
ఐవోవా: అమెరికాలోని ఐవోవా రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. అనుమానాస్పద స్థితిలో నలుగురు తెలుగు వాళ్లు మృతిచెందారు. మృతులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుంకర చంద్రశేఖర్, లావణ్య, వారి ఇద్దరు పిల్లలుగా గుర్తించారు. చంద్రశేఖరే భార్యా పిల్లల్ని కాల్చి చంపి ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నట్లుగా స్థానిక పోలీసులు నిర్ధారణకు వచ్చారు. చంద్రశేఖర్ మానసిక స్థితి కొంతకాలంగా సరిగా లేనట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఈ మేరకు అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment