photo credit: GETTY IMAGES
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిని ఎన్నుకునే ప్రక్రియ వచ్చే నెల ప్రారంభం కానుంది. జనవరిలో అయోవా (iowa) రాష్ట్రంలో తొలి బ్యాలెట్ జరగనుంది. అయితే అయోవా ఓటింగ్‌కు మరికొద్ది రోజులే మిగిలి ఉండగా అధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి పోటీపడుతున్న భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త వివేక్ రామస్వామి కీలక నిర్ణయం తీసుకున్నారు.
‘ఎన్నికల ప్రచారంలో ఇక నుంచి టీవీ చానళ్లకు ప్రకటనలు ఇవ్వకూడదని నిర్ణయించాం. అలాగని మొత్తం ప్రకటనల బడ్జెట్‌ను తగ్గించ లేదు. సంప్రదాయ టీవీ కాకుండా వేరే మార్గాల్లో ఓటర్లను రీచ్ అవుతాం. టీవీ ప్రకటనలపై ఖర్చు పెడితే పెద్దగా ఉపయోగం ఉండటం లేదు’ అని వివేక్ రామస్వామి క్యాంపెయిన్ మేనేజర్ ట్రిసియా మెక్ లాలిన్ తెలిపారు.
అయితే తాను ఇప్పటికే క్యాంపెయినింగ్ కోసం 20 మిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు రామస్వామి స్వయంగా మీడియాకు తెలిపారు. ఇంత ఖర్చు చేసినప్పటికీ అయోవాలో రామస్వామివైపు రిపబ్లికన్లు పెద్దగా మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది.
అయోవాలో 10 శాతం రిపబ్లికన్ల ఓట్లు కూడా రామస్వామికి వచ్చే పరిస్థితులు లేవని సమాచారం. ఇక దేశవ్యాప్తంగా కూడా రామస్వామి గ్రాఫ్ రోజురోజుకు పడిపోతున్నట్లు తెలుస్తోంది. కాగా, రిపబ్లికన్ల తరపున ప్రధాని అభ్యర్థిత్వానికి పోటీలో ఉన్న వారిలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే హాట్ ఫేవరెట్‌గా దూసుకెళుతుండడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment