telugu families
-
భార్యాబిడ్డల్ని కాల్చి చంపి.. తానూ కాల్చుకుని
వాషింగ్టన్: అమెరికాలో శనివారం అనుమానాస్పదరీతిలో మృతి చెందిన తెలుగు కుటుంబం మిస్టరీ వీడింది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా వింజనంపాడుకు చెందిన చంద్రశేఖర్‌రెడ్డి తాళి కట్టిన భార్యను, జన్మనిచ్చిన బిడ్డలను కాల్చి చంపి ఆపై తానూ కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు అమెరికా పోలీసులు ధ్రువీకరించారు. అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలో వెస్ట్‌డెస్ మోయిన్స్‌లో యాష్‌వర్త్ రోడ్డు– అస్పెన్ డ్రైవ్‌ల మధ్య ఉన్న 65వ స్ట్రీట్‌లో నివాసం ఉంటున్న సుంకర చంద్రశేఖరరెడ్డి (44), ఆయన భార్య లావణ్య (41), కుమారులు ప్రభాస్ (15), సుహాన్ (10)లు శనివారం తుపాకీ తూటాల గాయాలతో అనుమానాస్పదరీతిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆదివారం ఈ నాలుగు మృతదేహాలకు శవపరీక్ష అనంతరం సోమవారం అమెరికాలోని లోవా రాష్ట్ర పోలీసులు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆయుధం కలిగి ఉండేందుకు చంద్రశేఖర్‌రెడ్డికి ప్రభుత్వం అనుమతిచ్చిందని పోలీసులు తెలిపారు. అయితే ఆయన ఎక్కడ తుపాకీని కొనుగోలు చేసింది విచారిస్తున్నట్లు వివరించారు. అలాగే ఐటీ నిపుణుడిగా పని చేస్తున్న చంద్రశేఖర్‌రెడ్డి 2018లో 1,05,000 డాలర్లు సంపాదన ఆర్జించినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి 25న 5,70,000 డాలర్లు వెచ్చించి చంద్రశేఖర్‌రెడ్డి, లావణ్య దంపతులు ఓ ఇంటిని కొనుగోలు చేసినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్‌రెడ్డి ఇలాంటి దుశ్చర్యకు ఎందుకు పాల్పడ్డాడనే దానిపై అన్ని కోణాల్లో విచారిస్తున్నామని, ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరికే వరకు పూర్తి స్థాయి విచారణ కొనసాగిస్తామని వెల్లడించారు. అయితే ఈ మరణాలకు ముడిపెట్టి ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అమెరికాలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నాయని పోలీసులు స్పష్టం చేశారు. -
అమెరికాలో దారుణం
ఐవోవా: అమెరికాలోని ఐవోవా రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. అనుమానాస్పద స్థితిలో నలుగురు తెలుగు వాళ్లు మృతిచెందారు. మృతులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుంకర చంద్రశేఖర్, లావణ్య, వారి ఇద్దరు పిల్లలుగా గుర్తించారు. చంద్రశేఖరే భార్యా పిల్లల్ని కాల్చి చంపి ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నట్లుగా స్థానిక పోలీసులు నిర్ధారణకు వచ్చారు. చంద్రశేఖర్ మానసిక స్థితి కొంతకాలంగా సరిగా లేనట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఈ మేరకు అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అల్లాడుతున్న తెలుగు కుటుంబాలు
-
అల్లాడుతున్న తెలుగు కుటుంబాలు
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో ఇర్మా హరికేన్ ధాటికి వేల సంఖ్యలో తెలుగు కుటుంబాలు అల్లాడుతున్నాయి. ఒక్క ఫ్లోరిడాలోనే దాదాపు ఆరు వేల వరకు తెలుగు కుటుంబాలున్నాయి. తీర ప్రాంతాల్లో ఇర్మా ప్రభావం తీవ్రంగా ఉండటంతో అక్కడి అధికారులు ప్రజలను వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించారు. దీంతో నిరాశ్రయు లైన తెలుగు ప్రజలకు ఇతర రాష్ట్రాలు, నగరాల్లోని తెలుగువారు బాసటగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఫ్లోరిడా నుంచి దాదాపు వెయ్యి తెలుగు కుటుం బాలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడి తెలుగు సంఘాలు అప్రమత్తమై ఇర్మా బాధితుల్లో ఉన్న తెలుగువారి జాడ కోసం ప్రయత్నిస్తున్నాయి. సమీపంలోని ఇతర నగరాల్లో ఉన్న తెలుగువారితో సంప్రదించి వీలైనంత ఎక్కువ మందికి ఆశ్రయం కల్పించేలా చూస్తున్నాయి. ఇక వేరే నగరాల్లోని స్నేహితులు, బంధువుల వద్దకు వెళ్తున్నవారి సంఖ్యా ఎక్కువగానే ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక గవర్నర్ రిక్ స్కాట్ పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సురక్షిత కేంద్రాల్లో దాదాపు 50 వేల మంది వరకు తలదాచుకుంటున్నారు. ఇందులో కొన్ని తెలుగు కుటుంబాలు కూడా ఉన్నాయి. ప్రాణనష్టం లేకుండా యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తోంది. -
జెడ్డాలో ఉగాది సంబరాలు
జెడ్డా: సౌదీ అరేబియాలోని జెడ్డా, పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న తెలుగు ప్రవాసీ కుటుంబాలు తెలుగు అసోసియెషన్ ఆఫ్ జెద్ధా అధ్వర్యంలో ఉగాది పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. మన్మథ నామ ఉగాది పర్వదినం సందర్భంగా తమ చిన్నారులకు తెలుగు భాషను నేర్పించడానికి నిర్ణయించిందీ సంస్థ. ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న తెలుగు ముస్లిం కుటుంబ పెద్దలకు, వారి చిన్నారులకు ఇస్లామిక్ క్విజ్ మరియు ఖురాన్ గ్రంధ పోటీలను కూడ ఉగాది సందర్భంగా తాజ్ నిర్వహించింది. తాజ్ (తెలుగు అసోసియెషన్ ఆఫ్ జెద్ధా) అధ్వర్యంలో సిలికానాంధ్ర మనబడి సహాయంతో తెలుగు బోధన కార్యక్రమాలకు ప్రారంభించారు. గత రెండు సంవత్సరాలుగా తాము తాజ్ అధ్వర్యంలో తెలుగు బోధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పటికి ఉగాది నుండి దానికి పదును పెట్టడానికి సిలీకానంధ్ర మనబడితో కలిసామని తాజ్ ప్రధాన కార్యదర్శి కుంట సాగర్ చెప్పారు. ఈ సందర్భంగా సీలికానాంధ్ర మనబడి అంతర్జాతీయ విభాగానికి చెందిన శరత్ వేట అమెరికా నుండి ఫోన్ ద్వార సమావేశంలో పాల్గోన్న వారిను ఉద్దెశిస్తూ తెలుగు భాష అవశ్యకత గూర్చి నొక్కిచెప్పారు. గల్ఫ్ దేశాలలోని ప్రవాసీయుల ఆర్ధిక పరిస్ధితి మరియు ఇక్కడి పాఠశాలలో తెలుగు భాష అందుబాటులో ఉన్నందున మనబడి ఫీజు ఎడారి దేశాలలో తగ్గించాలని విజ్ఞప్తి చేసారు. తాజ్ అధ్యక్షుడు శేఖ్ మస్తాన్ మరియు ప్రధాన కార్యదర్శి కుంట సాగర్ మాట్లాడుతూ కుల,మత, ప్రాంతీయ విభేదాలకు అతీతంగా తమ సంఘం కేవలం తెలుగు ప్రవాసీయుల కొరకు పని చేస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా క్విజ్ లో గెలుపొందిన వారికి తాజ్ ప్రతినిధులు విజయలక్ష్మి, శారదాంబ, మీనాక్షి, సాగర్, మస్తాన్ , యూసుఫ్ లు బహమతులు ప్రధానం చేసారు. ప్రతిభ కనబర్చిన చిన్నారులను తాజ్ మహిళ విభాగం కార్యదర్శి విజయలక్ష్మి ప్రశంసించారు. -
