RPF police among 4 killed in Mumbai Central-Jaipur Express - Sakshi
Sakshi News home page

జైపూర్‌-ముంబై ఎక్స్‌ప్రెస్‌లో కాల్పుల కలకలం.. నలుగురు మృతి

Published Mon, Jul 31 2023 8:33 AM | Last Updated on Mon, Jul 31 2023 10:53 AM

RPF Police Among 4 Killed In Firing Inside Mumbai Central Jaipur Express - Sakshi

ముంబై: మహారాష్ట్ర: జైపూర్‌-ముంబై సెంట్రల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. కదులుతున్న రైలులో రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌కు(ఆర్‌పీఎఫ్‌) చెందిన పోలీసు తన వద్దనున్న తుపాకీతో ప్రయాణికులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆర్‌పీఎఫ్‌ ఏఎస్సై సహా నలుగురు మృత్యువాతపడ్డారు.

జైపూర్‌ నుంచి ముంబై వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైలులో సోమవారం ఉదయం 5 గంటలకు పాల్ఘర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ కాల్పులు జరిగాయి. కాల్పులు తెగబడిన వ్యక్తిని ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ చేతన్‌ సింగ్‌గా గుర్తించారు. నిందితుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు బోరివలి స్టేషన్‌కు తరలించారు. దీనిపై దర్యాప్తు జరుపుతున్నారు.
చదవండి: చిన్నారుల అక్రమ రవాణాలో యూపీ టాప్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement