - గుమ్మిడిపూండిల మధ్య ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నా అధికారులు తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి చర్యలు జరుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.