నిలువనీడలేదు
భవనం కూలిన దుర్ఘటనలో రోడ్డుపాలైన తెలుగు కుటుంబాలు పరిచయస్తులు, బంధువులు.. ఇలా తలోచోట తలదాచుకుంటున్న వైనం భివండీ, న్యూస్‌లైన్ : నాలుగు రోజులగా నిలకడలేకుండా కురుస్తున్న వర్షాలు తెలుగు కుటుంబాలకు నిలువ నీడ లేకుండా చేశాయి. సర్వం కోల్పో దిక్కుతోచనిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. కొందరు బంధువులు, పరిచయస్తుల ఇళ్లలో ఆశ్రయం పొందగా, మరికొందరు అఖిల పద్మశాలి సమాజ్ మంగళ కార్యాలయంలో తలదాచుకున్నారు. సోమవారం కురిసిన వర్షం కారణంగా ప్రభాగ్ సమితి మూడు పరిధిలో గల పద్మనగర్ ప్రాంతంలోని పుల్లి నారాయణ మూడంతస్తుల భవనం ఉదయం కుప్ప కూలిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో సుమారు 40 తెలుగు కుంటుంబాలు వీధులపాలయ్యాయి. కూలిన భవన యజమాని ఎలాంటి సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నాడు..ఇల్లు కోల్పోయిన తమకు నష్ట పరిహారం ఎవరు చెలిస్తారని? ఇళ్లు కొనుగోలు చేసుకొని సంవత్సారాలు దాటినప్పటికీ ఇంటి యజమాని రిజిస్ట్రేషన్ చేసివ్వలేదు. మా పరిస్థితి ఎలా ? అని కన్నీటి పర్యంతమాయ్యారు. బాధితుల ఆవేదన వారి మాటల్లోనే.. యజమానితోపాటే కార్పొరేషన్ నిర్లక్ష్యం వేముల రామదాస్ బిల్డింగ్‌లో 900 చదరపు మీటర్ల మూడు రూములను కొనుగోలు చేసుకొని ఇక్కడే స్తిర పడ్డాను. పుల్లి నారాయణ భవనం పిల్లర్ పగులు పట్టిన వెంబడే ఆ భవనాన్ని కార్పొరేషన్ కూల్చినట్లైయితే పక్కనే ఉన్న మా భవనం పై పడేది కాదు. ఈ రెండు భవనాల మధ్య సందులో బాత్రూమ్ల పైప్ లైన్లు పగిలిపోయాయి. సుమారు 10 సంవత్సరాలుగా నీరంతా పునాదిలోకి వెళ్లినా భవన యజమానులు పట్టించు కోలేదు. పైప్ లైన్లు మరమ్మతులు చేపిస్తామని ప్రతి ఇంటి వద్ద 4 వేల రూపాయలు వసూలు చేసినా పనులు చేయలేదు. ఇప్పడు మా పరిస్థితి రోడ్డున పడింది. - జక్కని రాములు, కోనార్పేట, కరీంనగర్ జిల్లా మేం రోడ్డున పడ్డాం రామదాస్ భవనంలో 2006 సంవత్సరంలో ఇల్లు కొనుగోలు చేశాం. నా భర్త పవర్లూమ్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. నేనే దుస్తులు కుట్టే పని చేస్తాను. ఇలా భార్యాభర్తలం కష్టపడుతూ పిల్లలను చదివించుకుంటుంన్నాం. పని చేయక పోతే ఇల్లు గడిచేది కష్టంగా ఉన్న మా కుటుంబం ఒక్కసారిగా వీధుల పాలైంది. పక్కన ఉన్న భవనం కూలి మేం రోడ్డున పడ్డాం. మాకు ఎవరు న్యాయం చేస్తారు అర్థం కావటం లేదు. ఇప్పటి వరకు ఆ భవనం యజమాని మా ఇంటికి రిజిస్ట్రేషన్ చేసిఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో దుర్ఘటన సంభవించింది. నాల్గు రోజుల నుంచి అఖిల పద్మశాలి సమాజ్ మంగళ కార్యాలయంలో తలదాచుకుంటున్నాం. - రాపెల్లి అనిత బాలకృష్ణ నష్టపరిహారం ఎవరిస్తారు? 1990 సంవత్సరంలో రామదాస్ భవనంలో ఇండ్లు కొనుకున్నాం. మాకు ఇద్దరు పిల్లలు కాలేజీకి వెళుతున్నారు. నా భర్త చిన్న టీ కొట్టు వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అకస్మాత్తుగా భవనం ఖాలీ చేయించిన కార్పొరేషన్ అధికారులు ఎలాంటి వసతులు కల్పించ లేదు. అఖిల పద్మశాలి సమాజ్ మంగళ కార్యాలయంలో తల దాచుకుంటుంన్నాం. పక్కన భవనం కూలి మా భవనంపై పడితే దీనికి నష్ట పరిహారం ఎవరు చెలిస్తారని ? మా పరిస్థితి ఎవరు అర్థం చేసుకుంటారు.. ఎవరు ఆదుకుంటారు? -పూజారి లక్ష్మీ విశ్వనాథ్, మేగుళూర్ ఇంటికి రిజిస్ట్రేషన్ చేయలేదు 1990 లో రామదాస్ భవనంలో ఇల్లు కొనుగోలు చేశా. ఇప్పటి వరకు మాకు రిజిస్ట్రేషన్ చేయలేదు. నేను దర్జీగా విధులు నిర్వహిస్తూ మా కుంటుంబాన్ని పోషించుకుంటున్నా. గత నాలుగు నెలల క్రితమే పెండ్లి అయిన కొడుకు మృతి చెందాడు. ఇంతటి ఘోరమైన పరిస్థితుల్లో మాకు దిక్కులేకుండా పోయింది. ఇప్పుడు మేం వీధుల పాలయ్యాం. మాకు న్యాయం ఎవరు చేస్తారు. అక్రమంగా మూడంతస్తుల భవనం నిర్మించిన యజమానే మాకు నష్ట పరిహారం చెల్లించాలి. కూలిన భవనం పక్కనే ఉన్న తమ భవనం పై పడితే, మాకు న్యాయం చేయాల్సింది ఆ యజమానే. కానీ మాకు న్యాయం చేసేదెవరు? -మిట్టపల్లి సత్తయ్య, సిరిసిల్ల రూ. 12 లక్షణ నష్టం 1996 సంవతాసరం నుంచి పుల్లి నారాయణ భవనంలోని కింది అంతస్తులో 10 పవర్లూమ్ యంత్రాలను వేసుకొని వ్యాపారం చేస్తున్నా. ప్రస్తుతం ఈ భవనం భూమిలోకి ఇంకి పోయింది. సుమారు 12 లక్షల రూపాయల నష్టం వాటిల్లడమే గాకుండా మా కుటుంబ సభ్యులకు బతుకు దెరువు లేకుండా పోయింది. ఎలా బతుకాలి ? మాకు న్యాయం ఎవరు చేస్తారు ? ఇట్టి భవనంపై అక్రమంగా మూడు అంతస్తుల భవన నిర్మాణాలుట చేపటుతున్నప్పుడు యజమాని పుల్లి తిరుపతి తో విచారించగా కార్పొరేషన్ అనుమతి తీసుకొనే నిర్మించానని బుకాయించాడు. ఇప్పుడు కార్పొరేషన్ వారు పట్టించుకునే పరిస్థితి లేవు. మాకు న్యాయం చేయాలి. - బొల్లు రవీందర్ చర్యలు తీసుకోవాలి 333 గల భవనానికి ముగ్గురం యజమానులం. ఇందులో ఇళ్లు కొనుగోలు చేసుకున్న వారి గురించి త్వరలో అందరితో సమావేశం నిర్వహించి వీరందరికి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. పక్క భవనం కూలి మా భవనం పై పడితే దీనికి భాధ్యులం మేమా ? మేం ఇల్లు విడిచి దగ్గరి బంధువుల ఇంట్లో ఎన్నాలని ఉండాలి. పక్కన భవన యజమానిపై కార్పొరేషన్, సంబంధిత అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలి. నష్ట వాటిల్లిన వారికి పరిహారం చెల్లించాలి. -వేముల రాందాస్ నేను అప్పట్లో నిరాకరించా పుల్లి నారాయణ భవనాన్ని సుమారు 20 సంవత్సరాల క్రితం భవనాన్ని నిర్మానాలు చేపట్టినప్పడు ఇంజనీర్ సలహాలతోనే యజమాని చెప్పిన విధంగా నిర్మించాను. మూడు సంవత్సరాల క్రితం యజమాని పుల్లి నారాయణ మూడో అంతస్తు నిర్మాణానికై బిల్డర్‌కు ఇవ్వగా అప్పుడు నేను నిరాకరించా. కార్పొరేషన్ అధికారులను కట్టుకొని అక్రమంగా మూడంతస్తుల భవనం నిర్మాణం చేపట్టడంతోనే అధిక బరువుకు అది కుప్పకూలింది. దీనికి బాధ్యత కార్పొరేషన్ అధికారులా? కార్పోరేషన్ అధికారులా, యజమాని మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు. -భారత వెంకటయ్య